.
ప్రతిపక్షాల రాజకీయ పోరాటాల్లో కొత్త పుంతలు అనే పదం చాన్నాళ్లు, చాలాసార్లు విన్నాం గానీ… కేటీయార్ వాటన్నింటికీ మించిన విచిత్ర పుంతలు… కొన్నిసార్లు తనకే అర్థం కాదు కావచ్చు బహుశా…
లేకపోతే మరేమిటి..? విదేశాల నుంచి రాగానే ఏదో సమస్య ఎత్తుకుని, హరీశ్ రావు మీద పైచేయి సాధించాలి, లేకపోతే తను బాగా ఫోకస్ అవుతున్నాడనే భావనతో…. ప్రెస్ మీట్ చర్చ అంశాన్ని ఎత్తుకున్నాడు…
Ads
సరే, సొంత పార్టీలో బావామరుదల నడుమ… అన్నాచెల్లెళ్ల నడుమ స్పర్థ ఉంటే తప్పు లేదు, ఒకవేళ సమాజానికి మంచిదే అయితే అదీ మంచిదే… కానీ ఇదేం పోకడ..?
ఒక్కసారి ఇది చూడండి…
సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు..? అసెంబ్లీలో అయినా సరే, పార్లమెంటులో అయినా సరే… కేసీయార్ అయినా సరే, కేటీయార్, కిషన్ రెడ్డి, మోడీ ఎవరైనా సరే… మేం అమలు చేస్తున్న రైతు పథకాల మీద చర్చకు రెడీ అన్నాడు… పొలిటికల్‌గా ఈ సవాళ్లు సహజమే, జనంలో చర్చను, ఆలోచనను రేకెత్తించడానికి…
తనేమన్నాడు..? కేసీయార్, నువ్వు ప్రజాజీవితంలో లేకుండా పోయావు, జనం నీకు అప్పగించిన ప్రతిపక్ష పాత్ర కూడా నీకు చేతకావడం లేదు, అసెంబ్లీలో చర్చిద్దాంరా రైతు ప్రభుత్వం ఎవరో… అనేది తన సవాల్ సారాంశం…
బీఆర్ఎస్‌తోపాటు బీజేపీని కూడా సవాల్ చేస్తున్నాడు తను… రాజకీయాల్లో బహిరంగ చర్చకు సిద్ధమేనా..? అనే సవాళ్లు జస్ట్, నినాదాల కోసమే… ఇదేమీ అమెరికా కాదు, నిర్మాణాత్మక చర్చలు, టీవీ చర్చలు సాధ్యం కావడానికి…
రేవంత్ ఉన్నది ఢిల్లీలో… కానీ ఏమోయ్, రేవంతూ, నడువ్, నేను ప్రెస్ క్లబ్‌కు వస్తున్నాను, చలో వచ్చెయ్, చర్చిద్దాం అన్నట్టుగా పోలోమంటూ వందల మందితో బయల్దేరాడు కేటీయార్… దీన్నే వింత పుంతలు అంటారు… ఈ లెక్కన కవిత చాలా నయం… అఫ్ కోర్స్, హరీష్ ఇంకా నయం…
తను పిలిచింది మీ డాడీని… పైగా అసెంబ్లీకి… తెలంగాణ సమాజం వోట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు కొలువు దీరే అసెంబ్లీకి… దానికి ఓ సాన్టిటీ ఉంటుంది… ప్రెస్ క్లబ్ కూడా వోకే, కానీ తను ప్రెస్ క్లబ్‌లో కూర్చుందాంరా అని కాదు కదా సవాల్ విసిరింది…?
మరెందుకీ వక్ర వర్తింపు..? పోనీ, నిజంగానే ప్రెస్ క్లబ్‌లో చర్చకు రెడీ అయ్యే పక్షంలో ముందుగా ఓ ప్రిపరేషన్ ఉంటుంది… ఎవరెవరు జర్నలిస్టులు..? ఎంత మంది రావాలి..? ఎజెండా ఏమిటి..? అనే అంశాలు… పోలోమంటూ వందల మందితో ప్రెస్ క్లబ్ మీదకు దండెత్తడం కాదు కదా కేటీయార్…
ఫాఫం, ఆ క్లబ్‌కు కూడా నువ్వు చేసిన హామీలన్నీ వ్యర్థాలయ్యాయి కదా… యాదికి ఉందో లేదో… దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది… ఛల్, చౌరాస్తాలో తలబడదాంరా, కలబడదాంరా అనేట్టుగా ఉండవు కదా ప్రజాచర్చలు భావి నాయకా..!! ఓ ప్రజాస్వామిక వేదిక అసెంబ్లీ ఉంది కదా… డాడీతో కలిసి రావచ్చు కదా… జనం తీర్పూ అదే కదా..!!
Share this Article