Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నలంద, తక్షశిల వదిలేయండి… ఇప్పుడు ఎక్కడున్నాం మనం..?!

June 12, 2025 by M S R

.

Jagannadh Goud…… అన్నా, మన IIT లు ప్రెపంచకంలో చాలా టాప్ కదా..? అది సరే… కానీ ఎవరన్నారు..? మాకు పాలు పోసే పుల్లయ్య అంటే విన్నాను… అంతేనా, ఇంకా ఎవరూ అనలేదా..? కూరగాయలు అమ్మే సుబ్బారావు, యూట్యూబ్ లో కన్నమ్మ, జాకబ్, యూసఫ్, సమీర్ శర్మ ఇలా చాలా మంది చెప్పారు…. అంతేనా, ఇంకా ఎవరూ చెప్పలేదా..? ఎందుకు చెప్పలేదు, చాలా మంది సినిమా వాళ్ళు, క్రికెటర్స్ ఇంకా పేరు గాంచిన రాజకీయ నాయకులు కూడా చెప్తూ ఉంటే విన్నాను…

సరే, అవి అన్నీ పక్కన పెట్టి – గూగుల్ లో ప్రపంచంలో ఉన్న టాప్ 50 యూనివర్శిటీలు అని వెతుకు, IIT లే కాదు, మన దేశం నుంచి ఒక్క యూనివర్శిటీ ఉండదు. 100 లోపు ఏవీ ఉండవు, 200 లోపు ఏమీ ఉండవు, 300 లోపు మన దేశం నుంచి ఏమీ ఉండవు, 400 లోపు ఒక్కటీ ఉండదు.., చివరికి ప్రపంచం మొత్తంలో 500 లోపు కూడా మన దేశం నుంచి ఒక్క యూనివర్శిటీ ఉండదు. US NEWS ప్రకారం కానీ, ఇంకా ఏ పేరు గాంచిన సంస్థ ప్రకారం కూడా ఒక్కటీ కనిపించదు…

Ads

మనమేమో చైనా చదువులు అని, చైనా వస్తువులు అని చీప్ గా మాట్లాడతాం కానీ ప్రపంచంలో టాప్ 20 యూనివర్శిటీల్లో చైనా నుంచి 2 విశ్వవిద్యాలయాలు ఉన్నై..; ఒకటి పెకింగ్ యూనివర్శిటీ, రెండు సింగువా విశ్వవిద్యాలయం… ఇంకొన్ని రోజుల్లో పెకింగ్ యూనివర్శిటీ హార్వర్డ్, MIT తలదన్ని మొదటి స్థానంలోకి కూడా రావొచ్చు, ఇప్పటికే చాలా విభాగాల్లో హార్వర్డ్, MIT, స్టాన్ ఫర్డ్ కూడా పనికి రావు పెకింగ్ ముందు. హార్వర్డ్ కెమిస్ట్రీ హెడ్ కూడా రిజైన్ చేసి చైనా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు.

ప్రపంచంలో టాప్ 20 లోపు రెండు చైనా యూనివర్శిటీలు ఉన్నై, 100 లోపు, 200 లోపు, 300 లోపు, 400 లోపు, 500 లోపు చాలా చైనా యూనివర్శిటీలు ఉన్నై, కానీ మన దేశం నుంచి ఒక్క యూనివర్శిటీ లేదు. కారణం ఏమిటి..?

అదేంటి అన్నా… అలా మాట్లాడుతున్నవ్..? IIT లో చదివిన మన సుందర్ పిచ్చయ్యనే కదా గూగుల్ CEO, ఇంకా మన నాదేళ్ళ సత్తయ్యనే కదా మైక్రోసాఫ్ట్ CEO …

అరే చిన్నా.., సుందర్ పిచ్చయ్య IIT లో చదివిన మాట నిజమే కానీ అమెరికా వెళ్ళి ప్రపంచంలో నంబర్ వన్ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశాడు.., ఇంకా ప్రపంచంలో నంబర్ వన్ బిజినెస్ స్కూల్ వార్టన్ లో MBA చేశాడు… అందుకే గూగుల్ CEO అయ్యాడు…

నాదెళ్ళ సత్య విషయానికి వస్తే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో B.Tech చేసి ఆ తర్వాత అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సన్ లో మాస్టర్స్ చేసి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో MBA చేశాడు, అందుకే మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడు…

ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే గొప్ప. కానీ, బావిలో కప్పల్లా ఇంకా ఆముదపు చెట్టే మహా వృక్షం అనుకుంటే పొరపాటు అవుతుంది. ఒకప్పుడు అంటే IIT ల్లోనే ప్రాజెక్ట్ వర్క్ ఉండేది, ఇప్పుడు కొండాపూర్ లో ఉండే స్కూళ్లలోనే ప్రాజెక్ట్ వర్క్స్ చేపిస్తున్నారు, రోజురోజుకీ ప్రపంచం చాలా మారుతుంది…

వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని కాకుండా ఎవరికి వారు, తర్కం అలవాటు చేసుకోవాలి, Explore చెయ్యాలి. ఒకరు ఎక్కువ, మనం తక్కువ అని చెప్పటం నా ఉద్దేశం కాదు. మన దగ్గర ఉన్న యువత దగ్గర అపారమైన నైపుణ్యం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. కనీసం పటిష్టమైన యూనివర్శిటీలనయినా తయారు చేసుకోలేమా..?

ఇంకా వందల, వేల సంవత్సరాల క్రితం మన నలంద, మన తక్షశిల ఉండేవంటూ… మేం అప్పట్లోనే నంబర్ వన్ అంటూ కూర్చుంటే ఎలా..? అవును, అప్పుడు అవే నంబర్ వన్, కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం..? ఎందుకు రోజురోజుకీ దిగజారి పోతున్నాం..? అప్పట్లో నంబర్ వన్ ఉండి, ఇప్పుడు ఎందుకు కనీసం 500 లోపు కూడా మన యూనివర్శిటీ ఒక్కటీ లేదు..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!
  • ఆ ఉగ్రవాది కసబ్‌ను కోర్టులో గుర్తించిన ఓ చిన్న పాప మీకు గుర్తుందా..?
  • అవునూ.., హీరో మెటీరియల్ ఏంటి తల్లీ..? ఈ చెత్తా ప్రశ్నలే జర్నలిజమా..?!
  • రిషబ్‌ శెట్టి ‘కాంతార’ మ్యాన్షన్… కళాత్మకత, సంస్కృతి, భద్రత మేళవింపు…
  • చావు దాకా తోడుగా, తోడ్పాటుగా వెన్నంటి… A True Love Story…
  • “యుద్ధం తానే, శాంతి తానే — జరగని యుద్ధాలనూ ఆపాడట..!!
  • మరేటి సేస్తాం అలగైపోయినాది… సొంత ‘నోబుల్’ అవార్డులే ఇక దిక్కు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions