Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ చిన్నారులు… ప్రపంచ సుందరిని కలిసిన తరువాత… ఛ, దుర్విధి…

June 3, 2025 by M S R

.

నిజంగానే… నిజజీవితాల్లో మన గమనించే విశేషాలను మించిన మెలోడ్రామా ఏ సాహిత్యంలోనైనా ఉంటుందా..? గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ క్రుయల్… అఫ్‌కోర్స్, గాడ్ ఈజ్ డిక్టేటర్…

లేకపోతే ఏమిటబ్బా… ఆ పిల్లలు ఏకంగా మిస్ వరల్డ్‌ను కలిశారు, ఫోటోలు దిగారు, ఆనందంతో ఎగిరి గంతేశారు… (అప్పటికి ఆమె జస్ట్ ఏ కంటెస్టెంట్… మిస్ థాయ్‌లాండ్…)

Ads

మిస్ వరల్డ్ 2025 విజేత ఒపల్ సుచతా చుయాంగ్‌స్రీ హైదరాబాద్‌లో జరిగిన గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో మరణించిన పిల్లల్ని నిజంగా కలుసుకుంది… ఈ ప్రమాదం మే 18, 2025న జరిగింది, ఇందులో 17 మంది, అందులో 8 మంది పిల్లలు, ప్రాణాలు కోల్పోయారు. ఈ బాధాకర సంఘటనలో మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందినవారు, వారు చార్మినార్ సమీపంలోని ముత్యాల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు…

సుచతా, మిస్ వరల్డ్ పోటీ సందర్భంగా హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు, చార్మినార్ సమీపంలోని ఆ ముత్యాల దుకాణాన్ని సందర్శించింది… ఆమె అక్కడ ఆ షాపుదారు పిల్లలతో సంతోషంగా గడిపింది… ఒక చిన్నారి, సుచతా వేసుకున్న జీబ్రా డిజైన్ డ్రెస్‌ను చూసి, “నేనూ మీలాగా డ్రెస్ వేసుకుంటా!” అంటూ ఉత్సాహంగా మాట్లాడింది… ఆమె ఆ పిల్లల ఇంటికి కూడా వెళ్లి, వారి తల్లి వండుతున్న ఫుడ్ ఫ్లేవర్ కూడా ఆస్వాదించింది… సోర్స్ :: newindianexpress.com

ఈ సంఘటన తర్వాత, అదే ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ పిల్లలు, వారి కుటుంబ సభ్యులు మరణించారని తెలుసుకుని, సుచతా తన సోషల్ మీడియా ద్వారా హృదయ స్పర్శ కలిగించే సందేశాన్ని పంచుకుంది…

“వాళ్లు నన్ను ఉత్సాహంగా, ఆసక్తిగా చూశారు,.. నా గెలుపు కోసం ప్రార్థించారు… కానీ ఇప్పుడు వాళ్లే లేరు అనే వార్త నా గుండెను పగులగొట్టింది… మన విజయం చూసేందుకు వాళ్లకు దేవుడు అవకాశం ఇవ్వలేదు…” అని రాసిన  ఆమె చివరగా, “మీ ఆత్మలు శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం మళ్ళీ కలుద్దాం – ఒక కొత్త జీవితంలో…” అని పేర్కొంది… 

ఈ సంఘటన ఆమెకు వ్యక్తిగతంగా ఎంతో బాధ కలిగించింది.., ఎందుకంటే, ఆమె కలిసిన పిల్లలే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు…. మనసు కదిలించిన వార్త… వాళ్లను గుర్తుచేసుకున్న మిస్ వరల్డ్ ఒపల్ … వెరీ కైండ్ హార్ట్…!! కీపిటప్… ఈ స్వార్థ, దుర్మార్గ, నికృష్ట ప్రపంచంలో ఇలా గుర్తుచేసుకునేేవాళ్లు ఎందరు..? అదీ నీ ఫీల్డ్‌లో..!!

View this post on Instagram

A post shared by Opal Suchata (@suchaaata)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బనకచర్లపై ఇన్నాళ్ల తెలంగాణ పకడ్బందీ వ్యూహానికి ఆ లేఖతో నష్టం!
  • న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!
  • ఆహా రష్మిక… అనాలనిపించింది ఈ ‘నదివే’ పాట చూడగానే…
  • రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…
  • కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…
  • కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…
  • కోమటిరెడ్డి అదే చేయగలిగితే… మోడీ, కేసీయార్‌‌లకన్నా తోపు తురుం..!!
  • మొత్తం 5 జంటలు… మరి ఈ ‘ముచ్చటగా ముగ్గురు’ టైటిల్ ఏమిటో…
  • AI ప్లాట్‌ఫామ్స్ … అతివాడకంతో మన బుర్రలు మొద్దుబారుతున్నయ్…
  • గుల్ఫాం ఉప-ద్రవం… తాగినా చస్తారు, తాగకపోయినా చస్తారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions