.
కల్తీ కల్లు తాగి పలువురి దుర్మరణం… చాలామంది అస్వస్థత… హుటాహుటిన ఈటల రాజేందర్ (బీజేపీ) వెళ్లాడు, పరామర్శించాడు… రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులు ఎవరినీ లేదని భీషణ ప్రకటన చేసింది… మరోవైపు ఎవరో ఎక్సయిజు అధికారి అట, అబ్బే మరణాలు ఏవీ లేవు అని ప్రకటించాడట…
ఆ అధికారి ఎవరో, రేవంత్ రెడ్డి తనను శిక్షిస్తాడో, వదిలేస్తాడో కాసేపు మరిచిపోదాం… ఈటల రాజేందరే ఎందుకు ఆందోళన వ్యక్తం చేశాడు… అసలు ఏ ఇష్యూ లేకపోయినా సరే, గాలి నుంచి ఏదో ఇష్యూ క్రియేట్ చేసి… పాత్రికేయ భాషలో… గాలి పోగేసి… రేవంత్ రెడ్డి మెడకు చుట్టే బీఆర్ఎస్ ఎందుకు కిమ్మనడం లేదు..?
Ads
ఎందుకంటే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కల్లు కంపౌండ్లు మూసేశారు… మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఈ ప్రమాదకరమైన కంపౌండ్లను కేసీయార్ తెరిచాడు… హైదరాబాదులో కల్తీ కల్లు మరణాలకు నైతిక బాధ్యుడు తనే… అందుకే బీఆర్ఎస్ కిక్కుమనడం లేదనిపిస్తోంది…
(ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కేసీయార్ పుణ్యమాని విజృంభించిన విపత్తు… బనకచర్ల కాదు, రేవంత్ రెడ్డి నీ ఫామ్ హౌజుకు వస్తా, చర్చిద్దామా అని కేసీయార్‌ను ముందుగా డిమాండ్ చేయాల్సింది ఇదే…)
ఎస్, నాటి ప్రభుత్వంలో ఉన్న ఈటల రాజేందర్ కూడా నిందితుడే.., అందరికీ తెలుసు, అందరూ నటిస్తారు… ఈ కల్లు కంపౌండ్లకు అసలు కల్లు వచ్చేంత సీన్ లేదని… మొత్తం కల్తీ కల్లు, కృత్రిమ కల్లే అమ్ముతారని… నిజం, విషాదం ఏమిటంటే, తాగేవాడికీ తెలుసు…
ఎవడూ ఏమీ చేయలేడు… కింది నుంచీ పైదాకా పెద్ద నెట్‌వర్క్… అసలు ఆ కల్లు తాగకపోతే సదరు తాగుబోతులు బతకలేరు… ఆమధ్య గుర్తుందా నిజామాబాద్ జిల్లాలో అనుకుంటా, ఈ కల్లు దొరక్కపోతే అనేక మంది ప్రాణాపాయ స్థితికి చేరారు, హాస్పిటళ్లలో చేర్చి చికిత్స అందించారు… దారుణం ఏమిటంటే… ఆ కల్లే తాపిస్తే ప్రాణాలు దక్కించుకుని బయటపడ్డారు…
అందరూ డ్రగ్స్, గంజాయి మన్నూమశానం అంటారు గానీ… అది పెద్ద మహమ్మారి కల్తీ కల్లు… అందులో ఏం కలుపుతారు వంటి డిటెయిల్స్‌లోకి పోవడం లేదు గానీ… ఈమధ్యే ఓ వార్త చదివాను… ఒకాయన్ని దుబయ్ పంపించారు… అసలే కల్తీ కల్లు అడిక్ట్…
అక్కడికి పోయాక ఈ దిగ్రేట్ కల్తీ కల్లు దొరకదు కదా… అల్లాడిపోయాడు, ప్రాణాలే విడిచాడు… అంత డేంజర్ ఈ కల్లు… ఎస్, అందరికీ అన్నీ తెలుసు… ఆ రసాయనాలూ తెలుసు, కృత్రిమ కల్లు తయారీ తెలుసు… ఎవడూ మాట్లాడడు… ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అనేది కాసేపు వదిలేద్దాం… చేజేతులా ప్రభుత్వమే తీసే ప్రాణాలు ఇవి…
అంతా రాజకీయం… దరిద్రపు రాజకీయం… ఈ కల్తీ కల్లు బాధ్యులను కాపాడుతుంది… ఎవడి ప్రాణాలు పోతేనేం..? ఎవడికి పట్టింది..?! డియర్ రేవంత్ రెడ్డీ… హైడ్రా అర్జెంటుగా బుల్డోజర్లు పంపించి కూల్చాల్సింది ఈ కల్లు కంపౌండ్లే…!!
Share this Article