.
2000 నోట్లను దాదాపుగా ఆర్బీఐ వాపస్ తీసేసుకుంది… ఇంకా కొద్దిగా జనం వద్దే ఉండిపోయాయని అంటోంది గానీ నెగ్టిజిబుల్… పైగా గతంలో 100, 500 నోట్ల రద్దు చేసినట్టుగానే ఈ నోట్ల చెలామణీని కూడా రద్దు చేస్తారని చాన్నాళ్లుగా జనం అనుకుంటున్నదే కాబట్టి పెద్దగా 2000 నోెట్లను తమ దగ్గర ఉంచుకోలేదు…
దాచుకునే ప్రసక్తి అసలే లేదు… జనం వద్ద ఉన్న నోట్లు కూడా దాదాపుగా వెనక్కి వచ్చేసినా సరే, దాని చెలామణీని రద్దు చేయడం లేదని ఆర్బీఐ చెబుతోంది… పేరుకు అలా చెప్పినా అసలు జనం దగ్గర నోట్లే లేనప్పుడు దాని చెలామణీ అమల్లో ఉంటే ఎంత..? లేకపోతే ఎంత…?
Ads
ఇంకా ఎవరి దగ్గరైనా మిగిలి ఉంటే ఎంపిక చేసిన కేంద్రాల్లో మార్చుకోవచ్చుననీ చెబుతోంది… సరే, ఆ 2000 నోటు కథ ముగిసింది… ఆమధ్య చంద్రబాబు ఎక్కడో మాట్లాడుతూ 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలన్నట్టుగా మాట్లాడటంతో… అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి… దాంతో అవినీతి రూపుమాపవచ్చునని తనకు ఎవరు చెప్పారో ఏమిటో మరి…
అసలే తన మీద ఆధారపడ్డ మోడీ సర్కారు… ఏమో, మోడీ ఆ 500 నోట్లనూ రద్దు చేసినా చేస్తాడు అనుకున్నారు జనం… ఈలోపు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు… ఆర్బీఐ పేరిట ఏప్రిల్ తేదీతో ఓ సర్క్యులర్ కూడా జత చేస్తున్నారు… అదేమిటంటే..?
RBI has asked all banks to stop disbursing 500₹ notes by 30 sep from ATM.
Target is 75% of all banks BANKS ATM & then 90% ATM by 31Mar26.
ATM going forward will only disburse only 200₹ and 100₹ notes only
అంటే… ఏటీఎంల ద్వారా ఇక వచ్చే సెప్టెంబరు ఆఖరుకల్లా 500 నోట్లు ఇవ్వకూడదని ఆర్బీఐ అన్ని బ్యాంకులకూ చెప్పేసింది… అప్పటిలోపు 75 శాతం అమలు చేయాలి, ఇక మార్చి 2026 కల్లా 90 శాతం మేరకు 500 నోట్లను ఇవ్వడం ఆగిపోవాలి… 100, 200 రూపాయల నోట్లు మాత్రమే ఏటీఎంలలో ఉంచాలి…
సోషల్ మీడియాను కూడా నమ్మేవాళ్లలో ఓ ఆందోళన… సందేహాలు… కానీ నిజం ఏమిటంటే..?
ఇది పెద్ద ఫేక్ ప్రచారం… సోషల్ మీడియా అంటేనే ఎక్కువ శాతం ఇవే వార్తలు కదా… ఆ ఆర్బీఐ ఆదేశాలు, సర్క్యులర్లు కూడా ఉత్త ఫేక్… ఏవీ నిజం కావు… ఆర్బీఐ అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు… 500 రూపాయల నోట్లకు వచ్చిన ఢోకా ఏమీ లేదు… ఆర్బీఐ వెబ్‌సైట్‌లో కూడా అలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలు ఏమీ లేవు…
ఒకవేళ నిజమే అయితే ఆర్బీఐ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించేది, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా… అంతెందుకు… సాక్షాత్తూ మోడీయే మళ్లీ అప్పట్లోలాగే టీవీ తెరపైకి వచ్చేసేవాడు… సో, ఏ ప్రమాదమూ లేదు…
నిజానికి చాలా బ్యాంకులు ఏటీఎంలలో 100, 200 రూపాయల నోెట్లను పెట్టడం లేదు, దాంతో కస్టమర్లు కేవలం 500 రూపాయల నోట్లనే తీసుకోవల్సి వస్తోంది… అందుకని ఆర్బీఐ 100, 200 రూపాయల నోెట్లను కూడా ఏటీఎంలలో పెట్టాల్సిందే, 30 సెప్టెంబరుకల్లా 75 శాతం, మార్చి 2026 కల్లా 90 శాతం ఈ చిన్న నోట్లకు కూడా ఏటీఎంలలో స్థానం కల్పించాలని ఆదేశించింది… అదీ సంగతి…
Share this Article