.
మనుషులు పైకి కనిపిస్తున్నట్టుగా ఉండదు వాళ్ల అసలు తత్వం… భిన్నంగా ఉంటుంది… పైపైన అల్లరి చిల్లరగా, సరదాగా, ఏవో జోకులు వేస్తూ కనిపించే మనుషుల అసలు మెంటాలిటీ లోతుగా ఉండొచ్చు… ఆ ప్రోమో చూస్తే అలాగే అనిపించింది…
ఏదో టీవీలో టీవీ నటి, జబర్దస్త్ కమెడియన్ వర్ష హోస్ట్ చేసే కిస్సిక్ టాక్స్ అనే షో తాలూకు ప్రోమో కనిపించింది… అలాంటివి చాలా చాలా చాట్ షోలు టీవీల్లో వస్తూనే ఉంటాయి… కానీ యథాలాపంగా చూస్తుంటే ఓ చోట అలా కళ్లు నిలబడిపోయాయి…
Ads
ఆ తాజా ప్రోమోలో గెస్టు దీపిక రంగరాజు… తెలుగువాళ్లందరికీ చాలా పరిచయమైన నటి… చాలా పాపులర్ సీరియల్ బ్రహ్మముడిలో కావ్య అనే ప్రధాన పాత్ర… తరచూ టీవీ షోలలో కనిపిస్తుంటుంది… అందరి మీదా ఏవో జోకులు వేస్తూ, తనే నవ్వుతూ… బడబడా మాట్లాడుతూ… ఓ సందడి నింపుతుంది వాతావరణంలో… అందరితోనూ అలా కలిసిపోతుంది అప్పటికప్పుడు…
బాగా యాక్టివ్… కానీ పలుసార్లు ఆమె మాటలు, జోకులు, చేష్టలు గట్రా… ఆమె మెదడులో ఏమూలో కాస్త వైకల్యం ఉందానే అనుమానాలూ రేకెత్తేలా ఉంటుంది… ఆమెను భరించడం కష్టంరా బాబూ అని ఆయా షోలలో హోస్టులు తలలు కూడా పట్టుకుంటుంటారు…
మన తెలుగు టీవీ సీరియళ్లలో కన్నడ నటీనటులదే హవా కదా… మంచి తెలుగు మాట్లాడతారు కూడా… కానీ దీపిక తమిళియన్… మొదట్లో తను కూడా యాంకర్… సేమ్, తెలుగు వాళ్లలాగే ఫ్లూయెంట్ తెలుగు మాట్లాడుతుంది…
ఈ కిస్సిక్ షోలో హోస్ట్ వర్ష… ఆమె గొంతు, ఆమె ఆకారంపై జబర్దస్త్, ఇతర షోలలో బాగా బాడీ షేమింగుకు గురవుతూ ఉంటుంది… కానీ ఈ టీవీ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో తప్పదు.., తప్పనిసరై భరిస్తూ, నవ్వుతూ, లైట్ తీసుకుంటూ, తీసుకున్నట్టు నటిస్తూ కనిపిస్తుంటుంది…
సో, గెస్టు, హోస్టు ఇద్దరూ ఇద్దరే… ఎప్పటిలాగే వర్ష మీద కూడా కొన్ని సెటైర్లు వేసింది దీపిక… బ్రహ్మముడిలో తన సహనటుడు మానస్ ప్రస్తావన వచ్చినప్పుడు గానీ, ఎవరితో ముద్దు సీన్లలో నటించడానికి ఆసక్తి ఉందనే ప్రశ్నకు గానీ తన సహజమైన పద్ధతిలో చెణుకులు విసిరింది…
హఠాత్తుగా సొంత ఇల్లు ప్రస్తావన వచ్చినప్పుడు… నాకు అదొక డ్రీమ్ అని చెప్పుకొచ్చింది… ఇంత పాపులర్, బిజీ ఆర్టిస్టువు, నీకు ఇంకా సొంతిల్లు లేకపోవడం ఏమిటనే ప్రశ్నకు… నవ్వుతూనే చెబుతోంది… పుట్టగానే నాకు కూడా ఏ స్మశానంలోనే ఓ ఆరడుగుల నేల రాసి పెట్టి ఉంటుంది కదా, గవర్నమెంట్ ఇస్తుంది కదా, అది తప్ప నాకంటా ఏమీ లేదు అందామె…
నవ్వుతూ చెప్పినా… ఏదో బాధ ఉంది ఆమెలో… ఆమె ఏం చెప్పిందో ప్రోమో చెప్పలేదు గానీ… అది చూస్తుంటే ఒక్కసారిగా ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోవడమే… ఈ మెంటల్ పిల్ల నిజానికి తన ఉనికిని భిన్నంగా చాటుకోవడానికి అలా ప్రవర్తిస్తూ ఉంటుంది గానీ, వాస్తవంగా ఓ లోతు మనిషి అనిపించింది… లేకపోతే అలాంటి షోలో అలాంటి వైరాగ్యపు భావనతో అలా ఒక్కసారిగా బరస్ట్ కాదు కదా..!!
Share this Article