.
ఛాలెంజ్ సినిమా గురించిన వివరాలను సెర్చుతుంటే… కొన్ని డిబేట్ ప్లాట్‌ఫారాల మీద ఆసక్తికరమైన సరదా చర్చలు కనిపించాయి… అందులో ప్రధానమైన ప్రశ్న… ‘‘విజయశాంతిని సోయగాన్ని వర్ణిస్తూ చిరంజీవి ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగనజఘన అని ఓ ఫ్లోలో వెళ్లిపోతుంటాడు కదా… అసలు కుందరదన అంటే ఏమిటి..?’’
నిజమే… ఇందువదన వోకే, చంద్రబింబం వంటి మొహం…. మందగమన అంటే మెల్లిగా మెత్తగా జాగ్రత్తగా నడక… వోకే… (గజగామిని అని కూడా వర్ణిస్తుంటారు)… మధురవచన, అంటే తీయగా మాట్లాడేది, వోకే గుడ్… గగనజఘన, ఎత్తయిన జఘనం అని… కావ్యవర్ణనల్లో అదీ భాగమే… విజయశాంతికి ఆప్ట్ కాకపోవచ్చుగాక…
Ads
మరి కుందరదన అంటే..? ఇదీ చర్చ… నిజానికి చాలెంజ్ సినిమా వచ్చిన కాలంలో విజయశాంతి అంటే యువతలో క్రేజ్… అప్పట్లో ఆమె ఎనర్జీ, అందం, నటనతో చాలామంది ఫ్యాన్స్… ప్రత్యేకించి టి.కృష్ణ సినిమాలు ఆమెకు హీరోలకు దీటుగా పాపులారిటీని సంపాదించి పెట్టాయి… రాములమ్మతో వచ్చిన ఇమేజీ ఓ్ రేంజ్…
కుందరదన విషయానికొస్తే… అన్నేళ్ల క్రితం చెప్పేవారెవరు..? ఇప్పుడంటే గూగులమ్మకుతోడు గ్రోక్ వంటి కృత్రిమ మేధలున్నాయి, మరి అప్పుడు తెలుగు డిక్షనరీల్లో కూడా ఈ పదానికి అర్థం దొరకలేదు చాలామంది ఔత్సాహిక అన్వేషకులకు…
గూగుల్ వచ్చాక జరిగిన డిబేట్లలో ఒకాయన కుందరదనకు అర్థం చెప్పాడు… ఇలా…
అదేమిటి..? పచ్చటి పూలలాగా పళ్లవరుస ఉండటమేమిటి అని మళ్లీ చర్చ… అంటే అప్పటికే విజయశాంతి గుట్కా అలవాటు చేసుకుందా..? పళ్లు పచ్చబారడం చూసి వేటూరికి తన ఫ్లోలో అలా ఓ కవితాపాదంతో వెక్కిరించాడా అని కొందరి ప్రశ్న… ఇలా సరదాగా సాగింది చర్చ…
అదేసమయంలో మరికొందరి వివరణ… కుందరదన అంటే పూల వరుస, ప్రత్యేకించి మల్లెపూలలా తెల్లగా ఉండే పళ్లవరుస అని… ఇది కాస్త పర్లేదు… ఐనా దంతాల అమరికను, లుక్కును మరీ మల్లెపూలతో పోలుస్తారా..? ఏమోలెండి, కవి నిరంకుశుడు… అసలేవేటూరి… తన కవిహృదయం అది… ఇంకేమంటాం..?! (తెలుగు సినిమా పాటల్లోని పదాలు, ప్రయోగాల గురించి కూడా జనం చర్చించుకుంటారు సమా అని చెప్పడమే ఈ సరస, సరదా కథనం భావన..)
అవునూ, డిక్షనరీలకే దొరకని పదాలతో సగటు ప్రేక్షకుడిని తికమకపెట్టడం భావ్యమా అంటారా..? సరే, అదంతా వేరే డిబేట్…
Share this Article