‘‘ప్రకాష్ షా… దేశాన్ని శాసించే ముఖేష్ అంబానీ బాల్యమిత్రుడు, తన కంపెనీ వైస్ ప్రెసిడెంట్, తన కుడిభుజం… జీతం ఏటా 70 కోట్లు… వయస్సు డెబ్భయ్ దాటి… మొన్న 25వ తేదీన ఈ భౌతిక సుఖాలు, హోదాలు గట్రా అన్నీ వదిలేశాడు… అకస్మాత్తుగా సన్యాసదీక్ష స్వీకరించాడు… ఇప్పుడాయన పేరు నూతన్ మునిరాజ్… ఇక తన బాట నిర్వాణపథమే… మహాప్రస్థానమే…….’’ ఇంట్రస్టింగుగా ఉంది కదా… ఈ ట్వీట్ ఓ జాతీయవాది ట్వీట్లో కనిపించింది… కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు, వ్యాఖ్యానించలేదు… ఎందుకంటే..? తనది జైన కుటుంబం… గృహస్థాశ్రమంలో ఎంత యాక్టివ్గా ఉంటారో, ఓ వయస్సొచ్చాక ఇక అన్నీ వదిలేస్తారు, సన్యాసం స్వీకరిస్తారు… తమ దేహాల్ని విముక్తిపథంలోకి మళ్లిస్తారు… తమ ఆలోచనలన్నీ కట్టడి చేసుకుంటారు… అసలు వృద్ధాప్యంలోనే కాదు, చిన్న పిల్లలు, యవ్వనంలో ఉన్నవాళ్లు కూడా దీక్ష తీసుకోవడం ఆ సమాజంలో సహజమే కాబట్టి…
సుఖాల్ని, హోదాల్ని, సంపాదన కాంక్షను జయించడం సాధ్యమేనా..? సాధ్యమే… వాళ్లు అవన్నీ పరిత్యజిస్తారు… ఉపవాస దీక్షలు కామన్, పూర్తి శాఖాహారం… దేహాన్ని క్రమేపీ నిర్వాణం వైపు తీసుకుపోతారు… తమంతటతాము స్వచ్ఛందంగా సన్యాసం స్వీకరిస్తారు కాబట్టి దీక్ష విషయంలో నిజాయితీగా ఉంటారు… ప్రచారం కోరుకోరు… అందుకే ఈ వార్త ఎక్కడా కనిపించలేదు… ఈ ఒక్క ఫోటో, అదీ ఒకాయన ట్వీట్ చేశాడు కాబట్టి… ఇది ఫేకా..? రియలా..? అనే ఆసక్తిని కూడా మీడియా కనబర్చలేదు… అయితే ఏటా 70 కోట్ల వేతనం, అంబానీ కుడిభుజం, బాల్యమిత్రుడు అనే అంశాల్ని మాత్రం ఆయన కుటుంబం ఖండించినట్టుగా ఓ కామెంట్ కనిపించింది…
Ads
‘‘సోషల్ మీడియాలో వస్తున్నట్టు 70, 75 కోట్ల వేతనం అనేది అబద్ధం… కోట్లు కాదు, కేవలం లక్షలే.. అంబానీకి బాల్యమిత్రుడు, కుడిభుజం వంటి పదాలు కూడా సరైనవి కావు… ప్రకాష్ భాయ్ షా, ఆయన సతీమణి నయనాబెన్ ఇద్దరూ గచ్చిధిపతి పండిత్ మహారాజ్ సమక్షంలో 25వ తేదీన, మహావీరుడి జన్మకల్యాణ దినాన దీక్ష స్వీకరించారు’’ అని ఆ కుటుంబం తరఫున కనిపించిన ఓ ఖండన… బాగుంది… అంతకుమించి ఒక్క పదం ఎక్కువ లేదు, తక్కువ లేదు… దీక్షాగ్రహణం గురించి వాళ్లు చెప్పుకోవడమే చాలా అరుదు… ఒకసారి దీక్ష తీసుకున్నారంటే ఇక ఈ ప్రచారాలకు దూరంగా ఉంటారు… ఆధ్యాత్మిక మార్గమే… మరెందుకు ఈయన దీక్ష బిజినెస్ సర్కిళ్లలో ఆసక్తిని రేపిందీ అంటే… మొన్నటిదాకా ఆయన నిర్వర్తించిన ఉద్యోగం అలాంటిది… ముఖేష్ అంబానీ వారి రిలయెన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పోస్టు అంటే మాటలా..? తెల్లారిలేస్తే వందలు, వేల కోట్ల వ్యవహారాలతో డీలింగ్ కదా… సో, ఆయన హఠాత్తుగా అన్నీ వదిలేసి, మోక్షమార్గంలోకి మళ్లడం సహజంగానే ఓ చర్చకు దారితీసింది… అదీ సంగతి…!!
Share this Article