చిరంజీవి ఇప్పుడేమీ కాకపోవచ్చు… కానీ తను నటుడిగా బాగా బతికిన రోజులనాటి ఒక్క విషయం చెప్పుకోవాలి… 1984 కాలం కావచ్చు… మహానగరంలో మాయగాడు అనే ఓ సినిమా వచ్చింది… తనే హీరో… ఓ ఎపిసోడ్లో ధనం, ధాన్యం, సంతానం, వీరం వంటి అష్టలక్ష్ములున్నా సరే, ధైర్యలక్ష్మి లేకపోతే అందరూ వేస్ట్ అనే ఓ నీతివాక్యం బోధిస్తుంది అది… నిజం… భయం లేకపోవడం, ధైర్యంగా ఉండటం, పోరాడటమే జీవితాన్ని గెలిపిస్తుంది… కరోనా కాలం నేర్పిస్తున్నదీ అదే… నేర్చుకోవాల్సింది కూడా అదే… నిర్భయం, ధైర్యం మనిషిలోని అన్ని వ్యవస్థలనూ యాక్టివ్గా ఉంచుతాయి… అవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి… కరోనాకు శత్రువు రోగనిరోధక శక్తే… మనిషి దేహమే పోరాడాలి… ఆ పోరాటానికి ధైర్యమే ఆక్సిజన్… అంటే, ప్రస్తుతం అన్నీ బాగున్నాయని కాదు… స్వతహాగా ధైర్యాన్ని కోల్పోకూడదు అని… ఒక్కసారి ఈ వార్త చదవండి…
నిజానికి ఇది మీడియాలో బాగా ప్రాధాన్యం దక్కించుకోవాల్సిన వార్త… నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, బోర్గాం గ్రామానికి చెందిన కేసు… ఒక తల్లి, ఒక కొడుకు… కొడుక్కి జ్వరం వంటి కోవిడ్ లక్షణాలు కనిపించినయ్… పరీక్షలకు శాంపిల్ ఇచ్చారు… మొదటిసారి నెగెటివ్… ఇది ర్యాపిడ్ ఫలితం… ఐనా ఇవ్వాళారేపు దేన్ని నమ్మేట్టు లేదు కదా… జ్వరం అలాగే ఉంది, గ్రామస్థుల్లో, కుటుంబసభ్యుల్లో డౌట్… మళ్లీ పరీక్ష అడిగారు… మన పరీక్షల సంగతి తెలుసు కదా… ఇప్పుడు నెగెటివ్ వచ్చినా మళ్లీ గంటలో పరీక్షిస్తే పాజిటివ్ రావచ్చు… ఈలోపు భయం పెరిగింది… ఓ చెట్టు కింద కూర్చున్నారు అమ్మాకొడుకులు… భయం ఆ కొడుకును వదల్లేదు… ఆ గుండె ఆగిపోయింది…
Ads
కొడుకు మరణించాడనే సంగతి తెలిసిన ఆ అమ్మ ఏడుపు హృదయవిదారకం… ఆమె ఈ కరోనా రోజుల్లోనూ పనిచేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలు… ఈలోపు మళ్లీ రిజల్ట్ వచ్చింది… మళ్లీ నెగెటివ్… కానీ ఆ కొడుకు ధైర్యంగా ఉండలేకపోయాడు… భయం మింగేసింది… అరె, కరోనా సోకినవాళ్లలో మరణించేది కేవలం ఒక శాతం… 99 శాతం మంది బతికేస్తున్నారు… కొందరైతే లక్షణాలు కూడా లేకుండా బయటపడుతున్నారు… ఇందరు ఇళ్ల వద్దే కోలుకుంటున్నారు… కొందరు ఏ ప్రయత్నమూ లేకుండానే దులిపేసుకుంటున్నారు… కానీ ఆ కొడుకు భయాన్ని జయించలేక పోయాడు… కారణం, ఎల్లెడలా సాగుతున్న నెగెటివ్ ప్రచారాలు… అవి జనాన్ని కుంగదీస్తున్నయ్… అదే ఈ మరణానికి కారణం… ‘అయిపోయింది, సత్తెనాశ్, గత్తర మింగేస్తోంది… చస్తార్రోయ్’ అన్నట్టుగా సాగే ప్రచారాలదే అసలు బాధ్యత… ‘భయపడకండి’ అనే ఓ మెసేజును మన మీడియా వ్యాప్తి చేయలేదు… చేయదు… ఇదుగో ఫలితం ఇలాగే…
దిక్కుమాలిన పథకాల గురించి, కమీషన్ల కక్కుర్తితో కోట్లకుకోట్లు ఖర్చు పెట్టి మీడియా ప్రకటనలు జారీ చేసే ఉన్నతాధికారులకు బుద్దీ, సిగ్గూ,శరం ఉండవు… వాళ్లెప్పుడూ అంతే… ఈ విపత్తు కాలంలో ఎలాంటి ప్రకటనలు ఇవ్వాలో కూడా తెలియని అసలు కరోనా వైరసులు అవి… జనంలో ధైర్యాన్ని నింపే ప్రకటనలు ఇవ్వండి అని ఝాడించి తన్నేవాళ్లు లేక…! ఒక్కసారి ఈ పాట చూడండి… జనానికి ప్రస్తుతం ఏది అవసరమో తెలుస్తుంది…!!
Share this Article