Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘గలీజు పోరి… అప్పుడప్పుడూ స్నానం చేయాలమ్మా నిత్యామేనన్…’’

July 17, 2025 by M S R

.

సెలబ్రిటీలు కాస్త ఆచితూచి మాట్లాడాలి… ఏదో ఒకటి అనాలోచితంగా మాట్లాడితే ఆనక తలనొప్పులు, ట్రోలింగు తప్పదు ఈరోజుల్లో… ఇదీ అలాంటిదే… కాకపోతే కాస్త నవ్వు పుట్టించేది…

నిత్యామేనన్… అందరికీ తెలిసిన నటే… కాస్త పద్దతైన నటి… విచ్చలవిడి కేరక్టర్ కాదు… ఐతే ఆమధ్య లావు పెరిగి, దేహం మీద అదుపు తప్పి, చాన్సులు రాక వెనుకబడిపోయింది… ఐనా సరే నో రిగ్రెట్స్ అంటుందామె… పెద్దగా అవకాశాల కోసం వెంపర్లాడి, ఎక్కడా సాగిలబడే బాపతు కాదు.,.

Ads

తెలంగాణ ఆడపడుచుగా… లేడీ పవర్ స్టార్ పేరు తెచ్చుకున్న సాయిపల్లవి కశ్మీర్ ఊచకోతల్ని, గోహంతకుల హత్యల్నీ ఒకేగాటన కట్టేసి, హిందూ సంఘాల ఆగ్రహానికి గురైంది… నిజానికి పిచ్చిది, తనకు తెలుగు పూర్తిగా రానప్పుడు, తన అభిప్రాయాల్ని తెలుగులో చెప్పాలనుకోవడం తప్పు. తనేం చెబుతుందో సరిగ్గా కన్వే గాక అడ్డంగా బుక్కయింది…

నిత్యామేనన్ తాజాగా విజయ్ సేతుపతితో తలైవాన్ తలైవి (సార్ మేడమ్) అనే సినిమాతోపాటు ఇడ్లీ కడై సినిమా కూడా చేస్తోంది… అంటే ఇడ్లీ పాత్ర… ఆ షూటింగులో పేడతో పిడకలు చేయమన్నారట సినిమా టీం… ఛీ, థూ, యాక్, నేను పేడ పట్టుకుని పిడకలు చేయాలా అని పిచ్చి వేషాలు వేయకుండా, ఓ గ్రామీణ యువతి వేషం కాబట్టి ఎంచక్కా పిడకలు చేసే సీన్లు యాక్ట్ చేసిందట…

ఆమే చెప్పుకుంది లెండి… తరువాత మరుసటిరోజే జాతీయ అవార్డు తీసుకోవడానికి వెళ్లిందట, అప్పటికి తన గోళ్లలో ఆ పేడ అవశేషాలు అలాగే ఉన్నాయట, అద్భుతంగా అనిపించిందట… ఆహా ఇడ్లీ కడై పాత్ర చేయకపోతే ఈ అనుభూతి దక్కేదా అని అలౌకికానందంలో మునిగితేలుతోంది…

మెంటల్… అంటే ఈ పోరికి సరిగ్గా స్నానం చేయడం కూడా రాదా..? గోళ్లలో పేడ అలాగే ఉందంటే నీ శుభ్రత స్థితేమిటో తెలుస్తోంది, గలీజు పోరి, అప్పుడప్పుడూ స్నానం చేయాలమ్మా అని ట్రోలింగ్ స్టార్ట్… దొరికితే వదలదు కదా సోషల్ మీడియా…

అఫ్‌కోర్స్, కొందరు మాత్రం హబ్బ, ఎంత కమిట్మెంటు అని చప్పట్లు కొడుతున్నా సరే… ఆ వ్యాఖ్యలు మాత్రం అనాలోచితం… సాయిపల్లవికి అమ్మ, అమ్మమ్మ టైపు ఉన్నట్టుంది ఈమె..!! పైగా గోళ్లలో పేడతో మంచి అనుభూతి కలిగింది అని ఇస్టేట్‌మెంట్లు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కరప్ట్ కాళేశ్వరం…! నిధి నిక్షేపంగా తవ్వుకున్నారు… దొరికితే వందల కోట్లే..!!
  • ‘‘లోకేష్‌తో కేటీఆర్ గుప్తబంధం దేనికి…, చీకటి కలయికల కుట్రలేమిటి..?’’
  • ‘‘గలీజు పోరి… అప్పుడప్పుడూ స్నానం చేయాలమ్మా నిత్యామేనన్…’’
  • వావ్… బనకచర్లపై జగన్ కూడా మాట్లాడుతున్నాడు గ్రేట్…
  • బనకచర్లపై ఇన్నాళ్ల తెలంగాణ పకడ్బందీ వ్యూహానికి ఆ లేఖతో నష్టం!
  • న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!
  • ఆహా రష్మిక… అనాలనిపించింది ఈ ‘నదివే’ పాట చూడగానే…
  • రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…
  • కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…
  • కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions