.
ఒక నరేంద్ర, తన పార్టీనే కేసీయార్ పార్టీలో విలీనం చేశాడు, ఎక్కడో దొర వారికి కోపమొచ్చింది, అంతే, ఆ పాత బస్తీ పులిని అవమానకరంగా పార్టీ నుంచి పంపించేశాడు…
ఒక విజయశాంతి, ఆమె కూడా తన పార్టీని కేసీయార్ పార్టీలో విలీనం చేసింది… ఆమె మీద కూడా దొర వారికి ఎందుకో కోపమొచ్చింది… ఆమెనూ అవమానకరంగా పార్టీ నుంచి పంపించేశాడు…
Ads
ఒక ఈటల రాజేందర్, పార్టీ ఆవిర్భావం నుంచీ వర్క్ చేసిన తెలంగాణ ఉద్యమకారుడు… ఏదో తేడా కొట్టింది దొర వారికి… కేసులు పెట్టి, అవమానించి, దొరతనం చూపి మరీ పార్టీ నుంచి పంపించేశాడు…
.
జస్ట్, ఉదాహరణలు మాత్రమే… ఆ పార్టీకి సర్వంసహా చక్రవర్తి కదా, ఎప్పుడు ఎవరి మీద కోపం వస్తుందో తెలియదు, అవమానకరంగా తోసేస్తాడు బయటికి… ఎస్, ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే..? సొంత కూతురు పార్టీ మీద, తండ్రి మీద ధిక్కార పతాకను ఎగరేస్తోంది…
రాష్ట్రం తెచ్చుకున్నా సామాజిక తెలంగాణను సాధించలేకపోయామనే ఆమె వ్యాఖ్య తండ్రి పట్ల, పార్టీ పట్ల అభిశంసన… కేటీయార్ వారసత్వమేనా, నాకేం తక్కువ, నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారనే ఆమె ధోరణికి కేసీయార్ దగ్గర జవాబు లేదు….
తననే కాదు, రేప్పొద్దున కేటీయార్‌కు థ్రెట్స్ అవుతాడని అనుకుంటున్న హరీష్ రావునూ పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది… ఇది పార్టీలో ముసలానికి దారితీస్తోంది… బహిరంగంగానే తండ్రిని ధిక్కరిస్తోంది ఆమె… మరి ఆమెను బహిష్కరిస్తాడా..? పంపించేస్తాడా..? సొంత కూతురు కదా, క్షమించి సర్దుబాటు ప్రయత్నాలు చేస్తాడా..?
ఇది అందరిలోనూ మెదిలే ఓ ప్రశ్న… సరే, ఆమె పార్టీ నుంచి, తండ్రి నుంచి ఏం కోరుకుంటున్నదో వదిలేద్దాం… వాట్ నెక్స్ట్..? ఈ ప్రశ్నకు అనేక సమీకరణాలు చర్చల్లోకి, గాసిప్పుల్లోకి, వార్తల్లోకి వచ్చేస్తున్నాయి… నిజాలవుతాయా లేదా కాలం చెబుతుంది, కానీ కవిత ఇప్పుడు తెలంగాణ టాపిక్…
ఇతర పార్టీల నేతలూ వెక్కిరింపుల స్థాయిలో స్పందిస్తున్నారు, ఏవేవో కామెంట్లు కనిపిస్తున్నాయి… ఐతే, నిజంగానే ఆమె సొంత పార్టీ పెడుతుందా..? ఇంకేదైనా పార్టీలో చేరుతుందా..? రకరకాల లెక్కలు, ఈక్వేషన్స్, ఫలితాలపై ఊహాగానాలు…
ఒక విఫల షర్మిలతో పోలికలు… షర్మిలది ఆస్తుల పంచాయితీ అన్నతో… కేసీయార్ కుటుంబంలో ఎవరిది వాళ్లే సంపాదించుకుంటున్నారు కాబట్టి ఆ షర్మిల బాపతు పంచాయితీ ఇక్కడ లేకపోవచ్చు, ఎటొచ్చీ పార్టీలో, పదవుల్లో సమానహక్కు కావాలా..? కేటీయార్‌ను అధ్యక్షుడిని చేసి, కవితను వర్కింగ్ ప్రెసిడెంటుగా చేసి, సర్దుబాటు చేస్తే ఈ గొడవ సద్దుమణుగుతుందా..? ఇదొకరకం ప్రచారం…
