Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

War Real Time Data…. పాకిస్థాన్‌తో ఘర్షణలో మనం ఏం సాధించామంటే..!

May 26, 2025 by M S R

.

Pardha Saradhi Potluri ……. May 10 న ఆపరేషన్ సిందూర్ కి విరామం ప్రకటించాక ఇప్పుడిప్పుడే అసలైన డాటా బయటికి వస్తున్నది, అయితే ఇది కూడా 50% మాత్రమే! యుద్ధ వ్యూహలు అనేవి వందశాతం వెంటనే బయటికి రావు! రెండవ ప్రపంచయుద్ధం తాలూకు వ్యూహలూ, వాటిని అమలు చేసిన వివరాలు పూర్తిగా బహిర్గతం అవడానికి 20 ఏళ్ళు పట్టింది!

ఎందుకంత సమయం పట్టింది?
ఎందుకంటే యుద్ధంలో వాడిన ఆయుధాలు అవుట్ డేట్ అయిపోయి కొత్త తరం ఆయుధాలు వాడుకలోకి వచ్చేవరకూ వ్యూహలు బయటపెట్టరు!
So! May 6, 7, 8, 9, 10 తేదీలలో వచ్చిన యుద్ధవార్తలలో 50% శాతం మాత్రమే నిజాలు ఉన్నాయి! మిగతా వార్తలు పుకార్లు లేదా తెలియక ప్రచారం కోసం చేసినవే!

Ads

కొన్ని పుకార్లు….. నిజాలు…
S-400 తో పాకిస్థాన్ డ్రోన్లని భారత్ కూల్చివేసింది. S-400 కొన్నది ICBM, బాలిస్టిక్ మిసైల్స్, జెట్ ఫైటర్స్, క్రూయిజ్ మిసైల్స్ కూల్చడానికి కానీ డ్రోన్లని కూల్చడానికి కాదు. 400 KM పరిధి ఉండే S-400 మిసైల్ ధర మూడు లక్షల డాలర్లు ఉంటుంది. అసలు S-400 రాడార్ డ్రోన్లని డిటెక్ట్ చేయలేదు!

S-400 తో పాకిస్థాన్ లోని లాండ్ టార్గెట్స్ ని భారత్ కొట్టింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంతే కానీ లాండ్ ఎటాక్ సిస్టమ్ కాదు!

చాలా వరకు వీడియోలు వీడియో గేమ్ వి పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఇక పలు అంతస్థుల భవనాలని మిసైల్ తో కూల్చినవి బ్రహ్మోస్ తో కూల్చినట్లుగా వీడియోలు పోస్ట్ చేశారు. కానీ అవి ఇజ్రాయేల్ గాజా, లెబనాన్ ల మీద దాడిచేసిన దృశ్యాలు.

మన సైన్యం, ఎయిర్ ఫోర్స్ లు మిలిటరీ స్థావరాలని దృష్టిలో పెట్టుకొని దాడి చేశాయి కానీ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ ని కాదు. అసలు పగలు పూట భారత్ దాడి చేయలేదు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ప్రపంచంలోనే ప్రధమ స్థానంలోకి చేరిపోయాయి!

బ్రహ్మోస్ మిసైళ్ళు సంవత్సరానికి 80- 100 మధ్య మాత్రమే తయారు చేయగల సామర్ధ్యం ఉంది మనకి. అంటే నెలకి రమారమి 7 మిసైళ్ళని మాత్రమే తయారుచేయగలదు భారత్! వచ్చే రోజుల్లో 100- 150 వరకు తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరీ ఛండాలం ఏమిటంటే వేలల్లో తయారు చేస్తున్నాము అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి సోషల్ మీడియాలో!

*********************
Well..! ఇంతకీ భారత్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందా?
Yes..! భారత్ తన లక్ష్యాన్ని 100% నెరవేర్చుకుంది!
చాలా మంది అనుకుంటున్నట్లు PoK లక్ష్యంగా భారత సైన్యం వ్యూహరచన చేయలేదు! May 8న pok లోకి కొన్ని చోట్ల భారత ఆర్మీ చొరబడినా మళ్ళీ వెనక్కి వచ్చేసింది. పాకిస్థాన్ ఆర్మీ ఫార్వర్డ్ పోస్ట్ ల దగ్గర ఎంతమంది ఉన్నారు? ఆయుధ నిల్వలు ఎన్నిరోజులకి సరిపడా ఉన్నాయి లాంటి విషయాలు తెలుసుకునేందుకు కొన్నిచోట్ల కాల్పులకి పాక్ ప్రతిస్పందన లేకపోవడంతో మన సైనికులు POK లోకి వెళ్లి చెక్ చేసి వెనక్కి వచ్చారు!

