.
హైపర్ ఆది… పదే పదే ఎందుకు నెగెటివిటీని మూటగట్టుకుంటాడో అర్థం కాదు… టీవీ షోల డైరెక్టర్లు చెబితే టెంప్టయి బోల్తా కొడతాడో, తన సొంత ‘విజ్ఞాన ప్రదర్శనో’ అర్థం కాదు…
పరోక్ష బూతులు, బాడీ షేమింగులు ఎట్సెట్రా యథేచ్ఛగా దొర్లుతూ ఉంటాయి… తాజాగా ఓ ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమో… అందులోకి ప్రియాంక జైన్, ఆమె ప్రియుడో, కాబోయే భర్తో శివ వచ్చారు…
Ads
ఆమె పాపులరే… అక్కడెక్కడో పిచ్చి రీల్ చేసి వివాదాల్లోకి ఇరుక్కుంది… సారీ చెప్పింది… కాబోయే మొగుడుగా చెప్పబడుతున్న ప్రియుడితో బోలెడు రీల్స్ చేస్తోంది… పలు షోలలో పిచ్చి పిచ్చి డ్రెస్సులతో ఎక్‌పోజింగు కూడా..,
నిజానికి చాలామందికి ఆమె బిగ్‌బాస్ ప్రియాంకగానే తెలుసు… కాస్త తెలివి, కాస్త టెంపర్, కాస్త అందం ఉన్న కేరక్టరే… కానీ అప్పుడప్పుడూ పాపులారిటీ పరుగులో కనిపించే తిక్కదనం… బట్, చాలామందికన్నా నయమే…
సరే, ఆ షోకు వచ్చింది… అవునూ, చాలా జంటల్ని చూస్తున్నాం, మీరూ కలిసే ఉంటారా..? పెళ్లి చేసుకుంటారా..? నిజమేనా..? నమ్మొచ్చా..? వంటి నెగెటివ్ ప్రశ్నలు వేసి హైపర్ ఆది తనను తాను దిగజార్చుకున్నాడు… తనకు కొత్తేమీ కాదు, జనంలో పలుచన అవుతున్నానని తెలుసో తెలియదు కానీ… ఇది తాజా…
పవన్ కల్యాణ్, నాగబాబుకు అంత సన్నిహితుడు తను… ప్రచారం చేశాడు… వాళ్ల కోటరీ సభ్యుడు… ఎంత హుందాగా ఉండాలి..? ఆ సోయి లేదు తనలో… శుభం పలకరా అంటే..? ప్రియాంక, తన ప్రియుడు వస్తే ఆ పిచ్చి ప్రశ్నలు దేనికి..?
సరే, ఆ షో తలతిక్క డైరెక్టర్ స్క్రిప్టు రాశాడే అనుకుందాం… దాన్నెందుకు హైపర్ ఆది ఆమోదించినట్టు..? ఇలాంటివి ఆదిని మరింత దిగజార్చేవే తప్ప ఓ హుందాతనాన్ని పెంచేవీ కావు, ఓ మెట్టు ఎక్కించేవీ కావు… ఏమో, తనే ఇలాంటివి కోరుకుంటే ఫాఫం ఆది అనుకోవడం తప్ప ఇంకేమీ లేదు…
సరే, ప్రోమోలో ఉన్నట్టు షోలో ఉండకపోవచ్చు… కానీ ఆ ప్రోమోతో ఇజ్జత్ పోగొట్టుకున్నది మాత్రం హైపర్ ఆది మాత్రమే… హుందాగా వ్యవహరించింది ప్రియాంక, తన ప్రియుడు… రాను రాను ఆ షోను మరీ ఇలా తయారు చేస్తున్నారేంట్రా..!?
Share this Article