.
ఇండియా చైనాల మధ్య వ్యత్యాసం… కారణం నెహ్రూ, ఇందిర, కాంగ్రెస్ కాదా?
—————————-
ఇండియా చైనాల మధ్య ఇంత వ్యత్యాసమా? అన్న శీర్షికతో ఇవాళ సాక్షిలో కరణ్ థాపర్ చైనాకు తోకాడించడం చదివాక….
దేశంలోని జర్నలిజమ్ ‘చైనాకు విధేయతతో పని చేస్తోంది’ అనీ, ‘చైనా డబ్బుకు దేశంలోని జర్నలిజమ్ నాలుక చాస్తోంది’ అనీ, ‘చైనా ప్రయోజనాల కోసం మన దేశం జర్నలిజమ్ పనిచేస్తోంది’ అనీ ‘మనదేశం’, ‘మనజాతి ప్రగతి’ అన్న భావనలు ఉన్న ‘మామూలు మనుషుల’ ఎరుక పదేపదే చెబుతోంది.
Ads
ఇవాళ సాక్షి ఎడిట్ పేజ్ లో కరణ్ థాపర్ అన్న మేధావి ‘తన చైనా లబ్ది’ని ఘనంగా చాటుకుంటూ ‘చైనాకు తన తోకను బాగా ఊపారు’. ఆ చైనా బానిసత్వాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. కరణ్ థాపర్ పూర్వాపరాలు, ప్రవర్తన, మేధ గురించి దేశవ్యాప్తంగా తెలిసిందే.
అలాంటి కరణ్ థాపర్ మేధను చాలాకాలంగా సాక్షి క్రమం తప్పకుండా, బాధ్యతాయుతంగా మన తెలుగు ప్రజలకు చేరవేస్తూనే ఉంది. ‘చైనా లబ్ది’ కోసం సాక్షి కూడా పనిచేస్తోందా? సాక్షి కూడా చైనాకు తన తోకను ఊపుతోందా??
కరణ్ థాపర్ ఇలా చైనాకు తోకాడించే ముందు…
1. ‘మన దేశానికి నెహ్రూ, ఇందిర, కాంగ్రెస్ బలంగా పట్టాయి’ అన్న చారిత్రక వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది.
2. తన వంటి జర్నలిస్ట్ మేధావులు పలువురు ఇండియాలో చాలాకాలంగా పాతుకుపోయి ఉన్నారన్న వాస్తవాన్ని కరణ్ థాపర్ మర్చిపోకుండా ఉండాల్సింది.
ఇండియాకు చైనాకు మధ్య ఇంత వ్యత్యాసానికి ప్రధామైన కారణాలు ఇదిగో ఈ రెండే!
కరణ్ థాపర్ కూ, సాక్షికి ‘దృష్టి’ సరిగ్గా ఉండుంటే, సరైన దృష్టి ఉండుంటే, పనిచెయ్యాల్సినవి సరిగ్గా పనిచేస్తూ ఉండుంటే ఇలాంటి పనికిమాలిన మేధ తెలుగులో పడుండేది కాదు.
‘మాతృదేశ వ్యతిరేకత అన్న మానసిక రోగంతో మన మేధావివర్గం, మన దేశ పాత్రికేయం తీవ్రంగా పనిచేస్తున్నాయి’ అన్న క్షేత్ర వాస్తవానికి సాక్షిలో వచ్చిన ఈ కరణ్ థాపర్ వ్యాసం ఒక ఋజువు…. [[ – రోచిష్మాన్
9444012279 – ]]
Share this Article