మన సైనికులు పాకిస్తాన్ ఫార్వర్డ్ పోస్టుని ధ్వంసం చేసినా రెస్పాన్స్ లేకపోవడంతో వెళ్లారు! వెళ్ళింది 30 మంది భారత సైనికులు అయితే ఇంకేముంది భారత్ POK ని స్వాధీనం చేసుకుబోతున్నది అంటూ ఎలక్ట్రానిక్ మీడియా ఊదరకొట్టేసింది! అరే! ఫలానా ఛానెల్ వాడు POK అంటున్నాడు కాబట్టి మనం వెనుకబడి పోకూడదు అన్నట్టుగా పోటీ ఛానెల్స్ వాళ్లు కూడా POK పాటని పదే పదే ప్రసారం చేశాయి.

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాయి ఛానెల్స్?
POK ని స్వాధీనం చేసుకోవాలి అంటే యుద్ధ టాంకులని పెద్ద సంఖ్యలో మొహరిస్తారు! గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కాశ్మీర్ లతో పాటు లడాక్ దగ్గర కూడా MBT లని తరలిస్తారు. కానీ అలాంటిది ఏది జరగలేదు! కానీ POK ని స్వాధీనం చేసుకుంటున్నట్లుగా పుకార్లు లేపారు!

********************
రియల్ టైమ్ వార్ డేటా – Real Time War Data!
మనకి ఎంతమంది సైనికులు చనిపోయారు? ఎన్ని జెట్ ఫైటర్స్ కూలిపోయాయి? ఇలాంటి గణాంకాల మీదనే మన దృష్టి ఉంటుంది. ఇలాంటి గణాంకాలతోనే గెలుపు ఓటములను నిర్ణయిస్తాము. కానీ మిలిటరీ అనలిస్ట్ లు మాత్రం వార్ డాటాని విశ్లేషంచి గెలుపు ఓటములను నిర్ణయిస్తారు!

నష్టం ఇరువైపులా ఉండి తీరుతుంది. కానీ ఎవరు ఎక్కువ నష్టపోయారు అన్నదానికంటే మిషన్ సక్సెస్ అయిందా లేదా అన్నదే చూస్తారు.
అలా చూస్తే భారత్ మిషన్ సక్సెస్ అయింది!

war
ఎలా?
జస్ట్ పాకిస్థాన్ తిరిగి దాడి చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది భారత సైన్యం తమ భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తుంటే!
వార్ డేటా విషయానికి వస్తే భారత్ రియల్ టైం డాటాని రికార్డ్ చేయగగలిగింది!
రియల్ టైమ్ వార్ డాటా అంటే జెట్ ఫైటర్స్ కి రూట్ మ్యాప్ ఇచ్చి టార్గెట్ ఎక్కడ ఉంది, ఇచ్చిన రూట్ మ్యాప్ లో ఎక్కడికి వెళ్లిన తరువాత మిసైల్ లేదా గైడెడ్ బాంబు ని రిలీజ్ చేయాలి అనే విషయాన్ని నిర్దేశిస్తారు.

సదరు జెట్ ఫైటర్ పైలట్ తనకి నిర్దేశించిన రూట్ లోనే వెళ్లి మిసైల్ లేదా గైడెడ్ బాంబ్ ని రిలీజ్ చేస్తే మిసైల్ లేదా గైడెడ్ బాంబ్ తనకి నిర్దేశించిన టార్గెట్ ని ధ్వంసం చేసిందా? మిసైల్ లేదా గైడెడ్ బాంబ్ ప్రయాణించిన మార్గం ( Trajectory ) ఎలా ఉంది? అలాగే మిసైల్ లేదా గైడెడ్ బాంబ్ తన టార్గెట్ ని ఎంత యాక్యూరెట్ గా కొట్టింది అనే విషయాలని రియల్ టైమ్ లో రికార్డ్ చేస్తారు. ఇది అరుదుగా దొరికే అవకాశం!

పరీక్ష చేసేటప్పుడు కృత్రిమ టార్గెట్ ని సృష్టించి ప్రయోగించడం వేరు నిజమైన శత్రు దేశపు టార్గెట్ ని కొట్టడం వేరు.
మూడు రోజుల యుద్ధం అనే కంటే కన్ఫ్లిక్ట్ అనే పదం సరైనది! ఎందుకంటే భారతదేశ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ ముఖాముఖి తలపడలేదు. ఇండియన్ నావీ, పాకిస్తాన్ నావీ సముద్రంలో ముఖాముఖీ తలపడలేదు కాబట్టి ఆపరేషన్ సిందూర్ ని కన్ఫ్లిక్ట్ గానే పిలవాలి!

మూడు రోజుల కన్ఫ్లిక్ట్ లో జెట్ ఫైటర్స్, మిసైల్స్, గైడెడ్ బాంబ్స్, డ్రోన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ప్రయోగించినపుడు వాటి పని తీరుని రియల్ టైమ్ లో రికార్డ్ చేశారు. ఈ రియల్ టైమ్ వార్ డేటా అనేది చాలా ముఖ్యమైనది మన డిఫెన్స్ సైన్టిస్టులకి మరియు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కి.

war

ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ డేటాని విశ్లేషణ చేసి ఆ రిపోర్ట్ ని DRDO మరియు BEL కి ఇస్తారు. DRDO, BEL సైంటిస్టులు సాటిలైట్ డాటాని విశ్లేషంచి ఎయిర్ ఫోర్స్, ఆర్మీ రిపోర్ట్ తో పోల్చుకుంటారు.
ముఖ్యంగా మిసైల్ ముందు భాగంలో ఉండే సీకర్, మధ్యభాగంలో ఉండే ఏవియానిక్స్, గైడెన్స్ సిస్టమ్స్ ల పని తీరుని మరింత అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది శాస్త్రవేత్తలకి ఈ రియల్ టైమ్ వార్ డాటాతో!
ఆకాశ్, బ్రహ్మోస్ మిసైల్స్ మనదేశంలోనే తయారు అవుతాయి కాబట్టి రియల్ టైమ్ వార్ డేటా అనేది మనకి ముఖ్యం అవుతుంది!

ఇప్పటివరకూ అమెరికాతో పాటు నాటో దేశాల దగ్గర మాత్రమే రియల్ టైమ్ వార్ డేటా ఉంది. ఇప్పుడు మన దగ్గర కూడా రియల్ టైమ్ వార్ డేటా ఉంది. అది కూడా 80% కంటే ఎక్కువ యాక్యురసి తో టార్గెట్ లని కొట్టిన మిసైల్ డేటా ఇది!

DRDO బ్రహ్మోస్ ని తయారు చేస్తే, BEL ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ ని తయారు చేస్తుంది. ఈ రియల్ టైమ్ వార్ డేటాతో ఇంకో పది శాతం యాక్యురసిని పెంచుకోగలిగితే అంటే 90% యాక్యురసితో పశ్చిమ దేశాల ఖరీదైన మిసైల్స్ కంటే భారత్ అందులో 40% తక్కువ ధరకే మిసైల్స్ ని మిగతా దేశాలకి అమ్మగలుగుతుంది. అందుకే రియల్ టైమ్ వార్ డాటా ముఖ్యమైనది అని అన్నది.

టర్కీ, చైనా దేశాలు మనతో పోటీలో ఉన్నాయి తక్కువ ధరకి ఆయుధాలు అమ్మే అంతర్జాతీయ మార్కెట్ లో. కానీ చైనాకి కానీ, టర్కీకి కానీ రియల్ టైమ్ వార్ డేటా లేదు. SO! ముందు ముందు మిసైల్ మార్కెట్ లో పశ్చిమ దేశాలని మినహాయిస్తే తరువాతి స్థానం భారత దేశానిదే అవుతుంది!

ఇప్పటికే ప్రయివేట్ స్పేస్ ఏజెన్సీల సహాయంతో ఉపగ్రహ ఛాయా చిత్రాలని తీసుకుని విశ్లేషణ చేసే పనిలో ఉన్నాయి చాలా దేశాలు.
ఇప్పటికే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ పని తీరు మీద విశ్లేషణలు జరిగాయి భారత్ వెలుపల! ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మీద మాత్రం రెండో ఆలోచన లేకుండా కొనడానికి సిద్ధంగా ఉన్న దేశాల సంఖ్య 15 కాగా కనీసం నాలుగు లేదా ఐయిదు దేశాలు ఆకాశ్ కొనవచ్చు సమీప భవిష్యత్ లో!

So ..! PoK ని స్వాధీనం చేసుకుంటే పోయేదిగా అంటూ నిట్టూరుస్తున్న వాళ్లకి రియల్ టైమ్ వార్ డేటా సహాయంతో ఎప్పుడైనా pok ని స్వాధీనం చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకోవాలి!

*******************

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions