.
…. రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన IAS శరత్… నాడు ఉద్యమం చేసి రాష్ట్రాన్నే తెచ్చిన తండ్రిలాంటి డెబ్బయి ఏండ్ల కేసీఆర్ విషయంలో మొరిగిన మేధావులు Youtubers , intellectuals ఇప్పుడు ఎక్కడ ?…. ఇలాంటి పోస్టులతో పింక్ బ్యాచ్ అటాక్స్…
సరె సర్లె, అప్పుడు CM కాళ్ళు మొక్కిన కలెక్టర్ లక్షల కోట్ల అధిపతి అయిండు (బినామీ), MP టికెట్ సాధించిండు, వాడు రాజ్ పుష్పా ఐతే మనం పుష్పా రాజ్ అయినా కాలేమా అనుకున్నడేమో ఆ కలెక్టర్ మహాశయుడు… అంటూ డిఫరెంట్ కౌంటర్ అటాక్స్ యాంటీ బీఆర్ఎస్ బ్యాచ్ నుంచి…
Ads
.
కానీ పింక్ సోషల్ బ్యాచ్ విమర్శలు పెట్టీపెట్టగానే… ప్రభుత్వం వైపు నుంచి ఓ జవాబు వచ్చింది… అది కేసీయార్ జమానాలో కనిపించని ధోరణి… ఆల్ ఇండియా సర్వీసు అధికారులు బహిరంగ వేదికల మీద హుందాగా ప్రవర్తించాలని ఏకంగా సీఎస్ నుంచి అధికార యంత్రాంగానికి మార్గదర్శకాలు, జాగ్రత్తల జారీ…
అంటే బహిరంగంగా కాళ్లు మొక్కడాన్ని కేసీయార్ ఆమోదించాడేమో గానీ… రేవంత్ రెడ్డికి నచ్చలేదు… అందుకే బహిరంగ ప్రదేశాల్లో తమ తమ కొలువుల హుందాతనానికి తగని విధంగా ప్రవర్తించటం సరికాదని ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది…. ఇలా… (అఫ్‌కోర్స్, సదరు ఐఏఎస్ ఉదాహరణను తీసుకోకపోయినా, ఈ సర్క్యులర్ జారీ వెనుక కారణం అదేనని అందరికీ తెలిసిందే కదా…)
‘‘ఇటీవల కొంతమంది అఖిల భారత సర్వీసు అధికారులు సామూహిక సమావేశాలు, సభల్లో సర్వీసు హోదాకు తగనటువంటి చర్యలు, హావభావాలు ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇలాంటి ప్రవర్తన ప్రజల్లో ఆ సర్వీసు అధికారుల మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. మరియు సేవ మాన్యతను దెబ్బతీస్తుంది…
అఖిల భారత సేవల ప్రవర్తనా నియమావళి, 1968 లోని నిబంధన 3 (1) ప్రకారం: ప్రతీ సర్వీసులో సభ్యుడు ఎల్లప్పుడూ సంపూర్ణ నిజాయితీ, విధిపట్ల నిబద్ధత కలిగి ఉండాలి. సర్వీసులో ఉన్న అధికారికి తగని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు…
అఖిల భారత సేవల అధికారులు, అధికారికంగా మరియు ప్రజలతో సంబంధాల విషయంలోనూ, అత్యున్నత స్థాయి నైపుణ్యం, నిజాయితీ, నిబద్ధతను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. ఇది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు అవసరమైన చర్య. కాబట్టి, ఇకపై ఏ అఖిల భారత సర్వీసు అధికారులు అయినా, సామూహిక సమావేశాలు, సభల్లో తగనటువంటి విధంగా ప్రవర్తించడం, హావభావాలు ప్రదర్శించడం వంటి చర్యల నుంచి నుంచి దూరంగా ఉండాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘించినచో ఆ అధికారి తగిన చర్యలకు బాధ్యుడు అవుతాడు…’’
నిజమే… వ్యక్తులుగా వేరు… కానీ ఓ బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉన్నప్పుడు ఆ కొలువుల గౌరవాన్ని నిలబెట్టాలి… ఔచిత్యం అంటారు… సరే, విధేయత ప్రకటనకు, కళ్లల్లో పడటానికి, అభిమానం పొందడానికి అలాంటి చర్యలు కేంద్ర సర్వీసు అధికారులే కాదు, ఎవరు చేసినా అది అనుచితమే… ఆ పోస్టుకు అమర్యాద…
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ప్రతిచోటా ఈ ధోరణి ఉంది… డబ్బు, మంచి పోస్టింగుల కోసం నాయకులు చెప్పిన చోటల్లా సంతకాలు చేసి, అక్రమాలకు ఊతమిచ్చి… తరువాత ఆరోగ్యాలు కోల్పోయి, జైళ్ల పాలై, పరువు బజారుపాలై ఏడుస్తున్న ఉన్నతాధికారులు ఎందరో… అందుకే నాయకులకు అనుచరగణంగా మారి ఊడిగం చేయడంకన్నా… తమ కొలువుల్లోనే కాలర్లు ఎగరేసుకుని, జాగ్రత్తగా వ్యవహరిస్తే వ్యక్తులుగా బెటర్… ఆయా పోస్టుల గౌరవానికీ బెటర్..!!
Share this Article