Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో వాట్..? శింబూ హీరో కావచ్చు, క్రికెట్ సూపర్ స్టార్‌కు తెలియాలా ఏం..?!

July 18, 2025 by M S R

.

ఓ కథ చాలాసార్లు చదివే ఉంటారు, మరొక్కసారి… ఓసారి అమితాబ్ బచ్చన్ తన కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు విమానంలో ఎక్కడికో వెళ్తున్నాడు… తన పక్క సీటులో ఒకాయన… సింపుల్ డ్రెస్… బాగా చదువుకున్న ఓ మధ్యతరగతివాడిలా ఉన్నాడు…

ఇతర ప్రయాణికులు అమితాబ్‌ను గుర్తుపట్టి షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు… విమానంలో కోలాహలం… అప్పటికింకా సెల్ఫీల ట్రెండ్ రాలేదు… కానీ ఆ పక్క సీటు వ్యక్తి మాత్రం ఏ స్పందనా లేకుండా న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు… కిటికీలో నుంచి బయటికి చూస్తూ, తనకు సర్వ్ చేసిన టీ చప్పరిస్తున్నాడు…

Ads

అమితాబ్ అహం గాయపడింది… తమాయించుకుని చిరునవ్వు మొహాన పులుముకుని ఆయన్ని హలో అని పలకరించాడు… ‘మీరు సినిమాలు చూస్తుంటారా’ అనడిగాడు… ‘చాలా తక్కువగా, ఎప్పుడో ఓసారి, అదీ చూసి చాలా ఏళ్లయింది’ అని బదులిచ్చాడాయన ముక్తసరిగా…

‘నేను సినిమాల్లోనే పనిచేస్తుంటాను’ అన్నాడు అమితాబ్… ‘ఓహ్, గుడ్, ఏం చేస్తుంటారు’ అనడిగాడు ఆయన…

‘నేను నటుడిని’

‘సూపర్’ అని మళ్లీ న్యూస్ పేపర్‌లో మొహం పెట్టాడు ఆయన… అమితాబ్ ఆయనకు షేక్ హ్యాండ్ చేస్తూ ‘నా పేరు అమితాబ్ బచ్చన్’ అన్నాడు అలాగైనా గుర్తుపడతాడేమో అనుకుని… ‘‘ఓ నైస్, గుడ్ టు మీట్ యు, నా పేరు రతన్ టాటా’’ అన్నాడు ఆయన… ఇక అమితాబ్ మాట్లాడలేదు…

ఈ కథను పదే పదే ఎందుకు చెబుతారంటే… జస్ట్, అలా చూసి ఎదుటివాడిని అంచనా వేయలేం… ప్లస్ ఒక రంగంలో ఎంత ప్రముఖుడైతేనేం, మరోరంగంలోని వ్యక్తిని తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి…

సరే, ఇదెందుకు చెప్పుకోవడం అంటే..? ఓ వార్త కనిపించింది… ఇదీ…



shimbu

స్టార్స్ అయినంత మాత్రాన అందరూ వారిని గుర్తుపట్టాలని ఏమీ లేదు… కానీ, ఒక హీరో తనను తాను హీరోను అని ఓ స్టార్ క్రికెటర్‌కు చెప్పుకున్నా సరే, ఎదుటివాడు గుర్తుపట్టక… ఓహో, ఐతే సరే, అని తన మానాన తాను వెళ్లిపోవచ్చు… తమిళ హీరో శింబు చెప్పిన స్వీయానుభవమే ఇది…

తాజాగా ఒక ఇంటర్వ్యూలో… ‘’ఒకసారి విరాట్ కోహ్లీని కలిశాను. నాకు నేనే పరిచయం చేసుకున్నాను. నా పేరు శింబు.. హీరోగాచేస్తున్నాను అని చెప్పాను. అయితే అతను మాత్రం క్షమించండి.. మీరెవరో నా తెలియదు అంటూ వెళ్ళిపోయాడు…’’ అని చెప్పుకొచ్చాడు… తరువాత ఆర్సీబీకి వర్క్ చేశాడట, ఇప్పటికైనా కోహ్లీకి నేను తెలుసో లేదో అంటున్నాడు…

వీర ఫ్యాన్స్ ఉంటారు కదా… కోహ్లీకి ఎంత పొగరు అని వ్యాఖ్యానాలు స్టార్ట్ చేశారు… శింబుకు అవమానం అని తీర్మానించేశారు… కానీ కోహ్లీకి శింబు గురించి తెలియాలని ఏముంది..? తను పాన్ ఇండియా స్టార్ కూడా కాదు… ఏదో ఓ సెకండ్ లేయర్ హీరో… ఐనా సినిమాల్లో అన్ని భాషల నటులు కోహ్లీకి ఎలా తెలుస్తారు..? హిందీ నటులు కొందరు తెలుసేమో… పెళ్లాం బాలీవుడ్ నటి కాబట్టి…

