.
ప్రేరణ… కన్నడ, తెలుగు బిగ్‌బాస్ ఫేమ్… టీవీ నటి… కాస్త టెంపర్‌మెంట్ ఎక్కువే… మనసులో ఉన్నది కక్కేస్తుంది… పుట్టింది హైదరాబాదే, కానీ పెరిగింది, కెరీర్ మొదలుపెట్టిందీ కన్నడ…
రష్మిక… పరిచయం అక్కర్లేదు… కన్నడం నుంచి మొదలై ఎక్కడికో వెళ్లిపోయింది… దేశంలోనే టాప్ రేటెడ్ యాక్ట్రెస్ ఇప్పుడు… ఈ ఇద్దరూ ఫ్రెండ్స్… కలిసి తిరిగేవాళ్లు అవకాశాల కోసం… ఒకేచోట ఉన్నారు కొన్నాళ్లు…
Ads
డెస్టినీ అంటే ఇదే… ఈమె జస్ట్ ఈరోజుకూ టీవీ నటి మాత్రమే… ఆమె రేంజ్ తెలిసిందే… బిగ్ టీవీలో కిస్సిక్ అని టీవీ కమెడియన్ వర్ష ఓ షో చాట్ షో హోస్ట్ చేస్తుంటుంది కదా… ఈసారి గెస్టు ప్రేరణ… సహజంగానే రష్మికతో దోస్తానా గురించీ ప్రశ్న వస్తుంది కదా, వచ్చింది…
‘మీరు మంచి ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు ఎప్పుడైనా కలిస్తే తనకు గుర్తుంటుందా..,?’ ఈ ప్రశ్నకు ప్రేరణ జవాబు ‘ఒకప్పుడు’… అంటే, కలయికల్లేవు, మాటల్లేవు… ‘‘ఒకప్పుడు మా రెండు ఫ్యామిలీస్ అనుకునేవి, నేను తెలుగులో స్టార్ అయితే, తను కన్నడంలో స్టార్ అయితే, ఇద్దరమూ కలిసి ఓ మల్టీ స్టారర్ టైపు సినిమా చేద్దామని… కానీ ఇప్పుడు..?’’ అదీ ప్రేరణ బాధ…
‘రేయ్, ఓసారి కలవరా నన్ను..?’ అని కెమెరాను చూస్తూ రష్మికకు ఓ మెసేజ్ పంపించింది… రష్మిక బాగా ఎదిగిపోయింది నిజమే, ఈ వీడియో బిట్లు, చాట్ షోలు చూసే సీనుందా ఆమెకు ఇప్పుడు..? సరే, ఎవరి అదృష్టం వాళ్లది… కానీ ఒకప్పటి దోస్తులను కూడా మరిచిపోయేంతగా మారిపోయిందా..? కనీసం ఒక కాల్, ఒక పలకరింపు… నిల్…
కడుపులు మాడ్చుకుంటూ, అవకాశాల కోసం కలిసి తిరిగినవాళ్లే కదా… ఖాళీగా ఉన్నప్పుడో, బాధలో ఉన్నప్పుడో, విజయం వేళ గానీ, మనసు వికలం వేళ గానీ… వాళ్లే కదా పదే పదే గుర్తొచ్చేది… ఏమో… మా ఇంటికి వెళ్లక ఏడాదిన్నర అవుతోందనీ, ప్రతి వారంతం కోసం ఏడుస్తాననీ, నాకన్నా 16 ఏళ్లు చిన్నదైన తన చెల్లెను ఎనిమిదేళ్లుగా మిస్సవుతున్నాననీ ఈమధ్యే ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకుంది…
‘‘ఇంతకుముందు ఏవైనా టూర్స్ ప్లాన్ చేస్తే నా ఫ్రెండ్స్ నాకు చెప్పేవాళ్లు, నేను రావడం లేదని ఇక చెప్పడమే మానేశారు… నా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నాను, నా సొంత ఊరును కూడా మిస్సవుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది… ఇక ఈ స్థితిలో ప్రేరణతో ఆ పాత బంధం, స్నేహం కూడా అంతేగా…!!
Share this Article