బీజేపీ మీద కోపం, సో, బీజేపీలో చేరదు, పోనీ, కాంగ్రెస్‌లో చేరుతుందా..? డౌటే, అదొక నానాజాతి సముద్రం, తన్నుకునే వాళ్లకు కొదువ లేదు, ఇన్నేళ్లూ తండ్రి పార్టీ ఓనర్ కాబట్టి ఆమె మాటకూ, ఆమె అడుగులకు అనివార్యంగానే విలువ ఉండేది… కాంగ్రెస్‌లో చేరితే అదేమీ ఉండదు, జస్ట్ ఓ కార్యకర్త అవుతుంది…
వోకే, రేవంత్ రెడ్డితో వ్యాపార భాగస్వామ్యం ఉంది, ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారు అనే విమర్శల్నే లెక్కలోకి తీసుకుంటే… అసలు రేవంత్ రెడ్డి ఎన్నాళ్లు కాంగ్రెస్‌లో ఉంటాడనే సందేహాలే జనంలో ఉన్నాయి… సీనియర్ రెడ్ల దెబ్బను కాచుకుంటాడా, బలవుతాడా తెలియదు… సో, రేవంత్ ద్వారా కాంగ్రెస్‌లో చేరిక అనేది నమ్మబుల్ కాదు…
మిగిలింది సొంత పార్టీ… కానీ కేసీయార్, కేటీయార్‌ను విడిచిపెట్టి తన వెంట వచ్చేవాళ్లు ఎవరు..? డబ్బు ఉండగానే సరిపోదు కదా… పోనీ, హరీష్‌కూ పొగబెడుతున్నారు కాబట్టి, హరీష్‌తో కలిసి కొత్త పార్టీ ఉంటుందా…?. అదీ డౌటే, కేసీయార్ ఉన్నన్నిరోజులూ హరీష్ బయటికి రాడు… ఏమో, కేటీయార్‌కు పూర్తి పగ్గాలు అప్పగించాక ఏం చేస్తాడో తెలియదు…
కొందరు ఇంకా చాలా దూరం వెళ్లారు… కాంగ్రెస్‌లో రేవంత్ సెగ భరించలేకపోతే… బీఆర్ఎస్‌లో కవిత, హరీష్ సెగ భరించలేకపోతే… ఏమో, మరో బలమైన పార్టీ ఏర్పడుతుందేమో… ఇదీ ఆ ఊహాగానం… ఏమో… టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తెలంగాణలోనూ ఏర్పడబోతోందనీ, ఏపీ ఫలితం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని సమాచారం…
పనిలోపనిగా బీఆర్ఎస్‌తో పొత్తు గానీ, అవగాహన గానీ ఉంటాయట… అదీ డౌట్ ఫుల్లే… ఎందుకంటే, చంద్రబాబుకూ కేసీయార్‌కూ సయోధ్య కష్టం… ఆల్రెడీ చంద్రబాబును, తన శిష్యుడిగా పరిగణించబడే రేవంత్‌నూ తెలంగాణ కోణంలో కార్నర్ చేయడానికి పోలవరం, గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును అస్త్రంగా వాడే పనిలో ఉన్నాడు… అసలు దీనికోసమే మేడిగడ్డ కింద బాంబులు పెట్టారు అన్నట్టుగా విమర్శలు స్టార్ట్…
ఈ అతుకుల బొంతల్లో చేరితే ఇక బీజేపీ సొంతంగా ఎదగదు, ఇన్నాళ్ల నష్టం కొనసాగాలా అనే భావన బీజేపీ కేడర్‌లోనూ ఉంది, మళ్లీ అదే చంద్రబాబు నీడలో బతకాలా అని..! సో, ప్రస్తుతానికి అంతా అనిశ్చితే… ఇంతకీ కేసీయార్ ఏం చేయబోతున్నాడో చూద్దాం..!! దేవుడా… ఓ మంచి దేవుడా… ఏం చేయబోతున్నావ్..!?
Share this Article