.
మామిడి పళ్ల సీజన్ కదా… అసలే మన తెలుగు రాష్ట్రాలు అంటేనే మధుమేహానికి, అంటే సుగర్ వ్యాధికి అడ్డాలు… తినకుండా ఉండలేరు… టెంప్టింగ్ టేస్ట్… కానీ అదేమో తీపి… తింటే పోతార్రోయ్ అని బెదిరించే యూట్యూబర్లు, మీడియా…
కొందరు మామిడి పళ్లకు బదులు మామిడికాయలు తినండి అంటారు… అంటే పళ్లకు బదులు పచ్చి మామిడి… (raw mango vs ripe mango)… కానీ దేని రుచి దానిదే, దేని పోషకాల విశిష్టత దానిదే… మామిడి ముక్కలు కోసుకుని తిన్నా (కట్ మ్యాంగో, కోత మామిడి), రసాలను జుర్రినా మరేరకంగా తీసుకున్నా కొంచెం మాత్రమే తేడా…
Ads
ముందుగా రెండింటి న్యూట్రిషనల్ వాల్యూ చూడండి ఓసారి…
పచ్చి మామిడి (మామిడి పండుతో పోలిస్తే) :…. విటమిన్ సి ఎక్కువ… అంటే ఇమ్యూనిటీకి యూజ్‌ఫుల్… ఫైబర్ ఎక్కువ… సుగర్ తక్కువ… ఎసిడిక్ నేచర్ (అంటే డయాబెటిస్ రోగులకు కాస్త బెటరే….) పొటాషియం, మెగ్నీషియం వంటివి సరేసరి…
మామిడి పండు (పచ్చి మామిడితో పోలిస్తే) :… విటమిన్ ఏ ఎక్కువ… నేచురల్ సుగర్స్ ఎక్కువ… యాంటీ యాక్సిడెంట్స్, పొటాషియం వంటి దాదాపు సేమ్… కానీ పండు పండే కదా… పచ్చి వగరుకన్నా తీపి రుచి కదా…
మామిడి కాయల జీఐ ఇండెక్స్ మామిడి పళ్లకన్నా కాస్త తక్కువ… అంటే స్లోగా సుగర్ రిలీజ్ కాబట్టి డయాబెటిక్ రోగులకు కాస్త బెటర్… మామిడి పళ్ల జీఐ ఇండెక్స్ కూడా మరీ ఎక్కువేమీ కాదు, తినగానే సుగర్ లెవల్ పెరిగిపోయేంత ఉండదు… 55 వరకూ ఉంటుంది… అంటే మీడియం రేంజ్…
అంటే… జాగ్రత్తగా, మితంగా తింటే పెద్ద ఫరక్ పడదు… ఒక మామిడి పండులో మూడో వంతు, అంటే దాదాపు 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుందట… తిన్న ప్రతిసారీ కాదు, రోజులో ఒకసారి, అదీ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో…
పైగా దాన్ని స్ట్రెయిటుగా తీసుకోవడంకన్నా పెరుగు, నట్స్‌తో తీసుకుంటే స్లో సుగర్ రిలీజ్ వల్ల సుగర్ లెవల్స్ మీద నెగెటివ్ రిజల్ట్ ఏమీ ఉండదని పలువురు పోషక నిపుణుల ఉవాచ…. ఈ లెక్కలన్నీ ఎందుకు..? పండు తినడమే మానేస్తే పోలా అంటారా..? కరెక్టే, ఓ ముక్క తనివితీరా టేస్ట్ చేసి, వదిలేయండి… తిన్నామనే కుతి (కోరిక- కాంక్ష) తీరడానికి… అనగా ఆత్మారాముడి తృప్తికి, ఆత్మ తృప్తికి..!!
Share this Article