.
రేషన్ కార్డు విలువను పెంచాడు రేవంత్ రెడ్డి..!
పదేళ్లలో కేసీయార్ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని దుర్దినాల నుంచి… క్రమబద్ధంగా పరిశీలిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా రేషన్ కార్డును ఓ ఉపయుక్త కార్డుగా మలిచాయి…
జనాభా పెరుగుతోంది… పిల్లలు వేరుపడుతున్నారు… సొంత కుటుంబాలు ఏర్పడుతున్నాయి… కుటుంబ సభ్యులు పెరుగుతున్నారు… కానీ రేషన్ కార్డులు మాత్రం ఇవ్వలేదు దొరవారు… అదేమంటే లక్షల బోగస్ కార్డులున్నాయనే జవాబు ఆఫ్‌దిరికార్డుగా వినిపించేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో…
బోగస్ కార్డుల శిక్షను కొత్త కుటుంబాలకు విధించవద్దు కదా..? అదుగో ఆ సోయి కనిపించలేదు ఆ ప్రభుత్వంలో… బోగస్ అని తేలితే రద్దు చేయాలి, అది చేయలేదు… జనంలో వ్యతిరేకత వస్తుందని భయం… కొత్తవీ ఇవ్వలేదు… మొత్తానికి రేషన్ కార్డును ఓ విలువలేని కార్డుగా చేశారు కేసీయార్ హయాంలో…
Ads
- నిజంగా… ఓ దశలో అది అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే వాడబడింది… ఆధార్‌తో ఆ ఉపయోగమూ దూరమైంది… అంటే, తెల్ల రేషన్ కార్డు తెల్లబోయింది ఆ కాలంలో… చివరకు వాళ్లు ఇచ్చే రేషన్ దొడ్డుబియ్యం నాసిరకం… సగం మంది తీసుకునేవారే కాదు…
సో, ఆ బియ్యం డీలర్లకు కాసులపంట పండించేది… ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కట్ చేశారో.., పేరుకు వేరే ఏ నిత్యావసరాలూ ఇవ్వకుండా… కేవలం ఆ దొడ్డు బియ్యం కోసం, ఏటా ఇచ్చే ఓ నాసిరకం బతుకమ్మ చీర కోసం మాత్రమే రేషన్ కార్డు పరిమితమైంది…
ఆహార భద్రత కార్డు అది… అది ఉపయుక్తంగా ఉండాలి… నిజంగానే ఆహార భద్రత కల్పించేలా… అదీ తినదగిన ఆహారాన్ని అందించేలా ఉండాలి… ఆ దిశలోనే సన్నబియ్యం పంపిణీ స్టార్ట్ చేసింది రేవంత్ ప్రభుత్వం… అదీ 3 నెలల బియ్యం ఒకేసారి… ఈ నిర్ణయం ఎంత సాహసమో, ఆచరణలో ఎంత క్లిష్టమైనా ఎలా సక్సెస్ చేస్తున్నారో ఆల్రెడీ ఓసారి చెప్పుకున్నాం…
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే… రేషన్ కార్డులకు (తెల్లవి) సిక్స్ హామీల్లో కొన్నింటికి లింక్ చేశారు… 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు… సగం ధరకే గ్యాస్ సిలిండర్ వంటివి… మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 పంపిణీ త్వరలో అమలు చేస్తారు…
దీంతో బియ్యం కోసమే కాదు, ఇతర ప్రభుత్వ పథకాలకూ ఇదే కార్డు ప్రామాణికమై పోయింది… దీని అసలు విలువ జనానికి తెలిసొచ్చింది... ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఇప్పుడు కేవలం ఆహార భద్రత మాత్రమే కాదు, జీవనభద్రత... లక్షల కుటుంబాలకు..!! బహుశ ప్రయోజనకరం...
ఎప్పుడైతే సన్నబియ్యం కూడా స్టార్ట్ చేశారో, జనం బియ్యం కూడా తీసుకోసాగారు… ఇప్పుడు సీఎంఆర్ఎఫ్‌కు, రైతు రుణ మాఫీకి, చేనేత రుణ మాఫీకి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కూడా రేషన్ కార్డు ఉపయుక్తమే… ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఇదే తెల్ల రేషన్ కార్డే ఉపయోగం… (రైతు భరోసాకు కాదు)…
ఎస్, దాదాపు 92 లక్షల కార్డులుండేవి తెలంగాణలో… ఇప్పుడు కొత్తగా 3.58 లక్షల కార్డులను జారీ చేస్తున్నారు, ఇంకాస్త పెరగొచ్చు సంఖ్య… రెండు రకాలు… ఏపీఎల్, బీపీఎల్… తెలంగాణ ఏర్పడ్డాక ఈ సంఖ్యలో కొత్త కార్డులు జారీ చేస్తుండటం, అనేక పథకాలకు అనుసంధానం చేసి ఉండటం ఇదే ప్రథమం…
- ఖజానాలో డబ్బుంటే, అనుమతిస్తే… బియ్యమే కాదు, బేసిక్ నిత్యావసరాలనూ లింక్ చేస్తే సగటు పేదవాడికి, దిగువ మధ్యతరగతికీ అదే పదివేలు… బోగస్ కార్డులు అంటారా..? నిజంగా తొలగిస్తే ఖజానాకు, సొసైటీకి కూడా మేలు..!!
Share this Article