ఆకాశం నీలంగా ఉంది
అవును, పొద్దున పచ్చగా ఉండేది
సీక్రెట్ కోడ్ సక్సెస్, క్యాష్ తెచ్చావా
కాస్త రేటు తగ్గించుకోరాదా ప్లీజ్
లేదు, సరుకు కొరత, రేటు తగ్గదు
సరే, సరే, కానీ సరుకు పొడిచేదెవరు
ఇన్సులిన్ పొడుచుకోవడం లేదా, సేమ్
డన్, కోవాగ్జిన్ సరే, రెమ్‌డెసివర్ కావాలి
నో, ఆ గ్యాంగు వేరు, మాకు లింకుల్లేవ్
కనీసం ఒక్క ఆక్సిజన్ సిలిండర్ ప్లీజ్
అది మరీ లోకల్ గ్యాంగుల దందా
వాటి కోసం ఎవరి కాళ్లు పట్టుకోవాలో
అక్కర్లేదు, కంటాక్టులు చెబుతా, వెళ్లు
థాంక్స్ భాయ్, నీ రెఫరెన్స్ చెప్పనా
వద్దు, వాట్సప్ కాల్ మాత్రమే చేయి
నిన్న సోషల్ మీడియాలో భలే పేలిన కార్టూన్… నిజంగా పరిస్థితి ఇలాగే ఉంది… అతిశయోక్తి అనిపిస్తున్నదా..? నిజానికి కరోనా పేరిట అనేక గ్యాంగులు కుమ్మేస్తున్నాయి… ప్రభుత్వాల చేతకానితనం, పాలసీ వైఫల్యాల కారణంగా పెద్ద పెద్ద ఫార్మా మాఫియాలు, కార్పొరేట్ హాస్పిటల్ మాఫియాలు, బడా డ్రగ్ డాన్లు మాత్రమే కాదు… చివరకు ఒకటీరెండు రెమ్డెసివర్లు అమ్ముకునే చోటామోటా గ్యాంగుల దాకా… బ్రోకర్లు, కమీషన్ ఏజెంట్లు, బ్లాక్ మార్కెటీర్లు, స్టాకిస్టులు, ట్రాన్స్పోర్టర్లు, పెడ్లర్స్, హాకర్స్… ఒక్కముక్కలో చెప్పాలంటే… గాంజా, హెరాయిన్ మత్తుమందుల రాకెట్లు బలాదూర్… నకిలీ మందులు, బ్లాకులో మందులు, అడ్డగోలు రేట్లు… చివరకు అనేకమంది డాక్టర్లు కూడా… బెడ్లు దొరకవు, ఆక్సిజన్ దొరకదు, మందులు దొరకవు, వేక్సిన్ దొరకదు,… కాదు, కాదు, అన్నీ దొరుకుతయ్… లక్షల డబ్బు, సరైన సోర్స్ ఉండాలి, అంతే…
Ads
ఆక్సిజన్ లేదు, ఇష్టముంటే చేర్చండి
అదే లేకపోతే చికిత్స కష్టం కదా సార్
మీరు బయటి నుంచి తెప్పించుకొండి
సరే, అర్జెంటుగా చేర్చుకొండి సార్ ప్లీజ్
ఐసీయూ అయితేనే చేర్చుకుంటాను
అదేమిటి..? అంత ప్రాణం మీదకొచ్చిందా
కాదు, అందులోనే బెడ్లు ఖాళీగా ఉన్నయ్
సరే, ఏం చేస్తాం, చేర్చుకొండి, మరి రేటు..
రోజుకు 50 వేలు, మందులు, టెస్టులు అదనం
మేం బయటి నుంచి తెప్పించుకుంటాం
కుదరదు, ఒక్కో రెమ్‌డెసివర్ 35 వేలు
ఆస్తులమ్మాలా, అప్పులు చేయాలా సార్
టోస్లిజుమాబ్ ఇంజక్షన్‌కు 60 వేలు
పాడు కరోనా, ప్రాణంకన్నా ఎక్కువా..? సరే…
మొత్తం బిల్లు కడితే తప్ప డెడ్ బాడీ ఇవ్వం
అదేమిటి… శవ అప్పగింతల దాకా వెళ్లారు
ముందే చెబుతున్నా, తరువాత తగాదా వేస్ట్
^^^^^^^^^^^^^^^^^
ఈ సంభాషణ అర్థమైంది కదా… అదీ పరిస్థితి… వందల కోట్లు, వేల కోట్లు, దేశం మొత్తమ్మీద లక్షల కోట్లు… అన్ని మాఫియాలు కలిపి…. ఎవడికి అందినకాడికి వాడు… మన ప్రభుత్వాలు, వాటి పాలసీలు, యవ్వారాలు, అన్నింటికీ మించి ఔషధ, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ తదితర శాఖల్ని చూసే దిక్కుమాలిన ఉన్నతాధికారుల పుణ్యమాని వేల రెట్లు పెరిగిపోయిన విపత్తు తీవ్రత… సారీ, వాళ్ల పనిలో వాళ్లున్నారు… ఆల్టర్నేట్ మెడిసిన్, ఎఫెక్టివ్ చీప్ మెడిసిన్, టెలి మెడిసిన్, హోం ట్రీట్మెంట్, వేక్సినేషన్ మిషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్…. సారీ, ఈ పదాలకు అర్థాలు తెలియని అధికారులు కూడా బోలెడు మంది… 20 రూపాయల ఐవర్‌మెక్టిన్ పనిచేస్తుందిరా బాబూ అంటే వినరు, 30 వేల రెమ్డెసివరే కావాలి… ఎందుకు..? అర్థమైంది కదా..! అవునూ, పెద్ద పెద్ద లీడర్లు, బడా బడా సాహెబులు మరణిస్తున్నారు గానీ, ఈ మాఫియాలలో ఒక్కడూ చావడు దేనికి..? ఎందుకంటే కరోనా వాళ్ల భాగస్వామి కాబట్టి… ఇలాంటి వాళ్లే తనకు మరింత బలం కాబట్టి… వీళ్లు కుటుంబాల ఆర్థికం మీద కొడతారు… కరోనా ఆరోగ్యం మీద కొడుతుంది… వాళ్ల మీద కరోనాకు అందుకే ప్రేమ… అంతే…!!
Share this Article