Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… కమలహాసన్ తాజా సంకుచితత్వం వెనుక అదా కథ…!?

June 3, 2025 by M S R

.

కన్నడం మీద పిచ్చి కూతలు కూసిన కమలహాసన్… మొత్తం కర్నాటక బాధపడినా… థూత్కరించినా… ఎందుకు సారీ చెప్పడం లేదు…

చివరకు కర్నాటక ఫిలిమ్ ఛాంబర్ ఆ సినిమాను నిషేధించినా సరే, వైరమే కోరుకుంటున్నాడు తప్ప తల వంచడం లేదు దేనికి..? సంస్కారాన్ని, మర్యాదను మరిచి, రేప్పొద్దున తనకు కర్నాటకలో ‘వ్యాపార నష్టం’ వాటిల్లబోతుందని తెలిసీ స్పందించడం లేదు దేనికి…?

Ads

హైకోర్టు కూడా నువ్వేమైనా చరిత్రకారుడివా..? క్షమాపణ చెప్పొచ్చు కదా అనడిగితే… కమల్‌హాసన్ తరఫు న్యాయవాది మేం కర్నాటకలో సినిమాను రిలీజ్ చేయబోవడం లేదు అన్నాడు… అంటే, తెగేదాకా లాగుతున్నాడా కమలహాసన్..?

కన్నడిగుల ఆత్మాభిమానాన్ని గోకుతున్నాడా..? ఎందుకు..? పైగా తను కరుణానిధిని కలిసి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోను ఎందుకు సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో పెట్టినట్టు..? తనకు స్టాలిన్ దయతో ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కృతజ్ఞతా..? మరి ఈ సందర్భంలోనే దేనికి..?

అన్నీ ఓ రకమైన ప్రచారాలకు దారితీస్తున్నాయి… ఏమిటంటే..? కమలహాసన్ కావాలనే చేస్తున్నాడు.,. సినిమా బాగారాలేదు… మణిరత్నం మ్యాజిక్ ఏమీ లేదు… కాకపోతే కమలహాసన్, మణిరత్నం ఎట్సెట్రా తమిళ ప్రైడ్ పనిచేస్తుంది తప్ప పాన్ ఇండియా అంచనాలు చీదేసినట్టే… అందుకే ఇవన్నీ అనేది ప్రచారం…

ఏమిటో… నిజమేనేమో అనిపిస్తోంది… తను విశ్వనాయకుడు కాదు, జస్ట్, ఓ తమిళ నాయకుడే అని తనకుతానే నిరూపించుకుంటున్నాడు… మరి దీంతో వచ్చేదేముంది..? నాన్-తమిళ ప్రేక్షకులకు దూరం అవుతాడు కదానే ఓ సందేహం…

ప్రస్తుతానికి తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పోలరైజ్ చేసుకుని, తమిళ ఆత్మాభిమానాన్ని సొమ్ము చేసుకుని, తరువాత తాపీగా సారీలు గట్రా చెప్పుకుని సర్దుబాటు చేసుకోవచ్చుననే పిచ్చి భ్రమా..? మామూలు పరిస్థితుల్లో వోకే, అది వర్కవుట్ కావచ్చునేమో…

కానీ ఎప్పుడైతే భాషల నడుమ… అదీ రెండు భాషోన్మాద రాష్ట్రాల నడుమ పుల్ల పెట్టాక అది అంత ఈజీగా సమసిపోతుందా..? కావేరి, వీరప్పన్ వంటి ఇష్యూస్‌లో చూశాం కదా, తమిళ- కన్నడ కాన్‌ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో… కన్నడ ఫిలిమ్ చాంబర్ బ్యాన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా తమిళ ఫిలిమ్ చాంబర్‌తో అప్పీల్ చేయించాడు కమల్… సో, పెంట పెంట అయిపోతోంది…

అవునూ, రజినీ బాబాయ్… ఒరిజినల్ కన్నడిగ, తమిళనాడులో మెట్టిన తమరు ఏమీ మాట్లాడినట్టు లేదు..!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions