Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎప్పటిలాగే శోభనంబాబుకు ఓ ఇల్లాలు ఓ ప్రియురాలు… ఓ బుడ్డోడు..!

May 28, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. పాపం ! పసివాడు ! ఈ సినిమా కూడా పాపం ఓ పసివాడిదే . ప్రేక్షకుల గుండెను పిండేసే విధంగా ఉంటుంది ఈ పసివాడి పాత్ర . పసివాడు కూడా heart-toucching గానే నటించాడు . పేరు మాస్టర్ అర్జున్ . ఇప్పుడు 45/46 ఏళ్ళకు చేరి ఉంటాడేమో ! చాలా ముద్దుగా , చక్కటి నటనను అందించాడు .

ఓ పచ్చని సంసారంలోకి హఠాత్తుగా ఒక పసివాడు ఎంటర్ అవుతాడు . హీరో గారి గత ప్రియురాలి బిడ్డ . ఆ ప్రియురాలు చనిపోవటంతో ఆ బిడ్డ బాగోగులు ఆమెను ఆదరించిన మాస్టారి పైన పడుతుంది . ఆ బిడ్డను తండ్రి వద్దకు పంపుతాడు .

Ads

ఈ పసివాడిని కుటుంబంలోకి స్వీకరించలేక , కుటుంబం అతలాకుతలం అవుతుంది . తల్లి హితబోధతో ఇల్లు వదలి వెళ్ళిన హీరోయిన్ సర్దుకుని వెనక్కు వచ్చి పసివాడిని కుటుంబంలోకి ఆహ్వానించటంతో సినిమా ముగుస్తుంది .

ఈ సినిమాను ఇప్పుడు చూసే వాళ్ళకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు గుర్తుకొస్తుంది . ఈ ఇల్లాలు ప్రియురాలు సినిమా నైనితాల్ చుట్టూ ఉంటే ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు సినిమా నేపాల్ చుట్టూ ఉంటుంది .

హిందీలో అవార్డులు , డబ్బులు కురిసిన మాసూమ్ సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా మార్పులు , చేర్పులతో తీసారు . హిందీలో నసీరుద్దీన్ షా , షబానా ఆజ్మీ నటించారు . అయిదు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి .

ఇల్లాలు అని ఉంటే సగం సక్సెస్ అయినట్లే కదా తెలుగులో . కాస్త బాగుంటే మిగతా పని మహిళామ తల్లులు చూసుకుంటారు . ఈ సినిమా ఆ కోవకు సంబంధించిందే . 1+ 2 సినిమా . పైగా శోభన్ బాబు హీరో . శోభన్ బాబు నటన చాలా settled గా ఉంటుంది . మహిళా ప్రేక్షకుల సానుభూతి కూడా పొందుతాడు .

ఆయన ప్రియురాలిగా ప్రీతి అనే నూతన నటి గ్లామర్ స్పేసుని ఫిల్ చేస్తుంది . ఇల్లాలుగా సుహాసిని చక్కగా నటించింది . ఏ జయసుధ అయితే ఇంకా బాగుండేదేమో ! (ఈ ప్రీతి  రెండు రెళ్లు ఆరు మినహా మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించినట్టు లేదు… వివరాలూ పెద్దగా నెట్‌లో దొరకవు…)

ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , శుభ , అన్నపూర్ణ , సుత్తి జంట , మమత , బుల్లి మీనా ప్రభృతులు నటించారు . నైనితాల్ ప్రకృతి అందాలను బాగా చూపించారు . కోదండరామిరెడ్డి మార్క్ బాగా కనిపిస్తుంది . సినిమా భారంగా నడుస్తుంది .

అయినా పాటలు , పిక్చరైజేషన్ మహాత్మ్యాలతో 14 సెంటర్లలో వంద రోజులు ఆడింది . హైదరాబాద్ వెంకటేశ్ థియేటర్లో 175 రోజుల పోస్టర్ కూడా పడింది . బహుశా షిఫ్టులతో రన్ అయి ఉండవచ్చు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఏమిటో ఈ కలవరం ఏమిటో ఈ కలవరం ఈ క్షణం రసమయం డ్యూయెట్ శోభన్ బాబు , ప్రీతిల మీద నైనితాల్ అందాల్లో చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఆదివారం అర్ధాంగి సాయంకాలం సరసానికి పాటతో హేపీ కుటుంబాన్ని ప్రేక్షకులకు బాగా ప్రదర్శిస్తాడు దర్శకుడు .

తాగితే పాపమా భార్యలకు కోపమా అంటూ సాగే పార్టీ పాటలో సత్యనారాయణ , శోభన్ బాబుల నటన , పాట చిత్రీకరణ బాగుంటుంది . సత్యనారాయణ నటన కూడా సినిమాలో హైలైటే . ఆర్ద్రతతో కూడిన పాట ఏమని తెలిపేది ఎవరని చెప్పేది అంటూ సాగే పాటలో శోభన్ బాబు నటన బాగుంటుంది .

అలాంటిదే మరో పాట ఇది కధ కాదు ఇది అల కాదు పాట . పాటల్ని సి నారాయణరెడ్డి , వేటూరి వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు .

తాగితే పాపమా పాటలో సత్యనారాయణకు చక్రవర్తి గొంతు ఇచ్చారు . సత్యానంద్ డైలాగులు టచీగా ఉంటాయి . ముఖ్యంగా శోభన్ బాబు , అన్నపూర్ణ డైలాగ్స్ .

It’s an emotion-filled , heart-touching , feel good , family sentiment picture . యూట్యూబులో ఉంది . శోభన్ బాబు అభిమానులకు బాగా నచ్చుతుంది . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు  (మాస్టర్ అర్జున్ గురించి మరో కథనంలో…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తి – భక్తి … కన్నప్ప సరే, ఆ మూడు సినిమాలనూ ఓసారి పరిశీలిద్దాం…
  • తండ్రి బతుకంతా ఆకలి పోరాటమే… కొడుకు ఇప్పుడు ఫేమస్ స్టార్…
  • హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ కచేరీ… కానీ కళ్లు తిరిగే రేట్లు అట..!!
  • బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?
  • ఇంగ్లిషు సబ్జెక్టులే అయినా… అడాప్షన్‌లో మెళకువ ఉంటేనే సక్సెస్సు…
  • వజ్రభూమి… Land Of Diamonds… చివరకు మిగిలేది దుమ్మూధూళే…
  • ADHD … స్టార్ ఫహాద్ ఫాజిల్‌కు ఓ అరుదైన ఆరోగ్య సమస్య…
  • ఇది 1 + 2 కాదు… 1 + 3 కూడా కాదు… ఏకంగా 1 + 6 ఫార్ములా…
  • నేత ప్రాణాలే ముఖ్యం… విధిలేక సొంత భర్త ప్రాణాలే తీసేసింది…
  • ‘వానెక్క’ విజయ్ మస్తు చేసిండు… సత్యదేవ్‌తో కలిసి సైన్మా నిలబెట్టిండు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions