.
Pardha Saradhi Potluri … మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ మూసేసింది! 2000, జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్థాన్ లో ప్రారంభించింది!
అఫ్కోర్స్! మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యాలయం పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు!
2000 లో మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యకలాపాల కోసం కొత్తగా ఆఫీస్ ప్రారంభించాలని అని అనుకుంటున్నప్పుడు పాకిస్థాన్ కి చెందిన టెకీ అయిన జవ్వద్ రెహమాన్ మైక్రోసాఫ్ట్ తరుపున పాకిస్థాన్ లో ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం సహకరించాడు.
Ads
పాకిస్థాన్ లో ఉద్యోగులని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగులని రిక్రూట్ చేయడంతో పాటు కొన్నాళ్ళు అదే ఆఫీస్ లో పనిచేశాడు.
LinkedIn లో పోస్టు పెడుతూ రెహమాన్ భావోద్వేగానికి గురయ్యాడు. సరిగ్గా 25 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ లో IT పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని భావించాను, మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల కోసం పాకిస్థాన్ లో ఆఫీస్ ఓపెన్ చేయడం, దానిలో నేను భాగస్వామిని అవడం మీద ఆనందం అనుభవించాను. కానీ ఇప్పుడు అదే కార్యాలయం మూతపడుతుండడం బాధగా ఉంది!
జవ్వద్ రెహమాన్ తన LinkedIn పోస్టులో పాకిస్థాన్ IT మంత్రికి విజ్ఞప్తి చేస్తూ మల్టినేషనల్ సంస్థలు ఒక్కొక్కటి పాకిస్తాన్ నుండి బయటికి వెళ్ళిపోతుండడం ఎందుకు జరుగుతున్నదో ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకొని పరిస్థితి చక్కదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు!
Well! Microsoft ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులని తొలగిస్తున్నది! మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులలో 4% మందిని అంటే 9,100 మందిని తొలగిస్తున్నది. ఇది క్లౌడ్ బేస్డ్ మరియు భాగస్వామ్య పధ్ధతిలో తన కార్యకలాపాలని షిఫ్ట్ చేస్తున్న సందర్భంలో తీసుకుంటున్న చర్య అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది!
లాభాల పరంగా చూస్తే పాకిస్తాన్ ఏ విధంగానూ అనువైనది కాదని 2022 లోనే మైక్రోసాఫ్ట్ ఒక నిర్ణయానికి వచ్చినా మూడేళ్ల ఆలస్యంగా తన ఆఫీస్ తో పాటు అన్ని కార్యకలాపాలని ఆపేసింది మైక్రోసాఫ్ట్! కేవలం లైజన్ ఆఫీస్ లో ఐదుగురు ఉద్యోగులు మాత్రం కొనసాగుతారు!
ఇదంతా చైన్ రియాక్షన్!
ఆటోమోటివ్ దిగ్గజాలు అయిన సుజుకి, టొయోట, హోండా తమకి వ్యాపార అనుకూల పరిస్థితులు లేవని పాకిస్థాన్ నుండి వెళ్ళిపోయి చాలా కాలం అయ్యింది! హోండా 70సీసీ బైక్ ధర 1,60,000/- పాకిస్తాన్ లో.
అఫ్కోర్స్! పాకిస్థాన్ లో అసెంబ్లింగ్ యూనిట్స్ మాత్రమే నెలకొల్పాయి జపాన్ ఆటో సంస్థలు. కోవిడ్ తరువాత అవి కూడా మూత పడ్డాయి. మైక్రోసాఫ్ట్ వల్ల అంతో కొంత డాలర్ల రూపంలో ఫారెక్స్ పాకిస్తాన్ రిజర్వ్ బాంక్ లో జమ అయ్యేవి కానీ ఇకనుండి అదీ ఉండదు!
Share this Article