.
ఇది నా సినిమా అని తలెగరేసి చెప్పుకోగల నితిన్ సినిమాలు పెద్దగా కనిపించవు… పైగా చాన్నాళ్లుగా ఫ్లాపులు… బలమైన సినిమా నేపథ్యం ఉండీ ఆశించినంతగా… దిల్ రాజు భాషలో చెప్పాలంటే ఉజ్వలంగా వెలగాల్సిన కెరీర్ మిణుకుమిణుకుమంటోంది… ఒక బన్నీ కావల్సినోడు…
ఇప్పుడు తనకు ఓ సక్సెస్ అత్యవసరం… ఈ దశలో పాత హీరోయిన్ లయ, ప్రజెంట్ స్టార్స్ వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ వంటి తారలు… ఈ తమ్ముడు సినిమాకు పాపులర్ మ్యూజిషియన్ అజనీష్ జతయ్యాడు… దిల్ రాజు నిర్మాత… సో, కొంత బజ్ రావాలి…
Ads
కానీ రాలేదు..? దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి రాంచరణ్ తేజ మీద చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయి ప్లస్ ఎందుకోగానీ దిల్ రాజు మీద నెగెటిెవిటీ పెరుగుతోంది… తను ఓసారి సీరియస్ లుక్ వేయాలి దీని మీద… ఈ ప్రభావం తమ్ముడు సినిమా మీద కూడా పడినట్టుంది… బజ్ లేదు, అడ్వాన్స్ బుకింగులూ చాలా పూర్… తీరా చూడబోతే సినిమా అంతంతమాత్రమే… నీరసపరిచింది…
- సింపుల్‌గా చెప్పాలంటే… అజనీష్ బీజీెఎం (రెండే పాటలు, ఎవరో మనకు తెలియని గాయకులు పాడారు, పెద్ద ఇంప్రెసివ్‌గా కూడా లేవు…) సౌరబ్ సచ్‌దేవ విలనీ మాత్రమే సినిమాకు ప్లస్ పాయింట్లు… అఫ్‌కోర్స్, దిల్ రాజు సినిమా కదా నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నయ్… ఇవి సరిపోతాయా..? సరిపోవు..? అందుకే పూర్ ఫీడ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ ప్రీమియర్ షోస్…
సినిమా ప్రధానంగా జై (నితిన్) తన సోదరి (లయ)తో ఎలా తిరిగి కలుస్తాడు, ఆమెను ప్రాణాపాయం నుండి ఎలా కాపాడతాడు అనే అంశం చుట్టూ తిరుగుతుంది. వారి మధ్య అనుబంధం, తిరిగి కలుసుకోవడం సినిమాకు కీలకమైన అంశం…
నిజానికి ఈ సినిమాలో నితిన్‌కు లోతైన భావోద్వేగాలు, యాక్షన్ రెండూ ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ, అతని నటన రొటీన్‌గా అనిపిస్తుంది… సినిమా మొత్తంలో ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు…
సప్తమి గౌడ పాత్ర కథలో అంతగా ఇమడలేదు. ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యత లేదు, నటనకు కూడా ఆస్కారం లేకుండా పోయింది… పోనీ, ప్రధానంగా ప్రచారం చేయబడిన లయ పాత్రకైనా ప్రాధాన్యం ఉందా..? అదీ లేదు… కథలో ఆమె పాత్రకు సరైన పట్టు లేదు… అసలు గుర్తుంచుకునే సీన్స్ లేవు… ఇక నటించడానికి ఏముంటుంది..?
వర్ష బొల్లమ్మ ఉందంటే ఉంది, అంతే… శ్రీకాంత్ అయ్యంగార్, హరితేజ ఏవో చేశారంటే చేశారు… అంతా ఓ నిర్లిప్తత కనిపిస్తుంది సినిమాలో…
విలన్ పాత్రలో సౌరభ్ సచ్‌దేవ్ బాగా చేశాడు… దర్శకుడు కాస్త వినూత్నంగా చూపించే ప్రయత్నం చేశాడు, అతని నటన సినిమాకు ఒక ప్లస్ పాయింట్… కానీ అదొక్కటీ ఏం సరిపోతుంది జనాన్ని థియేటర్‌కు రప్పించడానికి..?
దురదృష్టవశాత్తూ, కథలోని భావోద్వేగ కోణం ఏ మాత్రం కొత్తగా లేదు… మొదటి సగం అంతా అడవి నేపథ్యంలో సాగుతుంది.., భావోద్వేగ సన్నివేశాలు ఏ మాత్రం ఆకట్టుకోలేవు… హీరో మానసిక గందరగోళం, సోదరి దూరం కావడానికి కారణాలు వంటి కీలక సన్నివేశాలు పాత చింతకాయ పచ్చడిలా ఉన్నాయి…
యాక్షన్ విషయానికి వస్తే, హీరో విలువిద్యలో నిపుణుడని చూపించినా, ఆ నైపుణ్యాన్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు… అంటే బలంగా ప్రజెంట్ కాలేదు… ఫలితంగా, అడవి యాక్షన్ సన్నివేశాలు కూడా ఫ్లాట్‌గా, ప్రభావం లేకుండా ఉన్నాయి…
రెండవ సగం అంతా ఒకే రాత్రి నేపథ్యంలో సాగుతుంది, ఇది ఇటీవల చాలా సినిమాల్లో చూసినదే… వీఎఫ్‌ఎక్స్ ఎక్కువగా ఉపయోగించినా, యాక్షన్ సన్నివేశాలు పెద్దగా రక్తికట్టలేదు… ఈ సినిమా నుండి పెద్దగా గుర్తుంచుకోవడానికి ఏమీ లేదు…
Share this Article