.
వైజయంతి మూవీస్ వాళ్లు ఓ టీవీలో టాక్ షోకు ప్లాన్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది… అదీ జీతెలుగులో… ఆ చానెల్‌లో పెద్దగా ఇలాంటి షోలు కనిపించవు…
జగపతిబాబు హోస్టుగా జయమ్ము నిశ్చయమ్మురా షో స్టార్ట్ చేస్తున్నట్టు ఓ ప్రోమో కనిపించింది… తన చిన్ననాటి ముచ్చట్లతో కూడిన ప్రోమో కొత్తగా బాగున్నట్టనిపించింది… తన లుక్కు, తన సీనియారిటీ షోకు ప్లస్ అవుతాయనే అనిపించింది…
Ads
గతంలో కూడా వైజయంతి సిస్టర్స్ జయప్రదతో ఓ టాక్ షో నిర్వహించినట్టు గుర్తు… టీవీల్లో టాక్ షోలు కొత్తేమీ కాదు… బాలకృష్ణ అయితే ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అని అదరగొట్టాడు కూడా… ఈ షోలకు వ్యూయర్ షిప్ కూడా ఎక్కువే… కాకపోతే ఎవరిని గెస్టులుగా పిలుస్తారనేదే ముఖ్యం…
బాలకృష్ణ పెద్ద పెద్ద స్టార్లతో సరదా సరదాగా షో రన్ చేశాడు… తనే ఆ షోకు ప్లస్… ఎందుకోగానీ అర్థంతరంగా ఆపేశారు… ఇప్పుడు జగపతిబాబు షో ఫార్మాట్ ఏమిటనేది ఇప్పుడే చెప్పలేం గానీ… కొత్తగా ట్రై చేస్తున్నట్టుగా ఉంది…
నిజానికి ఈ షోకు శివాజీని అనుకున్నారట… కోర్టు సినిమాలో మంగపతి కేరక్టర్ బాగా హిట్టయ్యేసరికి హఠాత్తుగా శివాజీ బిజీ అయిపోయాడు… రెమ్యునరేషన్ కూడా అధికంగా డిమాండ్ చేసినట్టున్నాడు… దాంతో జగపతిబాబును ప్రవేశపెడుతున్నట్టు కనిపిస్తోంది… (జబర్దస్త్ షో కూడా మానేసినట్టున్నాడు, మళ్లీ కృష్ణ భగవాన్ కనిపిస్తున్నాడు జడ్జిగా)…
కానీ నిజంగానే ప్రోమో చెబుతున్నట్టుగానే ఒకవేళ స్టార్ల చిన్ననాటి ముచ్చట్లతో గనుక టాక్ షో నిర్వహిస్తే ఆసక్తికరంగా ఉంటుంది… ఎలాగూ ఇండస్ట్రీలో జగపతిబాబు సీనియర్, అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి షో రక్తి కట్టే చాన్సయితే ఉంది…
Share this Article