ఎందుకో గానీ కొన్నిసార్లు కంగనా రనౌత్ ధోరణే కరెక్టు అనిపిస్తుంది… కాకపోతే ఆమెలాగా ఆర్గనైజ్ చేయాలి…. చేయగలగాలి… మణికర్ణిక షూటింగు సమయంలో అనేక వివాదాలు… ఆమె తన చేతుల్లోకి తీసుకుంది, నిర్మాతలు ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు… నిజజీవితంలో హీరో కావచ్చుగాక, ఓ ఆర్టిస్టుగా అడమెంటుగా ఉన్న సోనూసూద్‌ను తరిమేసింది… పేరున్న దర్శకుడు, వితండవాదిగా మారిన క్రిష్‌ను మళ్లీ సెట్లోకి రానివ్వలేదు… మంచో చెడో మనమే ప్రాజెక్టు కంప్లీట్ చేద్దాం అని చెప్పింది… ‘స్టార్ట్ కెమెరా, యాక్షన్’ అంటూ కెప్టెన్సీ తీసేసుకుంది… సినిమా సూపర్ హిట్… ఇక్కడ చెప్పుకునేది ఏమిటంటే..? ఆమె ఏమీ తోపు కాదు, కానీ ఒక సినిమా ప్రాజెక్టు ఒకడు చెప్పినట్టుగా, తన అదుపాజ్ఞల్లో నడవకూడదు అని… అది క్రియేటివ్ నియంతృత్వానికి దారితీస్తుంది అని… కోట్లకుకోట్లు పెట్టుబడి పెట్టేవాడిని ఆఫ్టరాల్ ఒక డైరెక్టరో, ఒక విలనో, ఒక హీరోనో చెప్పుచేతల్లో పెట్టేసుకుని, ఆడిస్తూ అరాచకానికి తెరతీయవద్దు అని…. ఇదంతా ఎందుకు అంటే..?
శంకర్… ఓ దిగ్దర్శకుడు… అన్నీ విజయవంతమైన చిత్రాలు గనుక…. ఆయన సినిమాల్లో ఎంత చెత్తా ఉన్నా సరే నడిచిపోయింది… భారీ, అత్యంత భారీ, తీవ్ర భారీ, ఉగ్ర భారీ అనే తరహాలో…. బోలెడు ఖర్చు… తనకే ఎక్కువ రెమ్యునరేషన్… మరి ఆ కృతజ్ఞత ఏమైనా ఉండాలి కదా… (అదేదో ఆయన గారి ఓ సినిమాలో రండక రండక కొండా కాకి అనే పాట విని, చూసిన తరువాత తనంటే ఏవగింపు కలిగింది… తమిళ మూలం బాగుంటే చాలు, తెలుగులో అదెంత దరిద్రంగా డబ్ అయినా పర్లేదు… ప్రత్యేకించి పాటలు… ఈ శంకరుడికే కాదు, బోల్డంత గ్రేట్‌నెస్ ఆపాదింపబడిన మణిరత్నం విషయంలోనూ ఈ అభిప్రాయం అంతే…) సరే, ఇప్పుడు ఏం జరిగింది..? ఇక కొత్త ఆలోచనలు కరువై, క్రియేటివిటీ అడుగంటి, ఆ భారతీయుడు అనే ఓ పాత హిట్ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు-2 తీయాలని అనుకున్నారు… లైకా అనే ఓ భారీ సంస్థ ముందుకొచ్చింది… స్టార్ట్ చేశారు…
Ads
అత్యధిక రెమ్యునరేషన్ డైరెక్టర్ శంకర్‌దే… కమల్‌హాసన్‌కు ఇప్పుడు పెద్ద సీనేమీ లేదు కదా… మధ్యలో ఓ పెద్ద యాక్సిడెంట్… షూటింగు ఆగింది… నిర్మాతకు బోలెడంత నష్టం… ఎలాగోలా చక్కదిద్దుకుని మళ్లీ స్టార్ట్ చేసేలోపు కరోనా… మళ్లీ ఆగింది… కాస్త ఊపిరి పీల్చుకుని రీస్టార్ట్ చేద్దాం అనుకునేలోపు మళ్లీ సెకండ్ వేవ్… నిర్మాతకు చుక్కలు… కాదు, కాదు, కరోనా వైరస్ స్పైక్స్ కనిపించసాగాయి… బాబ్బాబూ, అందరూ రెమ్యునరేషన్లు తగ్గించుకొండి, లేకపోతే మునిగిపోతాం అన్నాడు నిర్మాత… శంకర్ ససేమిరా వీలు కాదన్నాడు… అంతేకాదు, నీ సినిమా నిర్మాణం నీవల్ల కావడం లేదు, నేనెందుకు ఖాళీ ఉండాలి అన్నట్టుగా వేరే సినిమాలు కమిటయ్యాడు… దీన్ని పక్కన పెట్టేశాడు…
దాంతో లైకా వాళ్లకు తిక్కరేగింది… శంకర్ జోలికి తమిళ నిర్మాతల మండలి ఎట్సెట్రా సంఘాలు ధైర్యంగా ముందుకురావు కదా… (రోబో సినిమా మీద శంకర్ మీద ఆల్రెడీ ఒక దావా నడుస్తోంది… అది వేరే కథ)… అందుకని కోర్టుకెక్కారు… మా సినిమా అయ్యేదాకా ఈ శంకరుడు మరో సినిమా తీయొద్దు అని ఆదేశించండి అనడిగారు… సున్నితమైన సమస్య… దాంతో మీరూ మీరూ మాట్లాడుకుని మళ్లీ మా దగ్గరకు రండి అని చెప్పింది… అవునూ, వరుస అవాంతరాలతో తలపట్టుకున్న నిర్మాత నిర్మాణవ్యయం తగ్గింపు కోసం రెమ్యునరేషన్ తగ్గించుకొండి అంటూ దర్శకుడిని అడగడం తప్పా..? అనివార్యంగా చాలా ప్రాజెక్టుల్లో జరుగుతున్నది అదే కదా… నిజానికి వాళ్లు కాస్త మర్యాద ఇచ్చారు… రెమ్యునరేషన్ పెండింగులో పెట్టేసి, వేరే దర్శకుడితో కథ నడిపించేసి, విడుదల చేస్తే శంకర్ చేసేదేముంది..? శంకర్ కూడా నిర్మాతలను సతాయిస్తాడు అనే చెడ్డ పేరు తనకే నష్టదాయకం కాదా..? ఐనా ఏముందిలెండి… తన సినిమాల్లోని అసాధారణమైన కథల్లాగే తన మనస్తత్వం కూడా..!! నో, నో, నో… ఇలాంటి వివాదాలు, పెత్తనాలు ఓ సూపర్ క్రియేటివ్ డైరెక్టర్‌కే అవమానం అనే శుష్కవాదన తీసుకురాకండి… డబ్బుంటేనే, డబ్బున్న నిర్మాత ఉంటేనే ఈ క్రియేటివిటీలు, ఈ మంకుపట్లు…!!
Share this Article