.
ఒక ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది, ముందు నవ్వొచ్చింది… అది చూశాక హఠాత్తుగా ఓ పాత లెటర్ హెడ్ గుర్తొచ్చింది… చాన్నాళ్లుగా అది సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది…
ఆ లెటర్ హెడ్ ఏమని చెబుతుందంటే..? (అది ఫేకా, ఒరిజినలా తెలియదు గానీ నవ్వుకోవడానికి భలే ఉంది… అంతేకాదు, ప్రస్తుతం మన వర్తమాన సమాజంలో ఉన్న రాజకీయ పోకడలు, ప్రత్యేకించి నాయకుల కోటరీలు, బంధుగణం ఎచ్చులను అది గుర్తుచేస్తుంది…)
Ads
ఇదుగో ఆ లెటర్ హెడ్… వెతికితే దొరికింది సులభంగానే…
ఈ లెటర్ హెడ్‌లో దాని ఓనర్ పేరు ఎస్.ఇందర్ సింగ్ సిద్ధూ… పంజాబ్, భటిండా తన నేటివ్… చండీగఢ్‌లో కూడా ఉంటాడు… కారణం, చీఫ్ మినిస్టర్ ప్రకాష్ సింగ్ బాదల్‌కు తను సాక్షాత్తూ బావమరిది అట… ఐతే ఎవడు పడితే వాడు సీఎం తమ్ముళ్లమనో, బామ్మర్దులమనో చెప్పుకుని తిరుగుతున్నారట…
దాంతో అసలు నేనే ఒరిజినల్ బామ్మర్దిని అని ఏకంగా లెటర్ హెడ్ మీదే క్లారిటీ ఇచ్చుకున్నాడు… సీఎంకన్నా సీఎం తమ్ముళ్లు, సీఎం బామ్మర్దులు, సీఎం అల్లుళ్లు, సీఎం పెళ్లామే ఎక్కువ పవర్‌ఫుల్ కదా మన అధికార చట్రాల్లో… అందుకని ఈ క్లారిటీ అన్నమాట… బామ్మర్ది లేఖ రాస్తే అది శాసనమే అన్నట్టు చెలామణీ అవుతుంటాయి కదా…
సరే, ఇదెందుకు గుర్తొచ్చింది అంటే… ఈ ఫోటో ఓసారి చూడండి…
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో వేదిక వెనుక పెద్దగా కనిపించేట్టు పెట్టిన ఓ ప్లెక్సీ… అందులో ఆమె గురించి చెబుతూ సింగర్, బ్యాంకర్, సోషల్ యాక్టివిస్టు మాత్రమే కాదు మహారాష్ట్ర ప్రభుత్వ చీఫ్ (హెడ్) భార్య కూడా క్లారిటీ ఇస్తోంది ఫ్లెక్సీ…
కానీ అది ఆమె రాసుకున్న బ్యానర్ కాదు… ఆమె అలాంటిది కాదు… ఫడ్నవీస్ గురించి మహారాష్ట్ర జనానికి తెలియకముందే ఆమె తెలుసు… ఆమె కెరీర్ వేరు… నిజమే, ఆమె బ్యాంకర్, సింగర్, సోషల్ యాక్టివిస్టు… కానీ ఎప్పుడూ ఓ సీఎం భార్యగా కృత్రిమ వేషాలేమీ వేయదు… సినిమా తారలకు దీటుగా పాపులారిటీ ఉంది ఆమెకు… ఎప్పుడూ లైమ్ లైట్‌లోనే ఉంటోంది… ఆసక్తి ఉంటే ఈ దిగువన ఉన్న లింక్ ఓసారి చదవండి…
మరి వేదిక మీద ఆ పైత్యం ఎవరిది..? ది బెటర్ వరల్డ్ ఫండ్ అనే సంస్థది… వాళ్లు ఓ ప్రోగ్రాం ఏర్పాటు చేసి, సీఎం భార్యను కూడా ఆహ్వానించి, ఈవెంట్ మేనేజ్‌మెంటు ఎవరికో అప్పగించారు… వాళ్ల పైత్యం అది… ఆ ఆర్గనైజేషన్ కూడా ఐరాసకు పలు విషయాల్లో సహకరించే సంస్థ… Manuel Collas de La Roche దాని ఫౌండర్ కమ్ చైర్మన్… అందరూ విదేశీయులే డైరెక్టర్లు… విద్య, కళ ఎట్సెట్రా విషయాల్లో వర్క్ చేస్తుంటుంది… అదీ సంగతి…
Share this Article