.
ఓ మిత్రుడు అడిగాడు… కామాఖ్య వెళ్లారు సరే… అక్కడి వామాచార పూజలు సరే… కానీ దానికి దీటైన సమీప ఆది శక్తిపీఠాల గురించి చెప్పండి అని… సూపర్ ప్రశ్న… అసలు ఆది శక్తి పీఠాలు ఎన్ని..?
1. కామాఖ్య, 2. బిమలా దేవి (పూరీ జగన్నాథ గుడి అంతర్భాగం) 3) అదే రాష్ట్రంలో తారాతరిణి గుడి….. అఫ్ కోర్స్, కోలకత్తాలోని మహాాకాళి దుర్గ గుడి…
Ads
తారా తరిణీ దేవాలయం ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా, బ్రహ్మపుర్ నగరానికి సమీపంలోని కుళికోటి పర్వతాలపై ఉంది… ఇది భారతదేశంలోని పురాతన శక్తిపీఠాలలో ఒకటి. ఇది బిమలా దేవి (తారా తారిణీ) దేవాలయంగా కూడా పిలవబడుతుంది. (విమలాదేవి)…
శక్తిపీఠ మూల కథ:
దక్షప్రజాపతికి 27 మంది కుమార్తెలు, వారిలో సతీ దేవి పరమశివుని భార్య. శివుని అగౌరవపరచిన దక్షుని యజ్ఞానికి సతీ హాజరై తనను తాను అగ్నిలో వేసుకొని మరణిస్తుంది. ఆవిషయంలో విషాదంలో మునిగిపోయిన శివుడు సతీ మృతదేహాన్ని భుజంపై వేసుకొని ప్రపంచమంతా తిరుగుతుంటాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 51 భాగాలుగా ముక్కలు చేస్తాడు…
ఈ శరీర భాగాలు భూమిమీద పడ్డ ప్రదేశాలు “శక్తిపీఠాలు”గా పరిగణించబడ్డాయి.
తారా తారిణీ దేవాలయం – శక్తిపీఠ విశిష్టత:
ఈ దేవస్థానం శక్తిపీఠాల్లో ఒకటిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం, సతీ దేవి స్తనాలు ఇక్కడ పడ్డాయని నమ్మకం. అందుకే, ఈ దేవాలయం “స్తన పీఠం”గా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో ఉన్న ద్విత్వ దేవతలు “తారా” మరియు “తారిణి”… ఇక్కడ భిమలా దేవి అనే పేరుతో వీరి ఉనికిని గుర్తిస్తారు… ఈ దేవతలు మాతృత్వాన్ని, శక్తిని, సాహసాన్ని సూచిస్తారు…
ఆలయ ప్రత్యేకతలు:
• ఆలయం కుళికోటి కొండలపై 999 మెట్ల మీద ఉంటుంది.
• నదీ తీరాన — రాశికుల్య నది వద్ద — ఉండటం వల్ల ఇది పవిత్రంగా పరిగణించబడుతుంది.
• మాతృత్వానికి ప్రతీకగా భావించబడే తారా తారిణీ దేవతలు, తల్లులు గర్భధారణకు ముందు లేదా తర్వాత ఈ దేవాలయాన్ని దర్శించి ఆశీర్వాదం తీసుకుంటారు.
• ప్రాచీన కాలంలో ఇది బౌద్ధుల ఆరాధనా స్థలంగా కూడా ఉండేది. తారా మరియు అవలోకితేశ్వర బౌద్ధ దేవతల రూపాలుగా పూజించబడింది……… రచన: శశిధర్ చేబర్తి
భారతీయ ఆధ్మాత్మిక మార్మిక, విశిష్ణ పుణ్యక్షేత్రాల అన్వేషణలో ఉండేవారికి మాత్రమే ఈ కథనం… తెలుగువాళ్లకు ఈ రెండు క్షేత్రాలకు పయనం, దర్శనం పెద్ద కథేమీ కాదు.,. వైజాగ్, బరంపురం వాసులకు మరీ ఈజీ… ఇతర ఏపీ ప్రాంతాలు, తెలంగాణ వాసులకు ముందస్తు ప్లానింగ్ అవసరం..!!
Share this Article