Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తుడరుమ్ సరే… సినిమాను మించి జార్జ్ పాత్ర హైలైట్ అవుతోంది…

June 11, 2025 by M S R

.

ఆల్రెడీ పాత్రల్లో జీవించే నటులు, అప్పటికే ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా చలామణి అవుతున్నవారి సినిమాల్లో.. అప్పుడే అరంగేట్రం చేసేవారు ఒకింత ఆందోళనతో కూడిన భయానికి గురవుతారు. కానీ, అరంగేట్రంలోనే.. టాప్ మోస్ట్ నటులను పూర్తిగా మరిపించేలా నటించడమంటే…?

ఈ మధ్య వచ్చిన తుడరుమ్ సినిమా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్రైమ్ థ్రిల్లర్ గా జియో హాట్ స్టార్ లో ఉన్న ఈ సినిమాలో.. చాలామందికి తెలిసిన ప్రధాన పాత్రధారులు మోహన్ లాల్, శోభన మాత్రమే.

Ads

కానీ, వారిని మించి మొదటి సినిమాతోనే అదరగొట్టాడు ప్రకాష్ వర్మ. కన్నింగ్, క్రూయెల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా ప్రకాష్ వర్మ పోషించిన పాత్ర తుడరుమ్ లో వెరీ వెరీ స్పెషల్. మరి ఇంతకీ ఆ ప్రకాష్ వర్మ ఎవరసలు..?

భారతీయ సంప్రదాయ వర్ణచిత్రాలకు పెట్టింది పేరైన రాజా రవివర్మ వంశస్థుడు ప్రకాష్ వర్మ. ఈయనో యాడ్ మేకర్. వెంటనే ఆయన గుర్తు రావాలంటే జుజు యాడ్ తో అలరించిన వోడాఫోన్ అడ్వర్డైజ్ మెంట్ పాత జ్ఞాపకాల్లోకోసారి వెళ్లిరావాలి. ఆ జుజుతో సంచలనం సృష్టించిన ప్రొఫెషనల్ యాడ్ మేకర్ ప్రకాష్ వర్మ.

తుడరుమ్ కూడా జస్ట్ లైక్ మరో దృశ్యం సినిమాలాంటిదే అయినా.. థ్రిల్లింగ్ మిస్ కాకుండా వీక్షకుణ్ని హైర్ చేయడంలో చాలామంది మళయాళీల రచయితలు, దర్శకులది నిజంగా అందెవేసిన చేయని మరోసారి నిరూపించేది.

భారీ సెట్టింగ్స్, అనవసరమైన హంగూ ఆర్భాటాలేవీ లేకుండా.. సర్వసాధారణమైన కథలు.. మన ఇంటి పక్కనే ఊహించనివి జరిగితే ఎలా ఉంటాయి.. సామాన్యుడెలా ఫీలవుతాడు.. తమ ప్రమేయం లేకుండానే సుడిగాలుల నడిసంద్రంలో చిక్కుకుంటే ఎలా ఫేస్ చేస్తాడో.. ఎలాంటి గందరగోళం లేకుండా, చక్కగా, చాలా స్పష్టంగా చెప్పగల్గడం తమ గొప్పదనమని మరోసారి మళయాళీలు నిరూపించారు. అలాంటిదే తరుణ్ మూర్తి అనే దర్శకుడు తెరకెక్కించిన తుడరుమ్.

చాలా రొటీన్, ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన పాత్రల వంటిదే అయినా… తుడరుమ్ లో ప్రకాష్ వర్మ ఆ పాత్రను పోషించిన తీరే ఇప్పుడాయన పేరు బాగా హైలెటవ్వడానికి కారణం. షారూక్ ఖాన్, దీపికా పదుకునే, అనుష్కశర్మ వంటి స్టార్స్ తో పనిచేసిన యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాష్ వర్మ. వోడాఫోన్ జుజు ఐకానిక్ వాణిజ్య ప్రకటన వెనుకున్న సృజనకారుడు

ప్రకాష్ వర్మ ఎవరు..?

ప్రకాష్ వర్మ తన భార్య స్నేహ ఐపేతో కలిసి 2001లో నిర్వాణ ఫిల్మ్స్‌ అనే సంస్థను ప్రారంభించారు. మలయాళీ అయిన ప్రకాష్ వర్మ.. బెంగళూర్ వేదికగా తన యాడ్ ఫిలిం మేకింగ్ సంస్థకు శ్రీకారం చుట్టాడు. అంతకుముందు తను మలయాళ ఫిలిం మేకర్ వీ.పీ.తంపి, యాడ్ ఫిలిం మేకర్ వీ.కే.వర్మతో కలిసి పనిచేశారు.

ప్రకాష్ 24 ఏళ్ల యాడ్ ఫిలిం మేకింగ్ కెరీర్ లో… బిస్లరీ, కిట్‌క్యాట్, ఐఫోన్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, వోడాఫోన్ వంటి ఎన్నో అగ్రస్థాయి బ్రాండ్‌లకు ప్రకటనలను రూపకల్పన చేశారు. కేరళ బేస్డ్ గా ఎక్కువ ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రకాష్ వర్మకు ఆ తర్వాత దుబాయ్ కి చెందిన వాణిజ్య ప్రకటనల్లోనూ అవకాశం లభించింది.

