.
Subramanyam Dogiparthi…. హిందీలో బ్లాక్ బస్టరయిన డిస్కో డాన్సర్ సినిమాకు రీమేక్ బాలకృష్ణ నటించిన డిస్కో కింగ్ సినిమా . 1974 లో బాల నటుడిగా అరంగేట్రం చేసిన బాలకృష్ణ 1980s కు సోలో హీరోగా నట యాత్ర సాగించారు .
1984 కు చిరంజీవి , బాలకృష్ణ హీరోలుగా సెటిల్ అయ్యారు . 1986 లో నాగార్జున , వెంకటేష్ తమ నట యాత్రను ప్రారంభించారు .
Ads
జూన్ 7 , 1984 న రిలీజయిన ఈ డిస్కో కింగ్ భారీ ఓపెనింగ్సుతో ఓపెన్ అయినా డిస్కో డాన్సర్ అంతగా సక్సెస్ కాలేదు . హిందీ సినిమాలు ఎక్కువగా చూడని నాలాంటి వారు కూడా డిస్కో డాన్సర్ చూసి ఉండటం డిస్కో కింగుకు కొంతమేర నష్టం చేసింది .
హిందీ సినిమాలో డిస్కో ప్రోగ్రాములు చాలా భారీగా తీసారు . పైగా ఉర్రూతలూగించే ట్యూన్స్ కంపోజిషన్ ఆ సినిమాను ఓ రేంజులో ఆడించింది . ఆ స్థాయిలో మన తెలుగు సినిమాలో డిస్కో డాన్సుల ప్రోగ్రాముల చిత్రీకరణ ఉండదు .
బాలకృష్ణ కష్టపడ్డా పక్కన హీరోయినుగా తులసి బదులు ఏ విజయశాంతి వంటి హీరోయిన్ని పెట్టి ఉంటే బాగుండేదేమో ! యన్టీఆర్ వారసుడు కావటం , హిందీ సినిమా బ్లాక్ బస్టర్ కావటం వలన ఏర్పడిన భారీ అంచనాలతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి . తెలుగులో రంగనాధ్ ధరించిన పాత్రను హిందీలో రాజేష్ ఖన్నా ధరించారు . ఆ పోలిక కూడా వచ్చింది . ఏ సత్యనారాయణ అయితే బాగుండేదేమో !
ఈ పోస్టుమార్టాన్ని పక్కన పెడితే పాటలన్నీ సూపర్ హిట్టే . సంగీత దర్శకుడు చక్రవర్తి హిందీ ట్యూన్లనే వాడటం వలన , అప్పటికే ఆ ట్యూన్లు జనం హమ్మింగులో ఉండటం వలన పాటలన్నీ హిట్టయ్యాయి . ముఖ్యంగా హవ్వ హవ్వ పాట . సుధాకర్ మీద ఉంటుందీ పాట . కుర్ర ప్రేక్షకులు అక్కడక్కడా థియేటర్లలో డిస్కో వేసేసారు .
ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ చదరంగం పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . సినిమా ప్రారంభంలో , క్లైమాక్సులో వస్తుంది . రంగనాధ్ , బాలకృష్ణల మీద ఉంటుంది . చుక్కలాంటి చక్కనమ్మ , నువ్వే నువ్వే నాలో ఊగే ప్రాణం , అబ్బాడి అమ్మాడి , పట్టిందల్లా బంగారమే డ్యూయెట్లు కుర్రాళ్ళని ఊపేసాయి . అంతే కాదు , కుర్రాళ్ళలో గిటార్ మేనియా కూడా వచ్చేసింది .
కొడుకు కెరీర్ కోసం మరో యువకుడి కెరీర్ని నాశనం చేద్దామని ప్రయత్నించిన ఓ తండ్రిగా జగ్గయ్య , కొడుగ్గా సుధాకర్ , ఆ కొడుకు చేత అవమానించబడే పర్సనల్ మేనేజరుగా నూతన్ ప్రసాద్ చాలా బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో సుమిత్ర , అనుపమ , మిక్కిలినేని ప్రభృతులు నటించారు . బుల్లి మీనా , హిందీ డాన్సర్లు లీనాదాస్ , సీమలు నటించారు . జయమాలిని , జ్యోతిలక్ష్మి , సిల్క్ స్మితలను ఎందుకు ప్రిఫర్ చేయలేదో !!
పాటల్ని వేటూరి , రాజశ్రీ , డైలాగులను గణేష్ పాత్రో వ్రాసారు . తాతినేని ప్రసాద్ దర్శకుడు . డాన్సుల్ని ధనుష్ ప్రభృతులు కంపోజ్ చేసారు . ఎప్పటిలాగే బాలసుబ్రమణ్యం బ్రహ్మాండంగా పాడారు . బాలకృష్ణ , నందమూరి అభిమానులు చూసి ఉండకపోతే ఓసారి తప్పక చూడతగ్గ సినిమాయే .
మ్యూజిక్ , డిస్కో లవర్స్ ఇంతకుముందు చూసి ఉన్నా మళ్ళా చూడవచ్చు . డిస్కో లవర్స్ పనిలోపనిగా హిందీ సినిమా కూడా చూసేయవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
కొన్ని సినిమాల జోలికి వెళ్లకూడదు… తెలుగులోకి అదే స్థాయి తర్జుమాలు కుదరవు… ఉదాహరణకు డాన్ డానే, ఎన్టీయార్ యుగంధర్ నచ్చదు జనానికి, అమితాబ్ అల్టిమేట్ మూవీ అది.., ఆ పాటలు అవీ సూపర్బ్…
అలాగే డిస్కో డాన్సర్ అప్పట్లో ఓ క్రేజ్… ఎంత అనుకరించినా మిథున్ చక్రవర్తి స్టెప్పులతో పోలిక బాలకృష్ణ సినిమాకు మైనస్… పైగా తులసి మరో మైనస్… రంగనాథూ నప్పలేదు ఓ పాత్రకు… బప్పీలహరి ట్యూన్స్ సేమ్ కాపీ అండ్ కంపోజ్…
అదేసమయంలో నమక్ హలాల్ వచ్చింది… అమితాబ్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ అది… దాన్ని ఏ సినిమాతోనూ పోల్చలేం…. తరువాత మన తెలుగువాళ్లే ఎవరో ఆ సినిమాను రీమేక్ చేస్తే అది డిజాస్టర్…
అందుకే, కొన్ని హిందీ సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు, అలాంటి సినిమాల జోలికి వెళ్తే ఒరిజినల్స్‌తో పోల్చుకుంటారు జనం… ఫలితం ఢమాల్…… ముచ్చట
Share this Article