ముందుగా ఆంధ్రజ్యోతిని ఒక విషయంలో ప్రశంసించాలి… తన ఎడిటోరియల్ లైన్, తన పొలిటికల్ ఫేవరిటిజం ఎలా ఉన్నా సంపాదకీయ పేజీని మాత్రం ‘తటస్థంగా’ ఉంచుతుంది… వీలైనంతవరకూ… యజమాని రాసే కొత్తపలుకులు, కావాలని రాయించే ప్రత్యేక ఎడిట్ ఫీచర్లు, కొన్ని వ్యాసాలు పక్కన పెడితే… సమాజంలోని అన్ని సెక్షన్ల అభిప్రాయాల్ని అచ్చేస్తుంది… ఒకే ఇష్యూ మీద భిన్నాభిప్రాయాల్ని ప్రచురిస్తుంది… కానీ ఇతర పత్రికలు తమకు నచ్చేవి, తమకు ఉపయోగపడేవి, తమ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నవి మాత్రమే ప్రచురిస్తాయి… పైగా వేరే పత్రికల్లో రాస్తుంటే తమ పత్రికల్లో చాన్స్ ఇవ్వవు, ఉదాహరణకు ఈనాడు… వేర్వేరు పత్రికల్లో రాసే వ్యాసరచయితలను ఈనాడు ఎంటర్టెయిన్ చేయదు… ఆ ఎడిట్ పేజీలో తమ భావాలకు విరుద్ధంగా ఒక్క అక్షరాన్ని కూడా రానివ్వదు… సరే, తన పత్రిక తనిష్టం… నమస్తే తెలంగాణ ‘‘కేసీయార్-టీఆర్ఎస్ లైన్’’ తప్ప మరో అక్షరం రానివ్వదు… అలా ఏమైనా భిన్నాభిప్రాయంతో వ్యాసం గనుక వస్తే కేసీయార్ కత్తి దూస్తాడు… మరి సాక్షి..?
నిజానికి గతంలో సాక్షికి ప్రత్యేకంగా ఎడిట్ పేజీ లైన్ అంటూ స్థిరంగా ఉండేది కాదు… ఎక్కువగా తెలుగుదేశాన్ని తూర్పారపట్టేవి, జగన్ను ఎత్తుకునేవి కనిపించేవి… ఇప్పుడూ అంతే… కానీ కొంతకాలంగా యాంటీ-బీజేపీ లైన్ కనిపిస్తున్నది… ఆ భావజాలమున్న రచయితలే ప్రముఖంగా కనిపిస్తున్నారు… ఏబీకే, వర్ధెల్లి, కొమ్మినేని వ్యాసాలు ప్రధానంగా జగన్ లైన్ను సమర్థించేలా, ఎత్తుకునేలా ఉంటాయి… కొమ్మినేనికి, వర్ధెల్లికి అది తప్పదు… ఢిల్లీలో జగన్-మోడీ భాయ్ భాయ్… కానీ వైసీపీ మీడియా, సోషల్ మీడియా మాత్రం బీజేపీ మీద విరుచుకుపడుతున్నయ్… కొన్ని వెబ్సైట్లలో కనిపించే ఆ లైన్ ఆర్టికల్స్ కూడా తర్జుమా చేసేసి అచ్చేస్తున్నారు సాక్షిలో… ఆ లైన్ రచయితలకే ప్రాముఖ్యం ఇప్పుడు…??
Ads
సాక్షికి గానీ, ఆంధ్రజ్యోతికి గానీ ‘తమ ఎడిట్ పేజీల్లో రాసేవాళ్లు వేరే పత్రికలకు రాయవద్దనే’ నియమం ఏమీ లేదు… పైగా ఇప్పుడు సాక్షి యాంటీ బీజేపీ ఒరవడిలో కొట్టుకుపోతోంది… జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్నాళ్లు ఆంధ్రజ్యోతి బీజేపీ డప్పు కొట్టే ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు తన లైన్ కూడా యాంటీ బీజేపీయే అన్నట్టుగా ఉంది… సేమ్… జగన్-మోడీ బాగానే ఉంటారు, కానీ సాక్షి భిన్నం… చంద్రబాబు మోడీని పల్లెత్తు మాట అనడు, కానీ ఆంధ్రజ్యోతి భిన్నం… చాలా అంశాల్లో ఉప్పూనిప్పూ యవ్వారంలా కనిపించే జ్యోతి, సాక్షి ఈ విషయంలో మాత్రం సేమ్, సేమ్… పైగా ఈరోజు ఓ విశేషం ఏమిటంటే..? యోగేంద్ర యాదవ్ రాసిన ఓ వ్యాసాన్ని రెండు పత్రికలూ ప్రచురించాయి… కంటెంట్ సేమ్… లైన్ సేమ్… బెంగాల్ రాజకీయ పరిస్థితుల మీద రాశాడు…
అందులోని తన అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని ఏమీ లేదు… చాలావరకూ బయాస్డ్గా ఉంటాయి తన రాతలు… అదీ తనిష్టం… అయితే ఆంధ్రజ్యోతిలో ఆయన ఓచోట ఏమంటాడంటే..? “తృణమూల్ కాంగ్రెస్ కండబలాన్ని ఎదుర్కునే శక్తి బిజెపికి ఎంతైనా కొరవడింది. ఈ లోటును కేంద్ర భద్రతా బలగాలు తీర్చడం గమనార్హం. CRPF మొదలైనవి BJP కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవికాదు”… విచిత్రంగా ఈ వాక్యాలు సాక్షి వ్యాసంలో లేవు… ఒక వ్యాస రచయిత అభిప్రాయాన్ని యథాతథంగా పబ్లిష్ చేయాలని అనుకున్నప్పుడు… అందులో మీకు నచ్చినవే ఉంచి, మిగతావి ఎడిట్ చేస్తారా..? మొత్తం వ్యాసాన్నే అవాయిడ్ చేయొచ్చు కదా అలాంటప్పుడు..? పైగా అది మరీ అంత ప్రమాదకరమైన వ్యాఖ్య ఏమీ కాదు… మరెందుకీ కత్తిరింపులు..? హేమిటో…!!
Share this Article