Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మచ్చ కడగబడలేదు సర్… ఈరోజుకూ సారీ కోరుతోంది తెలుగు మహిళ…

June 18, 2025 by M S R

.

“నా గురించి బాగా తెలిసిన మిత్రులు కూడా నేను జైలుకు వెళ్ళాక ఇష్టం వచ్చినట్లు రాసేసారు! ఇదేనా స్నేహం అంటే? ఆశ్చరం అనిపిస్తోంది!

నా జీవిత చరమాంకం లో ఇలాంటి మచ్చ మిగిలిపోతుందేమో అనుకున్న! నాకు పునర్జన్మ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు! ఊపిరి పోయడం చాలా కష్టం. ఊపిరి తీయడం చాలా సులభం. నాకు ఊపిరి పోసి బయట పడేసిన వారిద్దరికీ కృతజ్ఞతలు.

Ads

నాపై చాలామంది నమ్మకం ఉంచారు. సపోర్ట్ చేశారు. కొందరు నమ్మలేదు. వారి విజ్ఞతకే వదిలేస్తున్న! నా గురించి బాగా తెలిసిన చంద్రబాబు గారు కూడా నన్ను వాడు వీడు అన్నారట!

నేను సుప్రీం కోర్టుకు వెళ్లేంత ఏం సంపాదించలేదు. నేను మధ్య తరగతికి ఇంకా కిందే వున్నాను. నేను లేకున్నా నా పేరిట KSR షో నిర్వహించారు. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు”…

…… ఇవీ అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్టయి, బెయిల్ మీద బయటిక వచ్చిన టీవీ మోడరేటర్ కొమ్మినేని శ్రీనివాసరావు సాక్షి tv నుంచి ఇచ్చిన వివరణలో ఒకటీరెండు పాయింట్లు….

రెండుసార్లు ఉద్వేగానికి గురై కంట తడి పెట్టాడు… గద్గద స్వరంతో వినిపించాడు తన ఆవేదనను..! ఊహించని చేదు పరిణామాలు కాబట్టి ఆ ఉద్విగ్నత మానవసహజమే… పైగా 70 ఏళ్ల వయస్సులో….

kommineni

  • తమ క్యాంపులో, తమ వెంట ఉండే వ్యక్తులను జగన్ ఎంత ఖర్చయినా ప్రొటెక్ట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు, ఆ వ్యక్తుల్లో తప్పున్నా సరే, తప్పనిసరై అండగా ఉంటాడు… అది తన ధర్మంగా భావిస్తాడు…
  • దీనికి పూర్తి కౌంటర్ చంద్రబాబు… ఇక అవసరం లేదు అనుకున్నాక జస్ట్, వదిలేస్తాడు… ఎదుటి క్యాంపులో ఉన్నవారి మీద బయటపడడు గానీ కోపం కడుపులో రగులుతూనే ఉంటుంది… పైగా ఇన్నాళ్లూ తమ మనిషి అనుకున్నవాళ్లు ప్రత్యర్థుల క్యాంపులో చేరితే చంద్రబాబుకే కాదు, ఎవరికైనా ఆ మంట సహజం…
  • జగన్ వేరు, చంద్రబాబు వేరు…
  • కొమ్మినేని ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడు… లోకేష్ కారణంగా ఎన్టీవీలో కొలువు పోయి, ప్రత్యర్థి క్యాంపులో చేరాడు… ఐనా సరే, కొమ్మినేని ఆరోపిస్తున్నట్టు వాడు వీడు అని సంబోధించాడని మాత్రం అనుకోను… తన భాష కాదు అది…

కొమ్మినేని

సుప్రీంకోర్టు వాదనల ఖర్చు భరించడంపై మరీ ఊపిరి పోయడం వంటి పదాలు కొంచెం అతి అనిపించింది… జగన్‌కు ఆ ఖర్చు జుజుబీ… అంతేకాదు, కేఎస్ఆర్ షో అని తన పేరిటే షో కొనసాగించడం కూడా టీవీ, వైసీపీ క్యాంపు స్ట్రాటజీ… అందులో ప్రత్యేక గౌరవం ఏమీ లేదు…

నా గురించి తెలిసినవాళ్లు కూడా ఏదేదో రాసేసార్ అంటున్నాడు కొమ్మినేని… ఇక్కడ నాకు అర్థమైంది… అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసు రెండు పార్టీల నడుమ సాగుతున్న ఓ నీచమైన, జుగుప్సాకరమైన పోరాటం.., కొమ్మినేని దురదృష్టం కొద్దీ తను అందులో ప్రధాన భాగస్వామి అయ్యాడు… పోనీ, ఇరుక్కున్నాడు… ఇంత రాద్దాంతం జరుగుతుందని అనుకుని ఉండడు, కానీ ఏపీ రాజకీయాల స్థాయి అది, ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్తుంది…

కొమ్మినేని

అందుకని జర్నలిస్టులు ఈ విషయంలో తనను ఓన్ చేసుకోలేదు, బట్… సపోర్ట్ చేయకపోవచ్చుగాక, కానీ తన గురించి తెలిసిన, పరిచయమున్న సీనియర్ న్యూట్రల్ జర్నలిస్టులు ఎవరూ తనను నిందించినట్టు మాత్రం నాకు కనిపించలేదు... అంటే అభ్యంతకరరమైన భాషలో... కొందరు సైలెంటుగా ఉన్నారు... సింపుల్, టీడీపీ జర్నలిస్టులు వ్యతిరేకించవచ్చు, ఏపీ జర్నలిస్టు సంఘాలకూ పార్టీల రాగద్వేషాలున్నాయి కదా… వాళ్లూ ఓన్ చేసుకోలేదు…

ఎస్, వేరే విషయంలో అయితే ఖచ్చితంగా కొమ్మినేనికి జర్నలిస్టు సమాజం నుంచి మంచి బలమైన మద్దతు లభించేది… మరొకటి, మచ్చ అలాగే మిగిలిపోతుందేమో అనుకున్నాను అనే వ్యాఖ్య, ముక్తాయింపు కూడా కరెక్టు కాదు… ప్రస్తుతం బెయిల్ మాత్రమే వచ్చింది… కేసు అలాగే ఉంది, కాకపోతే సుప్రీం వ్యాఖ్యల వల్ల ఇక ఆ కేసులో పెద్ద సీరియస్‌నెస్ ఉండకపోవచ్చు… కానీ ఎక్కడ దొరుకుతాడా అనే టీడీపీ కూటమి ప్రభుత్వం కన్ను ఇప్పటికీ కొనసాగుతుంది… అది రియాలిటీ…

కొమ్మినేని

అసలు మచ్చ ఏమిటంటే..? ‘‘ఆ గెస్టు చేసిన వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు, బాగాలేవు, మోడరేటర్‌గా నాకూ నచ్చలేదు, సారీ’’ అనే ఒక్క మాట అని ఉంటే హుందాగా ఉండేది… కొమ్మినేనికి నిజంగానే మంచి పేరు వచ్చేది… కానీ ఏపీ రాజకీయ పోరాటం ఆ మాట అననివ్వలేదేమో… సో, మచ్చ పోలేదు సర్…

కళ్లల్లో సుడులు తిరిగే కన్నీళ్లు, దగ్గుత్తికతో మాటలు… సానుభూతిని రాల్చదు… సింపుల్, ఇన్నేళ్ల (70 ఏళ్ల వయస్సు కదా) కెరీర్, పెద్ద పెద్ద జర్నలిస్టులకే దక్కనంత సుదీర్ఘమైన కెరీర్ కాబట్టి, జాగ్రత్తగా నిర్మించుకున్న కెరీర్ కాబట్టి… అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినడం పట్ల చింతిస్తున్నాను అనే ఒక్క అని ఉంటే… ఇక వేయి మాటలు అక్కర్లేదు… అది కనిపించలేదు తన వివరణలో…

కొమ్మినేని

పైగా వివరణలో నా షోలో అన్నీ నిజాలే ఉంటాయనడం కూడా కరెక్టు కాదు… సాక్షిలో వచ్చిన ఈ యాడ్ చూడండి… కడిగిన ముత్యం అంటోంది… నిఖార్సైన జర్నలిజం అంటోంది… ఇంకా ముత్యం కడగబడలేదు సర్… మచ్చ ఇంకా కడగబడాల్సి ఉంది… అంతేకాదు, పార్టీ జర్నలిజం నిఖార్సైన జర్నలిజం కూడా కాదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
  • ఎఐసీసీ మంత్రి పదవిని ప్రామిస్ చేస్తే… రేవంత్ రెడ్డిని ఎందుకు అడగడం..!?
  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
  • సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!
  • ట్రావెల్ థెరపీ… సరదాగా చెప్పుకున్నా నిజముంది, ఫలముంది…
  • మోడీ దర్శించిన ఆ హిస్టారిక్ టెంపుల్ కథాకమామిషు ఏమిటంటే..!!
  • జయహో టెస్టు మ్యాచ్ సీరీస్… వన్డేలు, టీ20లకు దీటుగా ప్రేక్షకాదరణ…
  • Ramayana… a story for English readers and civil trainees..!!
  • ఢిల్లీలో ఫైట్‌కు రేవంత్ రెడీ..! కుదరదంటున్న బండి సంజయ్..!!
  • ఫేక్ జర్నలిస్టులపై మరి ప్రభుత్వ తక్షణ బాధ్యత ఏమీ లేదా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions