Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…

July 15, 2025 by M S R

.

Murali Buddha …. ఏంటీ ? క్యాబినెట్ ఇన్సైడ్ సమాచారం కోసం పరుగులా ? కాదు … ఈ సమయంలో అమెరికాలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందామని … ప్రశ్న అడిగింది పూసపాటి అశోక గజపతి రాజు వ్యంగ్యంగా బదులిచ్చింది నేను …

ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశం అంటే రిపోర్టర్లకు తెగ హడావుడి ఉండేది … ఓ పది మంది మంత్రులను కలిస్తే కానీ విషయం తెలిసేది కాదు .. సచివాలయం నుంచి కొందరు మంత్రులు ఎన్టీఆర్ భవన్ కు వచ్చారని తెలిసి ఎవరో ఓ మంత్రిని పట్టుకొని సమాచారం లాగాలి అని వేగంగా ఎన్టీఆర్ భవన్ మెట్లు ఎక్కుతుంటే … ఎదురుగా అశోక గజపతి రాజు …

Ads

క్యాబినెట్ సమాచారం కోసం వెళుతున్నారా అని అడిగారు … ఆయన మంత్రే అయినా క్యాబినెట్ లో ఏం జరిగిందో ఆయనను ఏ ఒక్క రిపోర్టర్ కూడా అడగరు .. ఎందుకంటే ఆయన చెప్పరు ….

తన రాజకీయ జీవితం మొత్తంలో ఒకే ఒకసారి క్యాబినెట్ ఇన్సైడ్ సమాచారం మీడియాకు చెబితే ఎవరూ రాయలేదని … ఇక ఎవరికీ చెప్పను అని చెబుతుంటారు … స్థానిక ఎన్నికల్లో ఇద్దరు సంతానం నిబంధన కావచ్చు . ఇదొక్కటే తన జీవితంలో చెప్పానని ఐతే ఎవరూ నమ్మలేదు ఎవరూ రాయలేదు అని చెప్పారు .

క్యాబినెట్ ఇన్సైడ్ గురించి ఆయన్ని ఎవరూ అడగరు ఆయన చెప్పరు … దానితో ఆయన ఎదురు పడి క్యాబినెట్ సమాచారం కోసమా ఆ పరుగు అని పలకరిస్తే, కాదు అమెరికాలో ఇప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందామని అని సమాధానం ఇచ్చాను …

ఆయన వెంటనే అమెరికాలో వాతావరణం ఎలా ఉందో ? ఏ ప్రాంతంలో ఎలా ఉంటుందో ? ఏ కాలంలో వాతావరణం ఎలా ఉంటుందో సుదీర్ఘంగా వివరించారు .. ఆ పరిజ్ఞానానికి బాబోయ్ అనిపించింది …

ఓ రోజు తెలుగుదేశం శాసనసభాపక్షం కార్యాలయంలో mla లు మీడియా పిచ్చా పాటి మాట్లాడుకుంటుంటే …
ఈ సంగతి చెప్పాను … నేనేదో వ్యంగ్యంగా అమెరికా వాతావరణం తెలుసుకోవడానికి అని చెబితే ఆయన అక్కడి వాతావరణం గురించి సుదీర్ఘంగా చెప్పిన విషయం ప్రస్తావించి ఎంత నాలెడ్జ్ అని గొప్పగా చెప్పాను …

అంతా విన్న విజయనగరం జిల్లా mla ఒకరు అసహనంగా … ఎంత నాలెడ్జ్ ఉంటే ఎందుకు సార్ … జిల్లాకు ఏమైనా ఉపయోగపడాలి కదా ? ఈయనకు తప్ప ఇంకొకరికి మంత్రి పదవి ఇవ్వరు, ఈయన ఎవరికీ పనులు చేయరు అని అసహనంగా చెప్పి వెళ్లి పోయాడు …

  • అశోక గజపతి రాజు గోవా గవర్నర్ అనగానే… ఇక గోవా మనదే అక్కడ వాలిపోవాలి అన్నట్టు కొన్ని పోస్ట్ లు చూసి గుర్తుకు వచ్చింది …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బిగ్‌బాస్ విన్నర్ కల్యాణ్ పడాల… ఈసారీ నో లేడీ విన్నర్…
  • లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ కరువు… కానీ గీతదాటితే మెలోడ్రామాతో సినిమా మటాషే…
  • విద్వేష ప్రసంగాలపై ఉక్కుపాదం… సిద్ధరామయ్య బాటలో రేవంత్ రెడ్డి…
  • హైదరాబాదులో మెరిసిన మోనాలిసా..! అంతా విధి మాయ… ఇంట్రస్టింగ్ ఏమిటంటే..?!
  • రేవంత్ రెడ్డి బాణాలు గట్టిగానే తగిలాయి… కారులో ముసలం మొదలైంది…
  • త్రోబ్యాక్… అప్పట్లోనే సెన్సేషన్… బికినీ షూట్ వెనుక రాధ “స్ట్రగుల్”!
  • అదరహో ‘దహిబరా ఆలూదమ్’… కటక్ స్ట్రీట్ ఫుడ్‌కు టేస్టీ అవార్డు…
  • రఘుపతి రాఘవ రాజారాం… గాంధీమార్గం స్పూర్తితో ఓ నవభారతం…
  • ఛావా, పుష్ప2 బలాదూర్… ‘ధురంధర్’ అన్ని రికార్డులూ పగలగొడుతున్నాడు…
  • Bhavana… ఈ కుళ్లు వ్యవస్థతో పోరాడుతున్నఓ రియల్ స్టార్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions