Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కూలిపోతున్న మినీ బంగ్లాదేశ్… కానీ ఇలాంటివి దేశంలో కోకొల్లలు..!!

May 23, 2025 by M S R

.

మిత్రుడు ఓ ప్రశ్న వేశాడు.., వాడు ఒక మినీ బంగ్లాదేశ్ నిర్మించాడు కదా… పెద్ద మాఫియాగా తయారయ్యాడు కదా… కాంగ్రెస్ ప్రభుత్వాలున్నచోట ఎలాగూ పట్టించుకోరు, మమత వంటి బంగ్లా ప్రేమిక లీడర్లు అవసరమైతే వాడికి సాయంగా నిలుస్తారు, మరి బీజేపీ ప్రభుత్వమే కదా గుజరాత్‌లో దశాబ్దాలుగా ఉన్నది… వాళ్లకెందుకు నియంత్రణ చేతకాలేదు..?

నిజమే… ఈ ప్రశ్నకు జవాబు లేదు… మన తెలుగు మీడియాకు కనిపించదు గానీ… గుజరాత్‌లో ఆ మినీ బంగ్లాదేశ్‌ను పూర్తిగా నేలమట్టం చేసే ఓ యజ్ఞం సాగుతోంది… దాదాపు మూడు వేల ఇళ్లు, దుకాణాలను లెక్కకు మించిన బుల్డోజర్లు కూల్చేస్తున్నాయి… 2000 మంది సైనికులను మొహరించారు… అడ్డొస్తే కాల్చివేతే…

Ads

అసలు ఏమిటీ కథ..? అహ్మదాబాద్ జిల్లాలో చందోలా సరస్సు, విస్తీర్ణంలో చాలా పెద్దది… బీహార్ నుంచి వచ్చిన మెహబూబ్ పఠాన్ అలియాస్ లల్లా బీహారీ అనేవాడు అక్కడ అక్రమ నిర్మాణాలను స్టార్ట్ చేశాడు… వాడి కొడుకు పేరు ఫతే… అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన బంగ్లాదేశీయుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఆశ్రయం కల్పించేవాడు ఇక్కడ…

వాళ్లకు ఇళ్ల నిర్మాణాలు… వేలాది మంది… వాళ్లకు గుర్తింపు కార్డుల కోసం లల్లా బీహారీ టీమ్ నకిలీ పత్రాలను రూపొందిస్తుంది… ఆధార్ కార్డులు, వోటర్ గుర్తింపు కార్డులు అన్నీ సమకూర్చి పెడుతుంది… ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్లను భారతీయ పౌరులను చేస్తుంది…

అక్కడ ఎవడూ మాట్లాడటానికి ఏమీ లేదు… చందోలాలో అక్రమంగా బస చేసినందుకు ఒక్కో వ్యక్తి నుంచి రూ. 3 నుంచి 3.50 లక్షలు వసూలు చేసేవాడు… నకిలీ ఆధార్ కార్డు కోసం అతను రూ.1.50 నుంచి 2 లక్షలు వసూలు చేసేవాడు…

అతను గుడిసెలకు నెలకు రూ.5,000 అద్దె వసూలు చేస్తాడు… రిక్షాలు, ఇతర వాహనాల పార్కింగ్‌కు రూ.20 నుండి రూ.50 వరకు వసూలు చేసేవాడు… అతను ప్రతి నెలా అక్రమ బోర్ల ద్వారా నీటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించాడు… బంగ్లాదేశ్ మహిళల వ్యభిచారం ద్వారానే వాడికి ఎక్కువ ఆదాయం… అక్రమ ప్లాట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తాడు…

తనకు నలుగురు భార్యలు… అందరికీ ఇళ్లు… బ్యాంకు ఖాతాలు… ఇవేగాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రహస్య స్థావరాలు, నెట్‌వర్క్ విస్తరించాడు… స్థూలంగా ఇదీ వాడి చరిత్ర… ఆపరేషన్ మొదలయ్యాక క్రైం బ్రాంచ్ వెతుకుతుంటే, తను రాజస్థాన్ వెళ్లి తలదాచుకున్నాడు…

రాజస్థాన్ క్రైం బ్రాంచ్ కూడా రంగంలోకి దిగింది… పట్టుకుంది…. కొడుకును, తనను అరెస్టు చేసి, బేడీలు వేసి, వాడి మినీ బంగ్లాదేశ్ కాలనీలో తిప్పారు పోలీసులు… ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని క్లీన్ చేసి, ఆ సరస్సును క్లీన్ చేసి… ఆ స్థలంలో బీఎస్ఎఫ్ జవాన్ల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్లాన్… సరే, ఇదంతా పక్కన పెడితే…

దేశంలో అనేకచోట్ల రోహింగ్యాలు, ఈ బంగ్లా అక్రమ వలసదారులు… ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్‌లో అరాచకం… పలు జిల్లాలు పూర్తిగా ఇలాంటి వలసదారులతో నిండిపోయాయి… పెద్ద కల్‌ప్రిట్ మమత… ఇదుగో ఇలాంటి వాళ్లతో రాజకీయ పార్టీలు ఆందోళనలు చేయిస్తాయి, శాంతి భద్రతల సమస్య…

భారతదేశం పెద్ధ  ధర్మశాల అయిపోయింది… ఇవే పార్టీలు పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం అడ్డుకుంటాయి…. ఈ దేశం చుట్టూ ఎన్ని ఉపద్రవాలు… మనం ఒక్క పాకిస్థాన్‌ను మాత్రమే చూస్తున్నాం..!! చివరగా… గుజరాత్ ప్రభుత్వం ఓ మినీ బంగ్లాదేశ్ ఏర్పడేదాకా ఎందుకు చూస్తూ కూర్చుంది..!? ఆ ప్రభుత్వం కాంగ్రెస్‌ది కాదు, మమత లేదు అక్కడ, కమ్యూనిస్టుల ప్రభుత్వం కూడా కాదు కనీసం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డాడీ కేసీయార్ చుట్టూ ఉన్న ఆ దెయ్యాలు ఎవరు కవితక్కా..?
  • చరిత్ర చెబుతానంటూ, అసలు చరిత్ర మరిచి, ఏదో కొత్త చరిత్ర చెప్పారు…
  • Ace..! ఓ నాన్ సీరియస్ స్టోరీ లైన్‌కు అక్కడక్కడా కాస్త కామెడీ పూత…
  • ‘ఉచిత ప్రలోభాల’ పార్టీలు చదవాల్సిన ‘కర్నాటక సర్వే’ ఫలితాల కథ..!!
  • AI … కొలువులే కాదు, ప్రాణాలూ తీస్తోంది… బహుపరాక్‌‌…
  • ఛాలెంజ్..! ‘మెదడుకు మేత’ నవలను సినిమాకరించడం ఛాలెంజే..!!
  • కూలిపోతున్న మినీ బంగ్లాదేశ్… కానీ ఇలాంటివి దేశంలో కోకొల్లలు..!!
  • నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!
  • ఎస్.., ఓ అవకాశం ఇవ్వాల్సిందే..! ధిక్కార తూటా శాంతిమంత్రం..!!
  • చార్‌ ధామ్ కాదు… ఇది పంచ కేదార్..! వెరీ ఇంట్రస్టింగ్ కారిడార్..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions