Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ‘జర్నలిజం’ ఓ గీత దాటితే… ప్రజలే ‘అదుపు బాధ్యత’ తీసుకుంటారు…

July 13, 2025 by M S R

.
ముందుగా ఓ ఉదాహరణ చెబుతాను… దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అహరహం కృషి చేసే పీఎఫ్ఐ కార్యకర్త… పేరు సిద్దిఖ్ కప్పన్…  ముసుగు జర్నలిస్టు… యూపీలో ఏదో అత్యాచార కేసులో పెట్రోల్ పోయడానికి వెళ్తుంటే యోగీ పోలీసులు తీసుకెళ్లి లోపలేశారు…

ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది… అవునూ, తను జర్నలిస్టు ఎలా అవుతాడు, ఓ ఉగ్రవాద మత కార్యకర్త అవుతాడు… ఆ సోయి సోకాల్డ్ గిల్డ్ పెద్ద తలలకు లేదెందుకు..? ఎందుకంటే..? అది అక్షరాలా పొల్యూట్ అయిపోయింది…

భావ ప్రకటన స్వేచ్ఛకూ… రాజకీయ కార్యాచరణకూ తేడా తెలియనంత అజ్ఞానపు చీకట్లలో అది కొనసాగుతోంది కాబట్టి…. ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే…  క్యూన్యూస్ అనబడే యూట్యూబ్ చానెల్ ఆఫీసు  మీద కేసీయార్ బిడ్డ కవితకు చెందిన జాగృతి కార్యకర్తలు దాడి చేసి… తుక్కు రేగ్గొట్టారు… మల్లన్న గన్‌మెన్ కాల్పులు జరిపాడు…

Ads

త్వరలో బీసీ పార్టీ పెడతాను అంటున్న మల్లన్న ధోరణి, భాష, వ్యవహారశైలి ఎలా ఉండాలి..? ఓ మహిళా ప్రజాప్రతినిధిని కించపరిచేలా ఉండాలా..? సరే….

అవునూ, ఇదీ మీడియా మీద దాడే అందామా…? ఒక సెటిల్మెంటు నేత… ఒక ప్రజాప్రతినిధి… సస్పెండ్ చేసేదాకా మొన్నటిదాకా ఓ పార్టీ నాయకుడు… తన అభిప్రాయాలు, అవసరాల కోసం నడిపించే ఓ డిజిటల్ మీడియాను మీడియాను పరిగణించాలా..? అది భావప్రకటన స్వేచ్ఛగా గుర్తించాలా…?

సాక్షి ఆఫీసులపై టీడీపీ క్యాంప్ దాడి… మహా న్యూస్ ఆఫీస్ మీద BRS camp దాడి… తాజాగా Qnews తీన్మార్ మల్లన్న ఆఫీసుపై కవిత జాగృతి కార్యకర్తల దాడి… .

ఇవి ఇక్కడ ఆగేట్టు లేవు… ఆగవు కూడా…. పార్టీ జర్నలిజానికీ, ట్రూ జర్నలిజానికీ నడుమ గీత చెరిగిపోయింది… ఎవరేమిటో జనానికి అర్థమైపోతోంది… ఇవన్నీ మీడియాపై దాడి అని సింపుల్గా చెప్పేట్టు కూడా లేదు…

https://muchata.com/wp-content/uploads/2025/07/WhatsApp-Video-2025-07-13-at-12.24.14.mp4

 

జర్నలిజం వేరు, ‘పార్టీ జర్నలిజం ‘ వేరు… తేడా ఏమిటో జనానికి కూడా అర్థం అవుతోంది… ఎస్ . మీడియా మీద దాడులా … సో వాట్ అని జనం లైట్ తీసుకునే సిట్యుయేషన్ స్థూలంగా జర్నలిజానికి ప్రమాదకరం… ఇవి అన్నీ స్వయంకృతాలే…

ఇకపై వ్యక్తిగత, రాజకీయ, స్వార్థ పోకడలకు మీడియా ముసుగులు చెల్లక పోవచ్చు… జనమే అదుపు బాధ్యతల్ని చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చు…. మీడియా ఫ్రెటర్నిటీగా బాధ అనిపించవచ్చు గానీ… ఇదంతా చేజేతులా చేసుకున్నదే… అవును, What is political journalism..? ఇదే ఓ పెద్ద ప్రశ్న ఇప్పుడు..?

అన్నట్టు… కవిత వెరీ సీరియస్ about her future politics .. what ever may come…. ఈ ధోరణి కనిపిస్తోంది… సరే, ఇదంతా పక్కన బెడితే… రాను రాను తమకు నచ్చని ఈ జర్నలిజం పోకడలపై జనం రాళ్లూ, కత్తులు, రాడ్లు, బరిసెలతో దాడులు చేస్తే… భావప్రకటన స్వేచ్ఛ కూడా పరార్ అవుతుందేమో… అవి అంతిమంగా నిజమైన జర్నలిజానికే దుర్దినాలు…

qnews

ఇవన్నీ స్వయంకృతాలు… కాదు, కాదు… ప్రజల చేతికి తీర్పు చెప్పే అధికారం దఖలు పరుస్తున్నది కూడా ఈ సోకాల్డ్ జర్నలిజమే… సో, ప్రతిదీ జర్నలిజం అని ముద్రలేయడం ఇకపై కదరదు…. ట్యూ న్యూట్రల్ జర్నలిజం, పార్టీ జర్నలిజం, మాఫియా జర్నలిజం, ఫేక్ జర్నలిజం, యూట్యూబ్ జర్నలిజం… ఆహా… రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని జర్నలిజాలో, ఎన్ని నిజాలో..!! RIP Journalism….

మీరు చూస్తూ ఉండండి… తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… ఇండియాలోని ప్రఖ్యాత జర్నలిస్టులు ఎవడూ మాట్లాడడు… రోజులు అలా ఉన్నయ్ మరి..!!

  • చివరగా…….. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ బీసీలతో కవితకు మంచం పొత్తా కంచం పొత్తా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడనేదే కదా ఆగ్రహం… ఎంత నీచమైన వ్యాఖ్యలు..? కాంగ్రెస్ పార్టీదేనా తనను పెంచి పోషించినందుకు నైతిక బాధ్యత..?!

.

కవిత క్యాంపు కాదు… చూడాలిక నల్గొండ కాంగ్రెస్ రెడ్లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో… రేవంత్ రెడ్డి ఇంకా ఉపేక్షిస్తాడా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తూర్పు సరిహద్దుల్లో ఇండియా సర్జికల్ స్ట్రయిక్స్… ఒక గ్రూపు ఖతం..!!
  • ఈ ‘జర్నలిజం’ ఓ గీత దాటితే… ప్రజలే ‘అదుపు బాధ్యత’ తీసుకుంటారు…
  • తెలంగాణతనానికి కాదు, దొరతనానికి సలాములు కొట్టే గొంతులు
  • వైవిజయ పులుసు టేస్టుకు నాటి ప్రేక్షకలోకం ఫ్లాటయిపోయింది..!!
  • గొప్ప నటుడు… ఆధిపత్య అహంకారాన్ని బాధతో భరించిన ఆర్టిస్టు కూడా…
  • జరిగేదంతా… జర్నలిజంతో ఘర్షణా..? ఏబీఎన్ రాధాకృష్ణతో ఘర్షణా..?
  • ఆ తల్లిది అలుపెరగని పోరాటం… 30 ఏళ్లుగా ఏ మార్గాన్నీ వదల్లేదు…
  • గుడ్ లోకేష్… వర్తమాన ఏపీ బూతు రాజకీయాల్లో నాలుగు మంచిమాటలు…
  • హమ్మయ్య… బీజేపీ మాధవుడు రాత్రికిరాత్రి తెలంగాణను మళ్లీ ఇచ్చేశాడు…
  • ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions