.
నిజమే… ఓ మిత్రుడు సోషల్ మీడియాలో అడిగినట్టుగా…. ప్రభుత్వం మానససరోవరం, కైలాస పర్వత యాత్రకు సంబంధించిన వివరాలను ఎందుకు మీడియా ద్వారా ప్రజలకు చెప్పడం లేదు..?
అయిదేళ్లుగా ఈ యాత్ర లేదు…. 2020 నుంచి కోవిడ్ కారణంగా కొన్నాళ్లు చైనా నిలిపివేసింది…. భౌగోళికంగా చైనా పరిధిలో మానససరోవరం ఉంటుంది కాబట్టి చైనా అనుమతి అవసరం, వీసాలు కూడా అవసరం…
Ads
తరువాత గాల్వాన్ లోయలో ఇండియా – చైనా సరిహద్దు బలగాల ఘర్షణ, ఉద్రిక్తత కారణంగా కొన్నాళ్లు యాత్ర నడవలేదు…. ఈ ప్రాంతాలు హై ఆల్టిట్యూడ్‌లో ఉంటాయి, దేశాల నడుమ సరిహద్దులు కాబట్టి భద్రతాపరమైన అంశాలు బోలెడు…
కోవిడ్ నియంత్రణలోకి రావడంతో చైనా మళ్లీ బయోమెట్రిక్ వీసాలను జారీ చేయడం స్టార్ట్ చేసింది… భారతీయ విదేశాంగ శాఖ, చైనా విదేశాంగ శాఖల నడుమ సంప్రదింపులు ఫలించి తిరిగి యాత్ర ప్రారంభమవుతోంది…
మానససరోవరం జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే జన్మ ధన్యమని హిందువులు భావిస్తారు… చాలా వ్యయప్రయాసలతో కూడిన యాత్ర… పైగా వయస్సు, ఆరోగ్యం సహకరించాలి… బాగా ట్రెక్కింగ్ ఉంటుంది… ఇక కైలాస పర్వతాన్ని సాక్షాత్తూ శివుడి నివాసంగా భావిస్తారు… హిందూ, జైన, బౌద్ధ, బోన్ మతస్తులకు పుణ్యక్షేత్రం… పర్వతం అధిరోహించడం కుదరదు, కానీ దర్శనం, స్పర్శ… ఆ పర్వత పాదాల్లో కాసేపు గడపడం….
అసలు పెద్దగా దేశప్రజలకు సమాచారం ఇవ్వలేదు విదేశాంగ శాఖ… దాంతో 4024 మంది పురుషులు, 1537 మంది స్త్రీలు ఈ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు… అందులో లాటరీ పద్దతిలో 750 మందిని ఆల్రెడీ ఎంపిక చేశారు… జూన్‌లో మొదలై ఆగస్టు దాకా సాగుతుంది…
50 మందికి ఒక గ్రూపు…. 5 గ్రూపులు లిపులేఖ్ మీదుగా… 10 గ్రూపులు నాథుల్లా మార్గంలో వెళ్తాయి… లిపులేఖ్ పాస్ ద్వారా (ఉత్తరాఖండ్) అయితే ట్రెక్కింగ్ ఎక్కువ… ఎక్కువ స్టామినా అవసరం… నాథులా పాస్ ద్వారా (సిక్కిం) అయితే ట్రెక్కింగ్ తక్కువ… వయోజనులకు అనుకూలం… కానీ ఎప్పుడు ఈ మార్గంలో యాత్ర ఆపేస్తారో తెలియదు…
విదేశాంగ శాఖ నిర్వహించే టూర్ 24, 25 రోజుల దాకా ఉంటుంది… లిపులేఖ్ రూట్ అయితే ₹1.5 లక్షల నుంచి ₹2 లక్షల వరకు… నాథులా రూట్ అయితే ₹2.5 లక్షల వరకు ఖర్చు ఉంటుంది… (ఈ ఖర్చులో వీసా, బోర్డింగ్, లాడ్జింగ్, యాత్రా గైడ్, ట్రాన్స్‌పోర్ట్ మొదలైనవి ఉంటాయి… కానీ అంతర్గత విమాన ప్రయాణాలు, ఇండియాలో ప్రయాణ ఖర్చులు అదనంగా ఉండవచ్చు…)
ఇవేకాదు… ప్రతి మార్గంలో ఢిల్లీలో 3 రోజులపాటు ఆరోగ్య పరీక్షలు, పత్రాల పరిశీలన కోసం ఉండాలి…. ధృవీకరణ ఫీజు: ₹5,000 (నాన్-రీఫండబుల్)… వైద్య పరీక్షలు: ₹5,500… స్ట్రెస్ ఎకో టెస్ట్ (అవసరమైతే): ₹2,500… చైనా వీసా ఫీజు: ₹2,400… కూడా తప్పవు…ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా…
ఐతే… ఎక్కువ ఖర్చు ఉంటుంది గానీ ప్రైవేటు ఆపరేటర్లకు కూడా యాత్రికులు ప్రాధాన్యం ఇస్తారు… రకరకాల ప్యాకేజీలున్నాయి… ప్యాకేజీ ఖర్చు: ₹2.5 లక్షల నుండి ₹5 లక్షల వరకు ఉండొచ్చు… నేపాల్ నుండి హెలికాప్టర్ ద్వారా… లాండ్ క్రూయిజర్ వాహనాల ద్వారా… అన్ని ఏర్పాట్లూ వాళ్లే చూసుకుంటారు… హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది…
విదేశాంగ శాఖ లాభాపేక్ష లేకుండా యాత్ర నిర్వహిస్తుంది గానీ సౌకర్యాల విషయంలో ప్రైవేటు వాళ్లదే డబ్బును బట్టి సర్వీస్… కాకపోతే భద్రత విషయంలో విదేశాంగ శాఖ పూర్తి బాధ్యత తీసుకుంటుంది కాబట్టి అధికారిక యాత్రనే కొందరు ప్రిఫర్ చేస్తారు…
కానీ ఈసారి యాత్ర స్టార్ట్ అవుతుందనే సమాచారమే మీడియాలో రాలేదు… అది నిరాశకు గురిచేసింది చాలామందిని… 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న భారతీయులకు మాత్రమే ఈ యాత్రకు అవకాశం…
(టీటీడీ ఆర్జిత సేవల దగ్గర నుంచి, కేదారనాథ్ గుడి తలుపులు తెరుచుకోవడం దాకా ప్రతి ముఖ్య ఆలయం సమాచారం మీడియాలో వస్తున్నప్పుడు దీనికెందుకు ప్రచారం లభించకూడదు…) ఆసక్తి ఉండి, దరఖాస్తు చేసుకుంటే, లాటరీలో చాన్స్ దొరికితే అదృష్టమే కదా… (మీ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామందికి చేరనివ్వండి…)
Share this Article