.
మాజీ దళారులు తాజా దళారుల మీద ధ్వజం . మాజీ దొర దగ్గర ద్వారపాలకులు తాజా ద్వారపాలకుల మీద దుమ్మెత్తి పోసిన పాన్ – తెలంగాణ బీఆర్ఎస్ మేధావులు
కోటి రూపాయలతో నామినేటెడ్ పోస్ట్ ఆశలు చూపి నోటికి తాళం వేస్తున్న తాజా పాలకులు . గత పదేళ్లలో అదే జరిగింది అని అందరం అనుకుంటున్నాం .
Ads
తెలంగాణకు మొదటి ప్రమాద హెచ్చరిక
మొదటి కారణం : తెలంగాణ లోగోలో కాకతీయ ధ్వజం మాయం
రెండో కారణం : మాజీ దొర గారి బిడ్డ అస్తిత్వ చిహ్నం అయిన బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో మాయం
మూడో కారణం : గోదావరి జలాలు అక్రమంగా ఆంధ్రాకు తరలి పోతున్నాయి
నాలుగో కారణం : బిజెపి తాజా ఇండియా మ్యాప్ లో తెలంగాణ మాయం
- ప్రెస్ మీట్ నిర్వహించినాయన దొర సూచనల మేరకు ప్రపంచ తెలుగు సభలు జరిపాడు (తెలంగాణ సభలు కాదు)
సార్, మా సమ్మక్క సారలమ్మలను చంపింది అదే కాకతీయ తోరణం
మా దళిత బహుజన ఆడబిడ్డలతో నగ్నంగా బతుకమ్మ ఆడించింది అవే తెలంగాణ వెలమ రెడ్ల గడీలు
మీరంతా పొలిటికల్ గా ఒక స్టాండ్ తీసుకుంటే తీసుకోండి
చంద్రబాబు, ఆంధ్ర జ్యోతి, రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు తెలంగాణను మళ్లీ ఏపీ చేయబోతున్నారట
ఇన్ని త్యాగాలు చేసింది తెలంగాణను ఏపీ లో విలీనం చేయడానికా ?
అంత తేలికనా?
నా దృష్టిలో ఆంధ్ర జ్యోతి , చంద్రబాబు, కేసీఆర్ , రాజా సింగ్ , పవన్ కళ్యాణ్, ఈ ఐదుగురు బీజేపీ అనే విష మొక్కలకు కాపలాదారులు
పదేళ్ళు అందెశ్రీ పాట పక్కన పెట్టినప్పుడు, అదే పదేళ్లు ప్రత్యామయ గొంతుగా ఉంటే మీకూ మీ మాటకు ఒక విలువ
కాళేశ్వరం దగ్గర కవితా గోష్టి పెట్టి , అది కూలిపోయాక ఒక్క నివాళి కవిత ఎందుకు రాయలేదు సార్ ,
తెలంగాణ జాతి పితను కామారెడ్డిలో ఓడించి కాషాయ పట్టం కట్టారు
ఇప్పుడు కాషాయ రాజకీయాలకు తోరణాలు కడుతున్న మాజీ దొర పునరాగమనానికి ప్రెస్మీట్ పెట్టి, అదే తెలంగాణవాదం అంటే నమ్మలేము దొరా
రాజ్యం ఎప్పుడూ వంగి సలాం కొట్టే గులాబీలను తయారు చేయడానికే ఉంటది . రాజ్యం అంటే వంచన . అది ధిక్కరించిన వాడే మాట్లాడడానికి అర్హుడు .
పల్లకీలో వెలమ దొర ఉన్నా రెడ్డి దొర ఉన్నా మోసే బరువు పల్లకీ మోసేవాడికే తెలుసు . మీరు పల్లకీలో ఊరేగేవాడి కోసం కాకుండా, ఆ బరువు తరాలుగా మోస్తున్న బక్క జీవుల భుజం మీద బరువు తగ్గించే పని చేస్తే మీకొక విలువ గౌరవం సార్
మీ అవసరాల కోసం.. పైన ఉన్న ఇన్విటేషన్ లో కేసీఆర్ తాయిలాలు తీసుకోని మనిషి ఒక్కరైనా ఉంటే బాగుండేది . ( ఇద్దరు ముగ్గురు మినహా, వాళ్ళు BRS వేదిక share చేసుకోకుండా ఉంటే బాగుణ్ణు ) . తెలంగాణవాదం అడ్డుపెట్టి వంచక మాటలు వద్దు … డా. గుఱ్ఱం సీతారాములు
Share this Article