.
ప్రత్యర్థులపై దుమ్మూదుమారం రేపడంలో బీఆర్ఎస్ క్యాంపుకు మించింది లేదు ప్రస్తుతం దేశంలో… నేనయితే బురద గుమ్మరిస్తాను, నీ తీట, నువ్వే కడుక్కో అన్నట్టుగా ఉధృతంగా ఉంటుంది…
ఆమధ్య కేసీయార్ మోడీని, అమిత్‌షాను అడ్డగోలుగా కార్నర్ చేయడానికి… ఏదో ఎమ్మెల్యేల కొనుగోలు అని ఓ షూటింగ్ తంతు నిర్వహించి, దేశమంతా వీడియోలు పంపించి గాయిగత్తర లేపాడు కదా… అంత నొటోరియస్ బీజేపీ సోషల్ వింగ్‌కూ దాన్ని కౌంటర్ చేయడం చేతకాలేదు…
Ads
పాపం, తెలంగాణ కాంగ్రెస్ ఎంత..? బీఆర్ఎస్ ప్రాపగాండా పాలిటిక్స్‌ను కౌంటర్ చేయడంలో అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం ప్లస్ పార్టీ ప్లస్ లీడర్… బీఆర్ఎస్ క్యాంపు అలా అందుకుంటుంది… ఒక కోణంలో ఆ ‘సోషల్ మీడియా ప్రొఫెషనలిజం’ మెచ్చుకోవాలేమో… కంచ గచ్చిబౌలి కథలు చూశాం కదా…
సరే, ఇప్పటి విషయానికి వస్తే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ అధ్వానం… మధ్యలోనే పోటీ విడిచి స్వదేశం పారిపోయిన మిస్ ఇంగ్లండ్ వ్యాఖ్యలే మంచి ఉదాహరణ… కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించుకునే చాన్స్ కూడా లేదు… ఆల్రెడీ విశ్వవీథుల్లో ఇజ్జత్ పోయింది, మనమూ చెప్పుకున్నాం…
ఓ మిత్రుడి పోస్టులో ఓ క్లిప్పింగు చూసి నిర్ఘాంతపోవల్సి వచ్చింది… అది పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా కార్నర్ చేయడానికి క్రియేట్ చేసిందనే విషయం అర్థమవుతూనే ఉంది… అచ్చంగా ప్రభుత్వం, పార్టీ, రేవంత్ క్యాంపులు చేష్టలుడిగాయి… ఎప్పటిలాగే…
.
వివరణ, వాస్తవం గడప దాటేలోపు ఆరోపణ, విమర్శల లోకమంతా చుట్టి వస్తుందని తాజా సోషల్ సామెత… అచ్చం ఇది అదే… వీటికి డేట్‌లైన్లు ఉండవు, అవేం పత్రికలో తెలియవు… జస్ట్, ఓ మ్యాటర్ కంపోజ్ చేయాలి, వేళ్లు ఏది టైప్ చేస్తే అదే… జస్ట్, వాట్సపు, ఫేస్‌బుక్కుల కోసమే ఈ సింగిల్ ఐటమ్ ఎడిషన్లు అన్నమాట…
ఇది చూడండి… రాక్షసులు అనే హెడింగ్… స్పానర్లు లేదా గెస్టులు మాటిమాటికీ తాకుతూ రూమ్‌కు రమ్మని బలవంతం చేశారట… వాడెవడో మంత్రి అట, నా వయస్సు 50, 5 వేల కోట్ల ఆస్తి ఉంది, ఓసారి కలువు అని ఆఫర్ ఇచ్చాడట… మరో కాంగ్రెస్ నాయకుడు గట్టిగా గిచ్చి అసభ్యకరమైన సైగలు చేశాడట…
కాంగ్రెసోళ్ల తీరు మీద ఓ మహిళా మంత్రికి ఫిర్యాదు చేస్తే ఆమె పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయిందట… హేమిటో ఇదంతా…
నిజమే… ఈ ఈవెంట్ నిర్వహణ ఓ దరిద్రం… కానీ ఇవన్నీ జరిగాయా..? ఇవన్నీ ఆమె చెప్పుకుందా..? మేం కోతులమా, మేం వేశ్యలమా అనడిగిన మిస్ ఇంగ్లండ్ మరి ఇవన్నీ ఎందుకు చెప్పలేదు బ్రిటన్ పత్రికలకు… ఫాఫం, తెలుగులో జస్ట్, నమస్తే తెలంగాణ అదే ఉత్కృష్టమైన పత్రికే దిక్కు అనుకుని ఆ ప్రతినిధికే చెప్పుకున్నట్టు పత్రిక రాసుకుంది కదా…
మరి ఆ పత్రికకు ఈ కాంగ్రెస్ మంత్రి నిర్వాకం గురించి చెప్పలేదెందుకు ఫాఫం..? భయంతో పారిపోయి క్షేమంగా ఇల్లు చేరుకున్నాకైనా, అక్కడి టాబ్లాయిడ్లకు చెప్పుకునేది కదా, చాలా చెప్పింది, ఇవన్నీ చెప్పలేదెందుకు..? ‘‘అక్కడ అధికార పార్టీ నాయకులు మనుషులు కాదు, రాక్షసులు’’ అని చెప్పిందట…
అవునా..? నిజంగా ఆమె ఇంటర్వ్యూల్లో ఉందా ఇదంతా..? చదువుతుంటే అర్థం కావడం లేదా..? ఇదంతా మడ్ జర్నలిజం అని… ఆమధ్య చూసిన రేవతి మార్క్ జర్నలిజం కూడా ఇదే బాపతు కదా… మన చుట్టూ ఇదుగో ఇలాంటి బురద ప్రవాహాలు…!!
Share this Article