తనకు ఓ వివ్ రిచర్డ్స్, ఓ మాల్కం మార్షల్, ఓ స్టీవ్ వా, ఓ మెక్‌గ్రాత్ దగ్గర నుంచి ప్రజెంట్ క్రికెటర్ల దాకా తెలుస్తుంది… ఐనా ఒక రంగంలో స్టార్‌కు మరో రంగంలోని స్టార్ తెలియాలని ఏముంది..? అసలు శింబును ఇది ఎవడు చెప్పుకొమ్మన్నాడు..? కోహ్లీ క్రికెట్‌లో అన్ని దేశాల వాళ్లూ ప్రేమించే స్టార్… పీవీ సింధు, సానియా మీర్జా, మేరీ కామ్, నీరజ్ చోప్రా, మను భాకర్‌లను అడిగి చూడండి, శింబు ఎవరు అనే అంటారు వాళ్లు కూడా…! జస్ట్, ఉదాహరణకు చెబుతున్నాను…

ఓసారి ఇలాగే నిత్యామేనన్ కావచ్చు, ప్రభాస్ ఎవరు అనడిగింది ఏదో ఇంటర్వ్యూలో… దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయి ఆమెను నిందించారు… అప్పటిదాకా ఆమెది ఓ చిన్న ప్రపంచం జస్ట్, మాలీవుడ్, తనూ అప్పటికి చిన్ననటి… నిజంగానే ప్రభాస్ తెలియకపోవచ్చు కదా, అది అవమానం ఎలా అవుతుంది..? సో, శింబూ, పర్లేదు, అందులో అవమానం లేదు…



అన్నట్టు… పైన మొదట్లో చెప్పుకున్న అమితాబ్, రతన్ టాటా కథ కరెక్టేనా..? కాకపోవచ్చు… ఎందుకంటే..? ఓసారి నిజంగానే వాళ్లు విమానంలో సహప్రయాణికులుగా లండన్ వెళ్లారు… అమితాబే చెప్పాడు ఈ సంఘటన…

‘‘లండన్‌ హీత్రో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాం… రతన్ టాటాకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారు సమయానికి కనిపించలేదు. దీంతో వారికి ఫోన్ చేసేందుకు రతన్ టాటా సమీపంలో ఉన్న ఫోన్ బూత్‌కు వెళ్లారు… ఆ పక్కనే నేను నిలబడి ఉన్నాను… ఆ తర్వాత నా వద్దకు రతన్ టాటా వచ్చారు… అమితాబ్.., నేను మీ దగ్గర కొంత డబ్బు ఇవ్వగలరా, ఫోన్ చేయడానికి నా వద్ద నగదు లేదు అన్నారు…” సో, తనకు అమితాబ్ తెలుసు అనేది ముక్తాయింపు..!!

అన్నట్టు శింబూ… టి.రాజేందర్, అంటే మీ తండ్రి బహుముఖ ప్రజ్ఞావంతుడు, గతంలో ఆయన సినిమా ప్రేమసాగరం చూసి అభిమానించాం… ప్చ్, నీ సినిమా ఒక్కటీ చూడలేదు… చూడాలనిపించే సినిమా ఒక్కటీ చేయకపోతివి… ఫాఫం, మా తెలుగువాళ్లకూ నువ్వు పెద్దగా తెలియదు, కోహ్లీ దాకా ఎందుకు..?!

మరో విషయం…  కోహ్లీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘పాతా థాలా’ చిత్రంలోని ‘నీ సింగం ధన్’ పాట తనకు ఇష్టమైన సాంగ్‌ అని చెప్పాడు.., దానిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాలో షేర్ చేసింది.., శింబు దానికి స్పందిస్తూ కృతజ్ఞతతో రీపోస్ట్ చేశాడు… అసలు కోహ్లీ బయోపిక్‌లో శింబు నటించబోతున్నాడనే ప్రచారమూ జోరుగా సాగింది… తీరా చూస్తే కోహ్లీకి అసలు శింబు ఎవరో తెలియదు… వావ్, క్యా బాత్ హై…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
  • ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
  • ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
  • సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?
  • మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…
  • ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్‌..!!
  • అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!
  • చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…
  • నెవ్వర్… నో వే… ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!
  • మోడీ, పాడి రైతు పొట్టగొట్టకు… ఆ ట్రంపుడు అలా బెదిరిస్తాడు, బెదరకు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions