.
నిజమే… తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో బాగా చర్చ సాగుతోంది… సీనియర్లను ప్లస్ తోటి కాంగ్రెస్ ముఖ్యులను గౌరవించాలన్న రేవంత్ రెడ్డి ధోరణిని కొందరు నాయకులు అలుసుగా తీసుకుంటున్నారు అనే చర్చ… ప్రత్యేకించి పొంగులేటి…
దాపరికం అక్కర్లేదు… దూకుడుగా వెళ్తున్నాడు… తను కేవలం మంత్రి… కానీ ముఖ్యమంత్రిగా భావిస్తున్నాడు… స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏవో ప్రకటనలు చేశాడు… అది కాంగ్రెస్ స్ట్రాటజీ కోణంలో తొందరపాటు…
Ads
చాలా భూముల సంబంధ ఆరోపణలు వస్తున్నాయి… సరే, అవన్నీ పక్కన పెట్టినా… దురుసుతనం కనిపిస్తోందనీ, డబ్బుతో కాంగ్రెస్ హైకమాండ్‌ను కొనేస్తాననే ధీమా కనిపిస్తోందనే విమర్శలు కాంగ్రెస్ వర్గాల్లో పెరిగిపోతున్నాయి…
అసలే ఆమె మీనాక్షి నటరాజన్… ప్రస్తుతం తెలంగాణ యాక్టింగ్ సీఎం అనే ఆరోపణల్ని ఎదుర్కుంటోంది… ఓవరాక్షన్… రాహుల్, ఖర్గే సపోర్టు ఉందని టాక్… ఐనా సరే, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అంటే జస్ట్, ఓ పర్యవేక్షకురాలు, పరిశీలకురాలు… కానీ మీనాక్షి నటరాజన్, అంతకుమించి…
స్థానిక ఎన్నికల ప్రకటన కావచ్చు, ఇంకేవైనా అంశాలు కావచ్చు… ఆమెకు నచ్చలేదు… పొంగులేటి మీద ఏవో నెగెటివ్ వ్యాఖ్యలు చేసినట్టుంది… అసలే పొంగులేని కదా… భగభగ… ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్రానికి వస్తుంటే పొంగులేటి కొన్ని యాడ్స్ రిలీజ్ చేశాడు… వాటిల్లో యాక్టింగ్ సీఎం మీనాక్షి నటరాజన్ ఫోటో లేదు…
ఏం చేసుకుంటావో చేసుకోపో అనే ధోరణి… సరే, ఆమె దీన్ని ఎలా తీసుకుంటుందనేది తెలియదు… కానీ ఆదిలోనే ఇలాంటివి కత్తిరించాలని తెలియని మనిషయితే కాదు… ఏం చేస్తుందో చూడాలి… నిజంగానే డబ్బు మాత్రమే రాజకీయాలను ప్రభావితం చేస్తుందా..? పొంగులేటికి ఈమాత్రం తెలియదా..? జగన్ మాజీ ఫ్యాన్ కదా.,. తనకు తెలియదా, డబ్బు మాత్రమే రాజకీయాల్ని నడిపించదు అని…
- -తెలంగాణ కాంగ్రెస్‌కు పట్టని ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
– ఆమె ఫొటో లేకుండానే పేపర్లకు ప్రకటనలు
– పొంగులేటి ప్రకటనల్లో కనిపించని మీనాక్షి ఫొటో
– మంత్రి వివేక్ ప్రకటనలో మాత్రమే ప్రత్యక్షం
– ఖర్గే సమక్షంలో ఏఐసిసి నేత మీనాక్షికి అవమానం
– పొంగులేటికి క్లాస్ పీకినందుకే ఆమె ఫొటో వేయలేదన్న ప్రచారం
…. ఇవీ విమర్శలు… కావాలనే మీనాక్షి నటరాజన్ ఫోటో అవాయిడ్ చేశాడనే విమర్శ ఆంధ్రా మీడియాలో కూడా కనిపిస్తోంది… (అఫ్ కోర్స్, తెలంగాణలో ప్రస్తుతం మీడియా లేదు…) మరి అలాంటి మహిళా నేతకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో…, రాష్ట్ర నేతలు- మంత్రులూ ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలి? కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ- ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ మంత్రి ఆమెను డోంట్‌కేర్.. ఇన్చార్జి అయితే ఏంటట? అంటూ, అసలు ఆమె ఫొటో లేకుండానే పేపర్లలో యాడ్లు ఇవ్వడం దుమారం రేపింది.,,
పొంగులేని యాడ్స్ ఇచ్చిన ఆ మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఫొటో భూతద్దం వేసినా కనిపించలేదు… కనీసం చిన్న స్టాంప్ సైజ్ ఫొటో కూడా లేకపోవడం… మరో మంత్రి వివేక్ వెలుగు పత్రికల్లో ఇచ్చిన యాడ్‌లో మాత్రం, మీనాక్షి నటరాజన్ ఫొటో ఉండటం కనిపించింది… ఇది తాజా దుమారానికి కారణమయింది…
అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షికి యాడ్స్ విడుదల చేసిన వారి పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు… ఒకవేళ పిసిసి అధ్యక్షుడే వాటిని విడుదల చేసి ఉంటే, కచ్చితంగా మీనాక్షి ఫొటో ఉంచేవారు… కాబట్టి అది పొంగులేటి ఇచ్చిన ప్రకటనగానే స్పష్టమవుతోంది…
కాగా ఇటీవలి కాలంలో పొంగులేటి దూకుడుకు.. మీనాక్షి బ్రేకులు వేస్తున్నారన్న ఆగ్రహంతోనే, ఆ ప్రకటనల్లో ఆమె ఫొటో వేయలేదన్నది పార్టీ వర్గాల ఉవాచ… కాంగ్రెస్‌లో ఏది జరిగినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పనిలేదు… ఎందుకంటే… అది కాంగ్రెస్ కాబట్టి! కానీ జరిగేవన్నీ రేవంత్ రెడ్డి క్యాంపుకి ఆసక్తికరంగా మారుతున్నాయి కాబట్టి వార్తా విశేషం..!!
Share this Article