…………. Jagannadh Goud………………. మూడవ భాగం: కరోనా ప్రశ్నలు – సమాధానాలు
51. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం ఎలా.?
• మంచి పోషకాహారం తీసుకోవాలి. కొన్ని రోజులు డి విటమిన్, సి విటమిన్, జింక్ మరియూ B12 సప్లిమెంటల్ టాబ్లెట్స్ వాడటం మంచిది.
• అవకాశం ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి.
• తగినంత విశ్రాంతి, నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం.
• బయటికి వెళ్ళినప్పుడు డబల్ మాస్క్ (లోపల సర్జికల్ మాస్క్, బయట క్లాత్ మాస్క్) మరియూ బయటి వస్తువుని తాకినప్పుడు చేతులని శుభ్రం చేసుకోవాలి.
• ప్రభుత్వ గైడ్ లైన్స్ ని పాటించాలి.
52. ఈ మధ్య యువకులకు కూడా వస్తుంది, గతంలో ముసలి వారికి మాత్రమే వస్తుంది అన్నారు..?
– అలా అన్న వాడి పండ్లు రాలగొట్టి ఫైన్ కట్టండి.
53. అసలు యువకులకి ఎందుకు వస్తుంది?
– కరోనాకి వయస్సుతో సంబంధం లేదు. ఎవరు దాన్ని ముట్టుకుంటే వాళ్ళకి వస్తుంది. కరోనా స్వతహాగా కదలదు, మెదలదు. దాన్ని ఎవరు టచ్ చేస్తే వారికి అంటుకుంటుంది. ఇప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముదుసలి వరకు ఎవరికైనా వస్తుంది.
వయస్సు, ప్రాంతం, స్త్రీ, పురుషులు అనే దానితో సంబంధం లేకుండా దాన్ని ముట్టుకున్న ప్రతివారికీ అది అంటుకుంటుంది, ఎవరిలో అయితే యాంటీ బాడీస్ తక్కువ ఉంటే వారిలో పెరుగుతుంది, ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చినా వెంటనే తగ్గిపోతుంది.
54. సో, యాంటీ బాడీస్ కీలకం అంటారు. వాటిని పెంచుకోవటం ఎలా..?
– స్వభావ సిద్దంగానే ప్రతి ఒక్కరిలో ఐదు రకాల యాంటీ బాడీస్ IgA, IgE, IgD, IgG, IgM అనేవి ఉంటై. ఒకొకరి హెల్థ్ ప్రొఫైల్స్ ని బట్టి వాటి సంఖ్య ఉంటుంది. సాధారణ యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకొని తక్కువ ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
(పిక్ రైటప్: మన శరీరం లో ఉండే ఐదు ప్రధాన రకాలైన యాంటీ బాడీలు IgA, IgE, IgD, IgG, IgM)
55. పెంచుకోవటం ఎలా అనేది చెప్పలేదు..?
– వ్యాక్సిన్ తీసుకోవటం ఒక మార్గం. ఇంకా విటమిన్ డి, విటమిన్ సి, జింక్ టాబ్లెట్స్ వాడితే యాంటీ బాడీస్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఇదొక్కటే అని కాదు స్ట్రెస్ లేకుండా ఉండి తగిన పోషకాహారం తీసుకోవటం వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
56. RT-PCR టెస్ట్ కూడా కరక్ట్ చూపించటం లేదు 70-80 % మాత్రమే దాన్ని నమ్మొచ్చు అంటున్నారు..?
– RTPCR టెస్ట్ చాలా జాగ్రత్తగా చేయాలి. నేను చదువుకునే రోజుల్లో చేసినప్పుడు కూడా చాలాసార్లు రాంగ్ వచ్చేది. రకరకాల కారణాలు ఉన్నై. శాంపిల్ కరక్ట్ గా తీసుకోవటం, దాన్ని సరైన పద్ధతిలో వాడటం, ఇంకా ఆ టెస్ట్ లో ప్రైమర్లని కరక్ట్ గా వాడటం, అవి కరక్ట్ ప్రైమర్లు అయ్యి ఉండటం… ఇలా చాలా ఉన్నై టెక్నికల్ గా మాట్లాడుకుంటే. అయితే ప్రస్తుతానికి RTPCR నే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, కరోనాకి దానికి మించిన టెస్ట్ లేదు.
57. RTPCR లో నెగటివ్ వచ్చి CT స్కాన్ లో పాజిటివ్ వచ్చింది అంటున్నారు?
– నిజానికి CT స్కాన్ లో కరోనా పాజిటివ్ లేదా కరోనా నెగటివ్ అని ఉండదు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఎంత ఉంది, ఏయే మార్పులు జరిగాయి, వైరస్ తీవ్రత ఎంత ఉంది ఇత్యాది అంశాలు తెలుస్తాయి.
58. కోవిడ్ పాజిటివ్ రాగానే స్వతహాగా CT స్కాన్ చేపించుకోవటం బెస్టా..?
– ఒక CT స్కాన్ చేపించుకుంటే 50-500 ఎక్స్ రే లతో సమానం. అంత రేడియేషన్ లోపలికి వెళుతున్నట్లు, సొంత పెత్తనం పనికి రాదు.
RT PCR పాజిటివ్ వచ్చి ఆక్సీజన్ లెవల్స్ బాగా పడిపోతే డాక్టర్స్ నే CT స్కాన్ చేసుకోమని సలహా ఇచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా చేపించుకోవాలి. లేదా RTPCR లో నెగటివ్ వచ్చి జ్వరం తగ్గకుండా ఆక్సీజన్ లెవల్స్ 93 కంటే తక్కువ ఉన్నప్పుడు CT స్కాన్ అవసరం అవుతుంది.
59. పూర్తిగా తగ్గాక CT స్కాన్ చేపించుకోవచ్చా, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో తెలుసుకోటానికి..?
– ముందే చెప్పినట్లు అత్యవసరం అయితేనే చేపించుకోవాలి CT స్కాన్, ఒక CT స్కాన్ వలన చాలా రేడియేషన్ లోపలికి వెళుతుంది . డాక్టర్స్ సలాహా మేరకు మాత్రమే చేపించుకోవటం ఉత్తమం.
60. ఇంతగా కేసులు పెరగటానికి కారణం ఏమి అయ్యి ఉంటుంది అని మీ అభిప్రాయం?
– ప్రజల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, వైరస్ మ్యుటేషన్స్ మొదలగునవి.
– జగన్ (సామాన్యుడు) వ్యక్తిగత అభిప్రాయం
Share this Article