.
మాట్లాడితే చాలు… తెలంగాణ జనం తాగుబోతులు… తాగడం తెలంగాణ సంస్కృతి అన్నట్టుగా రాతలు, సినిమాల్లో రోతలు, ఆంధ్రా మేధావుల కూతలు… తెల్లారిలేస్తే తాగి ఊగడం తప్ప తెలంగాణ జనానికి ఇంకేదీ తెలియదు అన్నట్టుగా చిత్రీకరణలు…
‘కక్క- ముక్క’ అంటే మాంసం, మద్యం… ఓ దారుణమైన ముద్ర… పోనీ, ఒక గుజరాత్, ఒక బీహార్ వదిలేద్దాం, ఇతర రాష్ట్రాలనూ వదిలేద్దాం కాసేపు… ఏపీలో ఎవరూ తాగరా..? చీప్ లిక్కర్ స్కాం వార్తలు, మరణాలు రోజూ విన్నవే, చదివినవే కాదా… కూటమి పాలన ఏమైనా భిన్నమా..? అంతెందుకు..? నిన్నటి ఆంధ్రజ్యోతి (ఏపీ ఎడిషన్) ఫస్ట్ పేజీ యాంకర్ వార్త ఏమంటోంది..?
Ads
ఎవరో రాసింది కాదు… ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి గెజిట్ అంటుంటారు కదా… అందులో వచ్చిందే… చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు పెరిగాయట…
లిక్కర్ 24 శాతం పెరగ్గా, బీరు ఏకంగా 129 శాతం పెరిగిందట… చంద్రబాబు పాలన రాగానే అన్నిరకాల పాపులర్ మద్యం బ్రాండ్లు,, ప్రత్యేకించి బీర్లు అందుబాటులోకి వచ్చాయి కదా… ఇక సీసాలు దించడం లేదు చాలామంది… మద్యంతో ఆదాయం ఎంత పెరిగింది వంటి లెక్కల్ని కాసేపు వదిలేస్తే…
మిత్రుడు Shankar G పోస్టు ఓసారి చదువుదాం… ‘‘రెండింతలు పెరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలు….. తాగుడు ఎంత కామన్ ఐపోయింది అంటే ఈ మధ్య పెళ్లిళ్లలో కాక్ టెయిల్ పార్టీ కంపల్సరీ అయ్యింది. ఇది మధ్య తరగతి వారికి కూడా పాకింది.
టీనేజ్ లోకి రాగానే మందు ప్రాసన జరుగుతుంది. తెలంగాణలో ఎలా ఉన్నా ఒకప్పుడు ఆంధ్రాలో అబ్బాయి తాగుతాడు అంటే పిల్లనిచ్చేవాళ్ళు కాదు. తాగితే పెద్దవాళ్ళ కంటపడకుండా దాక్కునేవాళ్ళు. ఎంతలా బానిసలు అయ్యారు అంటే రోజువారీ పనికివెళ్లేవాళ్లకు కూలితోపాటు మందుకూడా ఇవ్వాలి. ఐటీ జాబ్స్ పుణ్యమాని అమ్మాయిలు కూడా మందు మొదలు పెట్టారు.
మేము ఈ మధ్య ఒక కంపని యాడ్స్ కోసం రోడ్ సైడ్ సైన్ బోర్డులు పెట్టాము. హెవీ గేజ్ ఉన్న ఐరన్ పైప్స్ వాడాము. 2 అడుగుల లోతు సిమెంట్ కాంక్రీట్ వేశాము. దాన్ని పెకిలించటం అంత ఈజీ కాదు అనుకున్నాము.
వారం తర్వాత చూస్తే ఎవరో పీక్కుపోయారు. ఎందుకయ్యా అంటే మందు కోసం తాగుబోతులు చేసే పని అది అని చెప్పారు…. వంద వచ్చినా చాలు ఆ రోజు గడిచిపోతుంది అట…
Share this Article