.
80 ఏళ్ల వయస్సులో కూడా…. ఈ దేశ రక్షణ వ్యవస్థలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, ఎక్కడా ఏమీ మాట్లాడకుండానే, తెర వెనుక అన్నీ తానై నడిపించే అజిత్ ధోబాల్ హఠాత్తుగా వార్తల్లోకి వచ్చాడు… కాదు, ఆపరేషన్ సిందూర్ వార్తల తీరును ప్రశ్నించాడు…
ప్రత్యేకించి విదేశీ మీడియా పదే పదే ఏదేదో రాస్తోంది… ఇండియా రాఫెల్ సహా ఇన్ని జెట్లు కోల్పోయింది వంటివి కూడా… పాకిస్తాన్, దాని అనుకూల మీడియా అయితే ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థానే పైచేయి సాధించినట్టు ఊదరగొడుతోంది… దానిపై ధోబాల్ స్పందన తాజాగా…
Ads
ఆపరేషన్ సింధూర్‌పై విదేశీ మీడియా కథనాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ తీవ్రంగా ఖండించాడు… పాకిస్థాన్ దాడుల వల్ల భారత మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందనడానికి రుజువు చూపాలని ఆయన సవాలు విసిరాడు…
చెన్నైలోని ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్‌ను కవర్ చేయడంలో విదేశీ మీడియా ‘పక్షపాతం’పై ఆయన ప్రధానంగా దృష్టి సారించాడు…
“పాకిస్థాన్ ఇది చేసిందని, అది చేసిందని విదేశీ పత్రికలు ఏదేదో రాశాయి. భారత మౌలిక సదుపాయాలకు నష్టం కలిగినట్టు, కనీసం ఒక చిన్న గాజు పలక కూడా పగిలినట్లు ఒక ఫోటో, ఒక చిత్రం కూడా చూపించండి… మీడియాలో కనిపించిన ఫోటోలన్నీ పాకిస్థాన్ ఎయిర్‌బేసులు ఎలా ధ్వంసమయ్యాయో చెప్పాయే తప్ప, ఒక్క ఇండియన్ ప్రాపర్టీకి దెబ్బ తగిలిందో ఒక్క ఫోటో అయినా ఉందా..? ’’
తాను విదేశీ మీడియా చిత్రాల ఆధారంగానే చెబుతున్నానని, మే 9వ తేదీ రాత్రి, 10వ తేదీ తెల్లవారుజామున, భారత వైమానిక దళం ఇతర బలగాల సహాయంతో పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడులు చేసి, వారి చైనీస్ మద్దతున్న వాయు రక్షణ వ్యవస్థలను దెబ్బతీసిందని ధోబాల్ వెల్లడించాడు…
సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులను భారత వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై ప్రయోగించిందని, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయని వివరించాడు..జ
“మన స్వదేశీ యుద్ధ సాంకేతికత కోణంలో మనం నిజంగా గర్విస్తున్నాం… బ్రహ్మోస్ క్షిపణులు, మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్ కమాండ్ సిస్టమ్, మన రాడార్లు వంటి ఉత్తమ వ్యవస్థలు ఉన్నందుకు మనం గర్విస్తున్నాం… పాకిస్తాన్‌లో సరిహద్దు ప్రాంతాలలోని 9 ఉగ్రవాద లక్ష్యాలను కొట్టాలని మేము నిర్ణయించుకున్నాము… దాన్ని తప్ప మరెక్కడా కొట్టలేదు… ఎవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలిసిన చోట ఆ దెబ్బ ఖచ్చితంగా తగిలింది… మొత్తం ఆపరేషన్ 23 నిమిషాలు పట్టింది” అని ధోబాల్ చెప్పుకొచ్చాడు…
కృత్రిమ మేధస్సు (AI) ఒక “గేమ్ ఛేంజర్” అని, భారతదేశం దానిని “కేంద్ర బిందువుగా” చేసుకోవాలని ఉద్ఘాటించాడు… ‘‘AI ప్రపంచాన్ని మారుస్తుంది. మనం చేసే ప్రతి పనీ గుర్తుపట్టలేని విధంగా మారుతుంది, దాని అప్లికేషన్లు విభిన్నంగా ఉంటాయి, పరిశోధన మరియు అభివృద్ధికి మాత్రమే కాకుండా, మెషిన్ లెర్నింగ్, LLMలు, రక్షణ, రోబోటిక్స్, మెడిసిన్, ఫైనాన్స్ ఇలా ప్రతిదానికి అవసరం…’’ అన్నాడాయన…
Share this Article