Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం, ఈ బీసీ కెరటం చివరకు కవిత క్యాంపులో విరిగిపడిందా..?!

June 22, 2025 by M S R

.

ర్యాగ కృష్ణయ్య… అలియాస్ బీసీ కృష్ణయ్య… అఫ్‌కోర్స్, నయీంతో దోస్తీతో తను ఏం పేరు సంపాదించాడనేది పక్కన పెడితే…

ఒక దశలో ది గ్రేట్ తెలంగాణ వీరప్రేమికుడు చంద్రబాబుకు తెలంగాణ సీఎం అభ్యర్థి కృష్ణయ్య… ఇది అయ్యేది కాదు, పొయ్యేది కాదు అని చంద్రబాబుకూ తెలుసు, కృష్ణయ్యకు తెలుసూ…

Ads

ఆలేరు నర్సింహులు దగ్గర నుంచి చంద్రబాబు వాడుకోని బహుజన లీడర్ లేడు… వాడుకోవడంలో ప్రపంచంలో నెంబర్ వన్ కేరక్టర్ తను…

తరువాత ఏమైంది..? హఠాత్తుగా జగన్ చేరదీశాడు… అసలు తెలంగాణ కృష్ణయ్యకు, ఏపీ రాజ్యసభ సీట్లకు లింక్ ఏమిటి..? ఎస్, జగన్ అంటేనే ఓ అర్థం చేసుకోజాలని చిత్రమైన కేరక్టర్ కదా… సో, ఈయన ఎంపీ అయిపోయాడు…

తరువాత..? బీజేపీ చేరదీసింది… సరే, రెండు తెలుగు రాష్ట్రాలకూ సంబంధించి బీజేపీకి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… ఓ దిక్కుమాలిన పార్టీ విధానం… పైగా నాయకుల కుమ్ములాటలు సరేసరి… పట్టించుకున్నవాడు లేడు… (నవ్వొద్దు, కిషన్‌రెడ్డి కాబోయే పార్టీ జాతీయ అధ్యక్షుడు అని నిన్న ఏదో కాషాయ సైటులో చదివాను)…

krishnaiah

సరే, తను ఏం సాధించాడు, సాధించగలడు అనేది వదిలేద్దాం… అదే బీజేపీ ఫోల్డ్‌లో ఉన్న మంద కృష్ణ మాదిగ చాలానయం, తన జాతి చిరకాల కాంక్షను నెరవేర్చే దిశలో చివరి స్టెప్పులో ఉన్నాడు… ఖచ్చితంగా తనది ఓ విజయం… తన బతుకు చరిత్రాత్మకం…

మరి కృష్ణయ్య..? హఠాత్తుగా కవిత పక్కన చేరి, ఏదో మీటులో ఏదేదో చెబుతున్నాడు… సగమే అర్థమవుతుంది ఎవరికైనా… తన వెంట ఉన్నవాళ్లు చాలామంది దూరమయ్యారు… నువ్వు, సోకాల్డ్ బీసీ ఉద్ధారకురాలు కవితను నమ్ముతున్నావా కృష్ణయ్యా…?

ఆమె తన డాడీ వెంట ఉండే దెయ్యాలతో పోరాడుతున్నది గానీ… నెత్తురు మొత్తం టీఆర్ఎస్, అదేలెండి బీఆర్ఎస్… డాడీ ఇంట్లోకి రానివ్వకపోయినా సరే… బీజేపీకి బద్ధ వ్యతిరేకి… మద్యం స్కామ్ భాగస్వామి… మరి ఆమెతో కలిసి నీ కార్యాచరణ ఏమిటి..? అంటే బీజేపీ చేరదీసినా సరే, ఆ పార్టీకి కూడా ద్రోహమేనా..?

ఫాఫం, బీజేపీ… తెలుగు రాజకీయాల్లో ఎవరిని నమ్ముకుంటోంది..? తనకు రాజ్యసభ ఎందుకు ఇచ్చినట్టు..? ఇలా కవిత వెంబడి ఊరేగడానికా..? ఫాఫం మోడీ, ఫాఫం నడ్డా, ఫాఫం అమిత్ షా… అన్ని మిస్టరీలే, తెలంగాణ బీసీ బిడ్డకు ఏపీ ఎంపీ ఇవ్వడం ఏమిటి జగన్..?

తరువాత ప్లేట్ మారి బీజేపీలోకి చేరడం ఏమిటి..? వాళ్లూ కళ్లుమూసుకుని ఎంపీ ఇచ్చేయడం ఏమిటి..? ఇన్నేళ్లుగా అనేక కష్టనష్టాలకోర్చి బీజేపీలో కొనసాగిన ఒక్క బీసీ లీడర్ దొరకలేదా ఫాఫం..? సరే, ఇచ్చారు, ఏం ఉద్ధరించబడ్డారు..? చివరకు సోకాల్డ్ బీజేపీ బద్ధ మద్య వ్యతిరేకి కవిత పక్కన చేరి ఇలా సూక్తులు వల్లించడానికా..? మోడీ భాయ్, అప్పుడప్పుడూ సిగ్గుపడండి బాస్..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎంతటి మంచి భరోసా ఆర్యా… ఇదొక జీవిత బీమా ధీమా…
  • ఫాఫం, ఈ బీసీ కెరటం చివరకు కవిత క్యాంపులో విరిగిపడిందా..?!
  • సితారే జమీన్ పర్..! గుడ్ టేస్ట్, గుడ్ స్టోరీ, గుడ్ ఎఫర్ట్… గుడ్ మూవీ..!!
  • మానస్ పేలవం… రష్మి, సుధీర్ కళకళ… సుమ, ప్రదీప్ డౌన్ ఫాల్…
  • రష్మిక మంధాన శుక్రమహర్దశ..! నాగార్జున చెప్పింది అక్షరసత్యం..!
  • కజ్జాలు, అలకలు, కటీఫ్‌లు… ఆ గానకోకిల వెలుగు చిత్రానికి మరోవైపు…!!
  • భలే చమత్కారివి కవితమ్మా… పదేళ్లు ఆగీ ఆగీ హఠాత్తుగా ఐదూళ్ల మాట..!!
  • ఫాఫం సాక్షి..! చంద్రబాబు మీద కోపంతో యోగాపై రప్పారప్పా దాడి..!!
  • వేణుస్వామీ… రామోజీ ఫిలిమ్ సిటీలో దెయ్యాలట… ఏమైనా చేయగలవా..?!
  • ఏదో రప్పా రప్పా రాసేశావు గానీ… జగన్‌ ఎలా ‘ఇరుక్కుంటాడు’..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions