.
గుర్తుంది… కొణిజేటి రోశయ్య బతికినన్నాళ్లూ ఎంత గౌరవంగా, తలెత్తుకుని బతికాడో గుర్తుంది… ఓపిక, పార్టీ పట్ల నిబద్ధత కూడా గుర్తుంది… చిల్లర రాజకీయ వ్యాఖ్యలకు తను విసిరే వ్యంగ్యాలు, కౌంటర్ల తీరు కూడా గుర్తుంది…
ఏళ్లపాటు తన సాయం పొంది, తన పేరు చెప్పుకుని పబ్బం గడుపుకున్న తన కులం వైశ్య ప్రముఖులు కొందరు (?) తను మరణించాక అంత్యక్రియలకు సైతం మొహం చాటేసిన రియాలిటీ కూడా గుర్తుంది… అప్పట్లో ముచ్చట వాళ్ల తీరును ఎండగట్టింది…
Ads
తను ఏమైనా అనామకుడా..? గవర్నర్, ముఖ్యమంత్రిగా పనిచేశాడు… దేశాన్ని, రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న కేరక్టర్ కూడా కాదు… కానీ ఎట్టకెేలకు…
Mohammed Rafee .......
తెలంగాణలో అధికారికంగా రోశయ్య జయంతి…. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించినట్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన కొణిజేటి రోశయ్యకు అద్భుత గౌరవం లభించునున్నది!
తెలంగాణలో ఇక ప్రతియేటా అధికారికంగా జూలై 4న రోశయ్య జయంతి నిర్వహించాలని మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వ్యులు ఇచ్చింది. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖకు ఈ బాధ్యతలు అప్పగించింది! అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా కలెక్టర్లు పాల్గొని రోశయ్య జయంతి నిర్వహించాలని, నివాళులు అర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది నిజంగా తెలంగాణలో సంచలనమే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఏ తెలంగాణేతర ముఖ్యమంత్రికీ లభించని అరుదైన గౌరవం! కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్ధిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యదే! పట్టించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేదు!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది కాబట్టి, వారి నేతకు ఆంధ్రా అనే వివక్ష చూపకుండా గౌరవం కల్పించుకున్నారు! ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ కు వ్యతిరేక పార్టీలు కాబట్టి అక్కడ మొండి చెయ్యి చూపించారు! అంతా రాజకీయమే! నేతలఫై గౌరవం లేదు!
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆంధ్రా వారిని ఉద్దేశించి మీరెక్కడ బతుకుతున్నారు? ఎవరిది తింటున్నారు? అంటూ రెచ్చిపోయి మాటల ఈటెలు విసిరిన మరుసటి రోజే, ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోశయ్య జయంతిని అధికారిక పండుగగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వ్యులు రావడం విశేషం!
రోశయ్య నివాసం వున్న ధరమ్ కరం రోడ్డులో ఒక వీధికి రోశయ్య పేరు కూడా పెట్టనున్నారు. ఆయన ఇంటికి కూత వేటు దూరంలో వున్న నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోశయ్య పేరు పెట్టనున్నారు! లకిడికాపూల్ చౌరస్తాలో రోశయ్య విగ్రహం నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది! …….. - డా. మహ్మద్ రఫీ
Share this Article