.
సినిమా నటులకు ఈ సొసైటీ వందల కోట్లు ఇస్తోంది… అపారమైన ఆస్తులు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నా సరే ఇంకా ఇంకా సొసైటీ నుంచి దండుకుంటూనే ఉండాలా..? ఓ తాజా వార్త ఈ ప్రశ్నలను మళ్లీ లేవనెత్తుతోంది… ప్రత్యేకించి మహేశ్ బాబు… ఆ వార్త ఏమిటంటే..?
రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నటుడు మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది… సాయి సూర్య డెవలపర్స్ తమకు అన్ని అనుమతులూ ఉన్నాయంటూ మహేశ్ బాబు ఫోటోతో కూడిన బ్రోచర్ చూసి, నమ్మి రూ. 34.80 లు ఇచ్చామనీ, తీరా వాళ్లు చెప్పిన బాలాపూర్‌లో ఆ లేఅవుటే లేదని ఇద్దరు ఫిర్యాదు చేశారు… దీంతో కమిషన్ నోటీసులు జారీ చేసింది…
Ads
ఈ కేసు కాస్త నయం, గట్టిగా అడిగితే 15 లక్షలు వాపస్ ఇచ్చారట… ఇది ఎప్పట్నుంచో ఉన్న కేసే… ఈడీ కూడా కేసు నమోదు చేసింది… సరే, అవి ఎటూ కదలవు, సా-గు-తూ ఉంటాయి… సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపు నుంచి 5.9 కోట్లు తీసుకున్నట్టు ఈడీ గుర్తించింది… అందులో 2.5 కోట్ల నగదు… సో, మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ…
మహేశ్ బాబు యాడ్స్ మీద మొదటి నుంచీ వివాదాలే… బాలీవుడ్ పెద్ద హీరోలు కొందరు గుట్కా సరోగేట్ యాడ్స్ చేసి, తప్పు తెలుసుకుని, లెంపలేసుకున్నారు… అమితాబ్ తనకు ఇచ్చిన డబ్బూ వాపస్ ఇచ్చాడు… కానీ మహేశ్ బాబు ఆ యాడ్స్‌లో అలాగే కొనసాగాడు… చివరకు చక్రసిద్ధ నాడీవైద్యం వంటివీ వదలడం లేదు… కూతురు సితార కూడా యాడ్స్ చేస్తోంది అప్పుడే…
యాడ్స్ చేయడం తప్పు కాదు… కానీ మోసపూరిత సంస్థలకు, సొసైటీకి నష్టం కలిగించే ఉత్పత్తులకు యాడ్స్ చేయడం తప్పే… మన చట్టాల ప్రకారం ఆయా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నా సరే సెలబ్రిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది… మన నటులకు ఇవన్నీ తెలియక కాదు, తెలిసీ చేస్తారు… కారణం, డబ్బు…
ఇదే సాయిసూర్య డెవలపర్స్ ప్రమోటర్ల మీద బోలెడు కేసులున్నాయి… అసలు ప్రిలాంచ్ వెంచర్లే ఓ మాయ… మహేశ్ బాబు సాయి సూర్య డెవలపర్స్, ఆర్కే వెనుజియా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తే, జగపతి బాబు సాహితీ ఇన్ ఫ్రా సంస్థను ప్రమోట్ చేశాడు.., వెంకటేష్ కాసాగ్రాండ్‌కు సపోర్ట్ చేస్తే, సుమ రాఖీ అవెన్యూస్‌కు జై కొట్టింది…
వీళ్ల మొహాలు చూసి, జనం పర్సులు ఖాళీ చేసుకుంటారు… ఆమధ్య చెప్పుకున్నాం కదా… చిరంజీవికి ఈ సొసైటీ ఏం తక్కువ చేసింది..? సొంత విమానాలు, పద్మ పురస్కారాల దాకాా ఎంత అపారమైన ఆస్తిపాస్తుల్ని కట్టబెట్టింది… తనకు కంట్రీ డిలైట్ యాడ్స్ అవసరమా..? ఇలా చెబుతూ పోతే చాలా ఉదాహరణలు…
అబ్బే, మాకు ఆ సంస్థల గురించి తెలియదు అని తప్పించుకోవడానికి కుదరదు… చట్టం ఆ వాదనను అంగీకరించదు… సాయిసూర్య, సురానా గ్రూపుల బాపతు కేసులు అడ్డంగా బుక్ చేసే ప్రమాదం, జనంలో అప్రతిష్ట కూడా తప్పవు… సో, స్టార్ ప్రచారకర్తలూ బహుపరాక్…
Share this Article