.
అసందర్భంగా ఏదేదో వాగి, తలనొప్పులు క్రియేట్ చేసుకోవడంలో సినిమా సెలబ్రిటీలను మించినవారు ఉండరు… రాజకీయ నాయకుల బుర్రలు ఎంత పెళుసు అయినా సరే సినిమా సెలబ్రిటీలతో ఈ విషయంలో పోటీపడలేరు…
ఎందుకంటే…? సినిమా వాళ్ల బుర్రలు అలా ఏడుస్తాయి మరి… ఆమధ్య థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఏదో విష్వక్సేన్ సినిమా ఫంక్షన్‌లో ఏవేవో పిచ్చి కూతలు కూస్తే… ఓ సెక్షన్ ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలని క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది…
Ads
విష్వక్సేన్‌కు ఏడుపొక్కటే తక్కువ… తన తరఫున నేను సారీ చెబుతున్నాను అని చెప్పుకోవాల్సి వచ్చింది… సరే, ఆ సినిమా తన్నేసింది అది వేరే విషయం… ఎవరో బాయ్‌కాట్ అనగానే సరిపోదు, సినిమాలో సరుకుంటే దాని సక్సెస్‌ను ఏ బాయ్‌కాట్ పిలుపూ ఆపలేదు… కానీ ఎందుకీ గోక్కోవడం, దురద అనేదే ప్రశ్న…
పోనీ, నెగెటివ్ పబ్లిసిటీతో జనంలోకి వెళ్తుంది అనుకుంటే, అదీ మూర్ఖపు ఆలోచనే… సినిమాలో దమ్ము లేకపోతే ఏ పబ్లిసిటీ కాపాడదు.,. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? భైరవం అని ఓ సినిమా వస్తోంది…
అందులో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ నటించారు… అంటే, ఓ చిన్న స్థాయి మల్టీ స్టారర్… దర్శకుడు విజయ్ కనకమేడల… ఈమధ్య ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ… ‘‘ధర్మాన్ని కాపాడటానికి ఎవరో ఒకరు వస్తుంటారు, ఏడాది క్రితం ఏపీకి ఒకరు వచ్చారు, మా భైరవం కూడా అదే’’ అన్నట్టుగా ఏదో వ్యాఖ్యానించాడు…
పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించిన వ్యాఖ్యలు, ఒకరకంగా జగన్ పాలనను ఎత్తిపొడిచే వ్యాఖ్య అనుకున్న వైసీపీ బ్యాచ్ ఇక బాయ్‌కాట్ భైరవం అనే హ్యాష్ ట్యాగుతో నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది… అఫ్‌కోర్స్, సినిమా టీం ఏమీ స్పందించినట్టు లేదు…
నిజానికి అక్కడ రాజకీయ కూతలు దేనికి..? దీన్నే అసందర్భ గోకుడు, అనవసర దురద అంటారు… మంచు మనోజ్ కూడా తమ కుటుంబ కొట్లాటల గురించి ఏదేదో మాట్లాడుతూ పోయాడు… ఆ వేదిక ఏమిటి..? ఏం మాట్లాడుతున్నారు..?
శివయ్యా అంటే పిలిస్తే రాడు, నన్ను కట్టుబట్టలతో బయటపడేశారు వంటివి చెప్పుకోవడానికి ఆ వేదిక కరెక్టా..? మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులతో ఓ మీడియా మీట్ పెట్టి, ఈ ఆరోపణలన్నీ చేస్తే పర్లేదు… సినిమా వేదిక వాడుకోవడం దేనికి..? ఏది ఎక్కడ ఎంతవరకు మాత్రమే మాట్లాడాలో తెలిసినవాడు జ్ఞాని… దురదృష్టవశాత్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్లు కనిపించడం లేదు…
Share this Article