.
ఓ వార్త…. గమ్మత్తుగా రాశాడు రిపోర్టర్ ఎవరో గానీ… 2023MH4 అని పేరు పెట్టబడిన ఓ భారీ గ్రహశకలం లేదా ఖగోళ వస్తువు ఏదో వేగంగా భూమిని సమీపిస్తోంది…
ఐదారు అంతస్థుల భవనం రేంజులో ఉండే ఆ శకలం గనుక భూమిని ఢీకొంటే భూమి ముక్కలుచెక్కలు… 24వ తేదీన ఢీకొట్టబోతోంది… ఇక యుగాంతమే…. ఎందుకైనా మంచిది, అలర్ట్‌గా ఉండండి… ఇదీ వార్త సారాంశం…
Ads
అదుగో యుగాంతం, ఇదుగో ప్రళయం అని తరచూ కాన్‌స్పిరసీ సిద్ధాంతాలను కొందరు ప్రచారంలోకి తీసుకొస్తారు కదా, ఇదీ అలాంటిదే అనుకున్నా తొలుత… మరీ భూమి ముక్కలే అనేసరికి… పైగా మనం అలర్టుగా ఉండటం ఏమిటి..? ఢీకొంటే మనం చేయగలిగేదేమిటి..?
కానీ అది సమీపిస్తున్న మాట నిజమే… నాసా కూడా చెబుతోంది… 24వ తేదీ అనేదీ నిజమే… మూడు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంతో ఉన్న ఆ శకలం సమీపిస్తున్న మాట కూడా నిజమే… సెకనుకు 14 కిలోమీటర్ల స్పీడ్, అంటే గంటకు సుమారు 50,400 కిలోమీటర్ల వేగంతో వస్తోంది…
అయితే అది భూమి నుంచి 66.8 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుందని ఓ అంచనా…. ఖగోళ భాషలో అది పెద్ద దూరం ఏమీ కాదు… ఆల్రెడీ నాసా నిశితంగా తన ప్రయాణమార్గాన్ని గమనిస్తోంది… ఎందుకంటే… 75 లక్షల దూరం నుంచి శకలాలు వెళ్లడాన్నే భూమికి ప్రమాద సంభావ్యతగా పరిగణిస్తారు ఖగోళ పరిశీలకులు… అంటే ఈ 66.8 లక్షల కిలోమీటర్ల దూరం అంటే ప్రమాదాన్ని శంకించగలదే అన్నమాట…
భూమికి సమీపించేకొద్దీ భూమి గురుత్వాకర్షణతో శకలం మరింత చేరువగా వస్తే మరీ ప్రమాదం… ఆ స్థితి వస్తే దాన్ని అంతరిక్షంలోనే పేల్చేయడానికి కూడా అవకాశం ఉండదు…
ఏ సముద్రంలోనే కూలిపోతే పెద్ద ప్రమాదం లేదు గానీ, భూఉపరితం మీద పడితే, ఆ తాకిడి, ఆ స్పీడ్ విధ్వంసాన్ని క్రియేట్ చేయగలదు… కానీ మరీ ముక్కలుచెక్కలు చేయడం కాదు… కాకపోతే ఆ తీవ్రత ఎంత ఉండవచ్చుననేది అంచనా వేయలేం….!! ఏమో, ఏం జరుగునో చెప్పలేం… ప్రస్తుతానికి ఇది మనిషిలో చేతిలో లేని ఉపద్రవం..!!
Share this Article