‘‘ప్రజలు మందు తాగడం మానేసి ఉండగలరు- ప్రభుత్వమే మందు అమ్మడం మానేసి ఉండలేదు’’……. ప్రభుత్వపరంగా మద్యనిషేధం లేని ఏ రాష్ట్రమైనా సరే ఇదే వర్తిస్తుంది… మద్యం ఖజానాకు ఆక్సిజెన్… అది లేకపోతే ప్రభుత్వం నడవదు… కాదు, అలా అలవాటు చేశారు… మద్యం పాలసీల వెనుక బోలెడు మతలబులు ఉంటయ్… జనం ఎంత తాగితే నాయకులకు, అధికారులకు, వ్యాపారులకు, డిస్టిలరీలకు, బ్రూవరీలకు అంత కిక్కు… అసలు సడెన్‌గా ప్రజలంతా మందు మానేస్తామంటే ప్రభుత్వమే ఊరుకోదు, ఎలా తాగరో నేనూ చూస్తాను అంటుంది… సరే, ఏపీకి సంబంధించి ప్రజాశక్తిలో ఓ వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… అదేమిటంటే..? కరోనా సెకండ్ వేవ్ సునామీలా ముంచెత్తుతున్నందున కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలుసుగా… అందులో భాగంగా మధ్యాహ్నం పన్నెండు దాటితే ఏ షాపూ ఓపెన్ చేసి ఉండకూడదు… కర్ఫ్యూ…
మంచిదే, అవసరం కూడా… ఎంతోకొంత జనసంచారాన్ని నియంత్రించకపోతే, ఇళ్లల్లోనే ఉంచకపోతే కరోనా మరింత చెలరేగే ప్రమాదం ఉంది… ప్రజారోగ్యం రీత్యా ప్రభుత్వ నిర్ణయం కరెక్టు… కానీ కిరాణా దుకాణాలు ఎట్సెట్రా పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు తెరిచి ఉంచితే, ఆలోపు జనం కొనుక్కుని వెళ్తారు, గుడ్… మరి మద్యం… అసలు మద్యం షాపులకు వచ్చేవాళ్లే ఉదయం పదకొండు గంటలకు తాపీగా వస్తుంటారు… మరి 12 వరకే అమ్మకాలు అంటే షాపులకు నష్టం, సర్కారుకు ఆదాయనష్టం కదా… గంటలో గిరాకీతో ఒరిగేదేముంది..? అందుకని ఉదయం ఆరు గంటల నుంచే షాపులు తెరుచుకొండి, 12 గంటలకు మూసేయండి అని ఆదేశాలు ఇచ్చిందట… ఆలోచన బాగానే ఉంది గానీ బాసూ… మరీ కోడికూతతోనే నిద్రలేచి వైన్స్ ఎదుట క్యూలు కడతారంటావా..? ఎక్కడైనా సరే వైన్స్ అమ్మకాల్లో 80 శాతం సాయంత్రం వేళల్లోనే…
Ads
సరే, మందు అవసరమున్నోడు ఎప్పుడు దొరికితే అప్పుడు కొనుక్కుని పోతాడు అనుకుందాం… సాయంత్రంపూట మందు కొనుక్కుని, అక్కడికక్కడే మూత విప్పేసి, ఆ పరిసరాల్లోనే గబగబా తాగేసి తూలుతూ, కాళ్లీడిస్తూ ఇళ్లకు వెళ్లే బ్యాచులకు మాత్రం చుక్కెదురు… మరి బార్లు..? బార్లు ఓపెనయ్యేదే 11 గంటలకు… గతంలో… వీర మందుబాబులు తమ మద్యపాన యజ్ఞాన్ని ప్రారంభించేది కూడా అప్పటి నుంచే తప్ప, మరీ పాచి నోళ్లతో ఉదయం ఆరు గంటలకే తాగేవాడు ఎవడుంటాడు..? అసలు వ్యాపారమంతా నడిచేది సాయంత్రం వేళల్లోనే… సో, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనే టైమింగ్స్ బార్లకు పెద్దగా వర్కవుట్ కావు… అలాగని కేవలం బార్ల కోసం కర్ఫ్యూ నియమాల్ని సడలించలేం… సో, టెక్నికల్‌గా, రియలిస్టిక్‌గా బార్లకు ప్రస్తుతానికి లాక్సే…!! ఎహె, ఇదంతా సోది చర్చ దేనికి..? కొన్నిరోజులు మొత్తం మందు అమ్మకాలు ఆపేయవచ్చు కదా అంటారా…. హమ్మా… అపశకునం మాటలు మాట్లాడకండి… ప్రభుత్వ పెద్దలు వింటే కోప్పడతారు… ఏపీలోనే కాదు, ఏ రాష్ట్రమైనా అంతే..!!
Share this Article