ముఖ్యంగా కేరళ, దుబాయ్ కి సంబంధించిన పర్యాటకాన్ని ఎలివేట్ చేసే అందమైన వాణిజ్య ప్రకటనలతో ప్రకాష్ వర్మ పేరు యాడ్ ఫిలిమ్ మేకర్ గా మార్మోగింది. అలా 2009లో మైకేల్ బే అనే ప్రముఖ యాడ్ ఫిలిం మేకింగ్ సంస్థ దృష్టినాకర్షించారు ప్రకాష్. అదిగో ఆ సమయంలోనే వారి ప్రకటనలకు పనిచేస్తున్న క్రమంలో ప్రకాష్ వర్మ.. షారుఖ్, అనుష్క, దీపిక వంటివారితో కలిసి పనిచేశారాయన.

 

నిర్వాణ ఫిల్మ్స్  వెబ్ సైట్ లో ఉన్న సమాచారం ప్రకారం ప్రకాష్ వర్మ ఏదైనా ప్రకటన రూపొందించే క్రమంలో రాసిన స్క్రిప్ట్ ను తాను స్వయంగా చదవడం కంటే.. ఎవరైతే రచయిత ఉన్నారో వారేమనుకుంటున్నారో దాన్ని వారు వివరించి, విశ్లేషిస్తుంటే వినడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సరళంగా జనానికి అర్థమయ్యేలా చెప్పడం.. యాడ్స్ లో నటిస్తున్నవారిలో సహజసిద్ధమైన నటనను వెలికితీయడం, మైన్యూట్ డీటెయిల్స్ పైనా దృష్టి పెట్టి నైపుణ్యంతో మేకింగ్ చేయడం వంటివాటిపైన ప్రకాష్ వర్మ విశ్రాంతి లేకుండా పనిచేస్తారనేది యాడ్ ఫిలిం ఇండస్ట్రీలో వినిపించే టాక్.

తుడరుమ్‌లో మరి ప్రకాష్ వర్మ పాత్రేంటి..?

తుడరుమ్ లో సీఐ జార్జ్ మాథన్ గా నటించాడు ప్రకాష్ వర్మ. ప్రారంభంలో స్టేషన్ లో ఉన్న ఎస్సైని క్రూరుడిగా… ఆయన్నుంచి తప్పించుకునేందుకు కలిసే సీఐ జార్జ్ మంచివాడిలా కనిపిస్తాడు. కానీ, రాను రాను మంచిగా నటిస్తూనే భిన్నమైన షేడ్స్ ను ప్రదర్శించే ఒకింత సైకో పాథ్ పాత్రలో సీఐ జార్జ్ ఆ సామాన్యుల కథలో లీనమైపోయిన సామాన్యులను భయపెడతాడు.

ఇక సినిమా ముగిసే సమయం దగ్గర పడుతున్నకొద్దీ.. తానెంత కోల్డ్ బ్లడెడ్, క్రూరమైన దుర్మార్గుడో తెలియజెప్పుతూ.. స్క్రీన్ ముందు కూర్చున్న వీక్షకుడికి కూడా ఆ సీఐని అస్సలు వదిలిపెట్టకూడదనేలా ప్రకాష్ వర్మ యాక్టింగ్ తుడరమ్ సినిమాకే ఎస్సెట్. తమ కుటుంబ జీవితంలోకొచ్చిన యువకుణ్ని చంపేయడమే కాదు.. యాక్టింగ్ తోనూ చంపేశాడు ప్రకాష్ వర్మ.

ఓ యాడ్ డైరెక్టరైన ప్రకాష్ వర్మలోనూ ఓ అద్భుతమైన నటుడున్నాడు. అందుకే, తన యాడ్స్ రూపకల్పనలో నటీనటుల నుంచి ది బెస్ట్ తీసుకోవడం.. అతడికి తెలుసు. కానీ, తానే నటుడిగా చేస్తాననుకున్నాడో, లేదోగానీ.. దర్శకుడు తరుణ్ మూర్తి ఛాయిస్ మాత్రం వందశాతం కరెక్ట్ అనిపించేలా నటించేసి.. సారీ, జీవించేసి.. తనకు అవకాశం దక్కినందుకు.. తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించే క్రమంలో విశ్వరూపం చూపించాడు.

ప్రకాష్ వర్మ పాత్రపైన సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్ స్టాలోనైతే ప్రకాష్ వర్మ ఇప్పుడో ట్రెండింగ్ యాక్టర్. ఆ సినిమా చూశాక ఆ క్యారెక్టర్ ను ఎంత ద్వేషించామో చెబుతూ నెటిజన్స్ చేస్తున్న పోస్ట్స్ చూస్తుంటే.. ఒక నెగటివ్ షేడ్ పాత్రకు ప్రకాష్ వర్మ ఎంత న్యాయం చేశాడో అర్థమవుతుంది. అదీ తుడరుమ్ లో మోహన్ లాల్, శోభన ఇద్దరు అగ్రనటీనటులను మంచి అరంగేట్రంలోనే అదరగొట్టడంతో ప్రకాష్ వర్మ ఇప్పుడో ట్రెండింగ్ స్టార్ గా మారిపోయాడు…… ( రమణ కొంటికర్ల )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం నాగార్జున..! బిగ్‌బాస్ లాంచింగ్ షో రేటింగుల్లో బిగ్గర్ ఫ్లాప్..!!
  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions