Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హరిహరా..! సమస్య లేదంటున్నావా..? నీకు సమస్య కావద్దంటావా..?

May 24, 2025 by M S R

.

థియేటర్ల బంద్ అని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఆలోచిస్తున్న తీరు వెనుక నిజంగానే ఏదైనా పొలిటికల్ కుట్ర ఉందా..,? ఉందని పవన్ కల్యాణ్ అనుమానిస్తున్నాడా..? తన రాబోయే సినిమా హరిహర వీరమల్లును దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదని తన భావనా..?

ఏపీ సినిమా మంత్రి కందుల దుర్గేష్ ‘ఈ నిర్ణయాల వెనుక ఎవరున్నారో తక్షణం తేల్చిచెప్పాలని’ పోలీసులను కోరాడనే వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది…

Ads

1) పొలిటికల్ యాంగిల్ తీసుకుందాం… అసలు జగన్‌కూ టాలీవుడ్ పెద్దలకూ పడనే పడదు, జగన్‌తో ఇండస్ట్రీకి ఎప్పుడూ సత్సంబంధాలు లేవు, పైగా తను అధికారంలో లేడు, తను చేయగలిగేది ఏముంటుంది ఇప్పుడు..? పైగా టాలీవుడ్ పెద్దలకు టీడీపీ కూటమితోనే కదా సత్సంబధాలు….

2. పోనీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రేవంతుడితో ఏపీ కూటమి నాయకుడు చంద్రబాబుకు సత్సంబంధాలే ఉన్నాయి… తను కావాలని ఇండస్ట్రీ వాళ్లను గోకడు, అదీ పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా… పైగా ఎగ్జిబిటర్లను ఎగదోసేంత ఓపిక, తీరిక లేవు కూడా…

3. హరిహర వీరమల్లు ఒకటే కాదు కదా… కొన్ని ఇతర పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి… నిజంగానే హరిహర వీరమల్లును దెబ్బ తీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అవీ దెబ్బతింటాయి కదా మరి…

4. పవన్ కల్యాణ్ ఆ ఒక్క సినిమాకు హీరోగా మాత్రమే కాదు, నిజంగానే అధికారంలో ఉన్న ఓ సినిమా మనిషిగా ఎగ్జిబిటర్ల ఆందోళనను కూడా పట్టించుకోవాలి కదా… కేవలం తన సినిమా కోణంలో మాత్రమే ఎలా చూస్తాడు..?.

5. నిజమే, ఇది మల్టీప్లెక్సుల సమస్య కాదు… వాళ్లకు షేరింగ్… ప్రాబ్లం లేదు… కానీ సింగిల్ స్క్రీన్లకు అద్దె విధానంతోనే నష్టపోతున్నామని కదా వాళ్ల ఆందోళన… పోనీ, సింగిల్ స్క్రీన్లు మూతపడినా పర్లేదా..? ఆ రెవిన్యూ సినిమా వాళ్లకు, ఆ పన్ను ఆదాయం ప్రభుత్వానికి అక్కర్లేదా..?

6.  ఆ నలుగురు… వాళ్లదే తెలుగు సినిమా మీద గుత్తాధిపత్యం… నిజమే, ఒక దిల్ రాజు, ఒక సురేష్ బాబు, ఒక అల్లు అరవింద్, ఒక ఆసియన్ సునీల్ పెత్తనాలు నిజమే అనుకుందాం… కానీ ఇప్పుడు వాళ్లకు కావాలని పవన్ కల్యాణ్ సినిమాను దెబ్బతీయాల్సిన అవసరం ఏముంది..? వైరం ఏముంది..?.

7. పైగా పవన్ కల్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు… తనతో గోక్కునే సిట్యుయేషన్ ఉందా సినిమా పెద్దలకు..? ఐనా వాళ్లు ఇండస్ట్రీ బాగుంటేనే కదా నాలుగు డబ్బులు ఇంకా ఎక్కువగా సంపాదించేది..?

…. ఏవో భేటీలు, ఇంకేవో నిర్ణయాలు అన్నారు, దుర్గేష్ స్టేట్‌మెంట్ దెబ్బకు ఇక పవన్ కల్యాణ్‌కు కోపం వస్తుందనే భావనతో సినిమా పెద్దలు కూడా ఈ సమస్యను ఇప్పటికి వదిలేస్తే అదింకా పెరిగిపోదా..?  ఏదో ఓ పరిష్కారం దొరకాలి కదా..? ప్రస్తుతానికి ఈ సినిమా కలెక్షన్లు అయిపోయేవరకు ఆగి, తరువాత ప్రయత్నాలు చేయండి అని సినిమా పెద్దలకు చెబుతున్నట్టా ఏపీ ప్రభుత్వం..? అంటే ఎన్నాళ్లు..?

దీంతో అయిపోలేదు కదా, మరో పెద్ద సినిమా కూడా పవన్ కల్యాణ్ హీరోగా రాబోతోంది కదా, అప్పుడూ ఈ సమస్య ఉంటుంది కదా… పోనీ, ఇంకేదైనా కుట్ర ఉందనేది సినిమా మంత్రి సందేహమా..? ఐతే అదేమిటి..? అదొక జవాబు లేని పెద్ద ప్రశ్న…!!

పోనీ, మరెవరో పెద్ద హీరో ఏవో కుట్ర చేస్తున్నాడని అనుకుందాం… ఫాయిదా ఏముంది తనకు కూడా… థియేటర్లు బంద్ పెడితే వసూళ్లు, పారితోషికాలపరంగా అందరికీ దెబ్బే కదా… హేమిటో, అంతా గందరగోళంలోెకి నెట్టేశారు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారీ సిక్స్ కొట్టాడు… అభినందనలు రాలేదు… చిలుం వదిలింది…
  • హరిహరా..! సమస్య లేదంటున్నావా..? నీకు సమస్య కావద్దంటావా..?
  • అసూర్యంపశ్య…! ఎండ కన్నెరుగని సుతారం బతుకులు అనారోగ్యమే..!!
  • … ఇంతకీ కుందరదన అంటే తెలుగులో అర్థమేమిటి చిరంజీవీ…
  • మిథున్ డిస్కోడాన్సర్‌తో పోలిక… బాలయ్య డిస్కోకింగ్‌కు శాపమైంది…
  • బ్రహ్మోస్ అంటేనే బ్రహ్మాస్త్రం… అది మన యుద్ధసామర్థ్య ప్రకటన…
  • ఒక నరేంద్ర, ఒక ఈటల, ఒక విజయశాంతి… సేమ్, ఒక కవిత..?!
  • స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…
  • పక్కా కమర్షియల్ చట్రంలోనే ఓ ఫిలాసఫీ చెబుతాడు త్రివిక్రముడు…
  • …. ముఖ్య అతిథి సీఎం గారి పెళ్లాం అని తెలియకపోతే ఎలా మరి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions