.
డిస్‌క్లెయిమర్ :: తీన్మార్ మల్లన్న భాష, సెటైర్ల తీరు, రాజకీయ వ్యవహారశైలి, ఎజెండా మీద ఎవరికైనా చాలా అభ్యంతరాలు ఉండొచ్చుగాక… దాని గురించి ప్రస్తావన కాదు ఇది…
కేవలం ‘కంచం పొత్తు- మంచం పొత్తు’ అని తను వాడిన సామెత కరెక్టా కాదా..? అందులో బూతు ఉందా..? తప్పుడు అర్థాలున్నాయా..? ఇదీ అంశం… ఒక్కటి మాత్రం నిజం… సహ ఎమ్మెల్సీ, అందులోనూ ఓ లేడీ లీడర్ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ సామెత వాడటం సరికాదు…
Ads
ఎందుకంటే..,? ఈతరంలో చాలామందికి, అంతెందుకు చాలామంది తెలంగాణ వాళ్లకే ఈ సామెత తెలియదు… అదొక బూతుగా భావిస్తున్నారు కాబట్టి… అంతా మాకు తెలుసు అనుకునే సోషల్ మీడియా ట్రోలింగ్ తరం ఇది… సో, సంయమనం పాటించి ఉండాల్సింది…
బీసీ ఎజెండాను కవిత ఎత్తుకోవడం కూడా తప్పు కాదు… సరే, అదంతా రాజకీయం… ఇక్కడ అప్రస్తుతం… ఒకవేళ తన వ్యాఖ్య తప్పుడు అర్థంలో సమాజంలోకి వెళ్లి ఉంటే, ఎవరైనా అపార్థం చేసుకుని ఉంటే క్షమించండి అని తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చెప్పి ఉంటే హుందాగా ఉండి ఉండేది…
అవునూ, ఇంతకీ అది బూతా..? కాదు… దాన్ని అర్థం చేసుకోవడంలో తప్పుంది… కంచం పొత్తు అంటే సహపంక్తి… మంచం పొత్తు అంటే శారీరకం కాదు, వియ్యం… అంటే మా కులమా..? మా గోత్రమా..? అని అడగడం మాత్రమే… అది అర్థం కానివాళ్లకు చెప్పినా వేస్ట్…
తీన్మార్ మల్లన్నే తన వ్యాఖ్యలకు… అంటే ఆ సామెత బూతు కాదని చెప్పడానికి ఓ వీడియో రిలీజ్ చేశాడు… అందులో ఏమంటున్నాడు..?
సాక్షాత్తూ కేసీయార్ ముందుమాట రాసి అభినందించిన ఓ పుస్తకం… అందులో తెలంగాణ సామెతలు… ఈ సామెత ఏ పేజీలో ఉందో కూడా చెబుతూ, ఆ పేజీని చూపించాడు తీన్మార్ మల్లన్న తన వీడియోలో… 1475వ సామెత… కంచం పొత్తే గానీ మంచం పొత్తు లేదు… ఇదీ ఆ సామెత…
దాని వివరణ సంక్షిప్తంగా పైన చెప్పింది… కొన్ని కులాల్లో వాడుతుంటారు… నీకూ నాకూ చుట్టరికం ఏముందిరబై అని చెప్పడానికి..!
అయితే… తోటి మహిళా ప్రజాప్రతినిధిని ప్రస్తావించినప్పుడు… మంచం పొత్తు అనడం తప్పే… ఎందుకంటే, ప్రజెంట్ తరానికి ఆ సామెత ఏ సందర్భంలో, ఏ అర్థంలో వాడతారో తెలియదు… తప్పుడు అర్థాలు జనంలోకి వెళ్తాయి…
ఆ సామెత వాడినప్పుడు మీకూ మాకూ అని ఉంటే పెద్దగా వేరే అర్థం వచ్చి ఉండేది కాదు… నీకూ నాకూ అనడంతో తప్పుడు అర్థం ధ్వనించింది చాలామందికి… ఆమె అభిమానం, గౌరవం హర్టయ్యాయీ అనడంలో అర్థముంది… అదే సమయంలో ఆమె క్యూన్యూస్ మీద ఏకంగా దాడి చేయించడమూ తప్పే…
కోపాన్ని నిగ్రహించుకుంటేనే రాజకీయాల్లో ఎదుగుదల… ఆగ్రహప్రదర్శన సరైన వేళలో సరైన రీతిలో ఉండాలి… ఎస్, గన్‌మెన్ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది..? ఏ స్థితిలో, అంటే సిట్యుయేషన్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందా..? ఏమో… తెలంగాణ పోలీసులే తేల్చాలి…!!
Share this Article